మెరుగైన సౌకర్యాల కల్పనే ధ్యేయం | The goal is a better facility | Sakshi
Sakshi News home page

మెరుగైన సౌకర్యాల కల్పనే ధ్యేయం

Published Sun, Sep 4 2016 12:08 AM | Last Updated on Thu, Jul 11 2019 8:52 PM

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే అజయ్‌ - Sakshi

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే అజయ్‌

ఖమ్మం జెడ్పీసెంటర్‌ : ఖమ్మం నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ధ్యేయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం నగరంలోని 16వ డివిజన్‌లో రూ.30 లక్షలతో సీసీరోడ్డు, సైడ్‌ డ్రెయినేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులన్నీ నిర్ణీత కాల వ్యవధిలో నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రజ లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చ ర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత, మేయర్‌ పాపాలాల్, డీసీసీబీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు, డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళి, కార్పొరేటర్‌ కమర్తపు మురళి, కమిషనర్‌ బి.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement