అవంతిక దెయ్యం అవుతుందట | Tamanna turns to Horror Movies | Sakshi
Sakshi News home page

అవంతిక దెయ్యం అవుతుందట

Published Fri, Jan 1 2016 9:24 AM | Last Updated on Sun, Sep 3 2017 2:55 PM

అవంతిక దెయ్యం అవుతుందట

అవంతిక దెయ్యం అవుతుందట

సౌత్ ఇండస్ట్రీలో గ్లామర్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారిన హీరోయిన్ మిల్కీబ్యూటీ తమన్నా. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్ రోల్స్ మాత్రమే చేస్తూ వస్తున్న ఈ బ్యూటీ తొలిసారిగా బాహుబలి సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్‌తో ఆకట్టుకుంది. అదే జోరులో ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అవుతోంది. తమిళంలో తెరకెక్కుతున్న ఓ హర్రర్ సినిమాలో దెయ్యంగా నటించడానికి అంగీకరించిందట మిల్కీ బ్యూటీ.

ఇప్పటికే హన్సిక, నయనతార లాంటి టాప్ హీరోయిన్లు దెయ్యాలుగా భయపెట్టడంతో తాను కూడా అదే ఫార్ములాతో హిట్ కొట్టాలని భావిస్తోంది. కోలీవుడ్‌లో ఆసామి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆండాల్ రమేష్ దర్శకత్వంలో హర్రర్ సినిమాకు రెడీ అవుతోంది తమన్నా. గతంలో హర్రర్ సినిమాలో నటించిన తారలు కాకుండా కొత్తవారితో సినిమా చేయాలని భావించిన రమేష్ తమన్నాను సంప్రదించాడట. చాలా రోజులుగా డిఫరెంట్ రోల్స్ కోసం వెయిట్ చేస్తున్న మిల్కీ బ్యూటీ కూడా ఈ పాత్రలో నటించడానికి ఇంట్రస్ట్ చూపిస్తోంది. త్వరలోనే ఈసినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వెలువడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement