తమిళసినిమా: నేను వెనకపడ్డ మాట నిజమేనని నటి తమన్నా అంగీకరించారు. తమన్నా భాటియా ఈ పేరు ఒకప్పుడు గ్లామర్‌కు అడ్రస్. ఇప్పుడు అభినయానికి అడ్డా. తమన్నా వయసు 28 ఏళ్లు అయితే అందులో సగంపైనే ఆమె నట వయసు. ఇప్పటికీ అగ్రకథానాయకిగా రాణిస్తున్నారు. ఇది అరుదైన విషయమే. మధ్యలో ఈ ముద్దుగుమ్మ మార్కెట్ కాస్త తడబడినా మళ్లీ నిలదొక్కుకుని స్టార్ హీరోల నుంచి వర్థమాన హీరోల వరకూ నటించేస్తున్నారు. ఈ మిల్కీబ్యూటీలో నటితో పాటు మంచి డాన్సర్ ఉన్నారు. ఈమె కచ్చితమైన కొలతల మేనందాలకు ఇదీ ఇక కారణంగా భావించవచ్చు. బాహుబలి వంటి కొన్ని చిత్రాల్లో తమన్నా నటనను మరువలేం. తన నట జీవితంలోనూ ఎత్తుపల్లాలను చవిచూసిన తమన్నా ప్రస్తుతం తెలుగు, తమిళంలో భాషల్లో చేతినిండా అవకాశాలతో బిజీగా ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో తమన్నా తన దశాబ్దన్నర నట జీవితాన్ని ఒక్కసారి నెమరువేసుకున్నారు. ఆ సంగతులేంటో చూసేస్తేపోలా! నేను సినిమాలోకి రంగప్రవేశం చేసి 15 ఏళ్లు అయ్యిందని ఎవరైనా చెబితేనే గుర్తుకొస్తుంది. అంతగా కాలం పరుగులు పెడుతోంది. 2005లో నేను నటించిన తొలి తెలుగు చిత్రం విడుదలైంది. అప్పుటి నుంచి ఇప్పటి వరకూ కథానాయకిగా కొనసాగుతుండడం సంతోషంగానూ, మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. తమిళం, తెలుగు, హిందీ అంటూ మూడు భాషల్లోనూ నటిస్తున్నాను.
అన్నీ చిత్రాలు ఏదో రకంగా పేరు తెచ్చి పెట్టాయి. ముఖ్యంగా చెప్పాలంటే నాకు దక్షిణాది సినిమానే అధికంగా ఆదరించింది. ఇంకా చెప్పాలంటే తెలుగు చిత్ర పరిశ్రమలో కొద్ది కాలమే కథానాయకిగా రాణించడం సాధ్యం. ఆ తరువాత పక్కన పెట్టేస్తారు. అలాంటిది నటి సౌందర్య తరువాత అనుష్క, కాజల్‌అగర్వాల్, నేను ఇప్పటికీ హీరోయిన్‌గా కొనసాగడం సంతోషకరమైన విషయం. విశ్రాంతి లేకుండా నటిస్తూనే ఉన్నాను. మంచి విభిన్న కథలు, నా పాత్రకు ప్రాముఖ్యత ఉన్న చిత్రాలనే అంగీకరిస్తున్నాను. తెలుగులో సక్సెస్‌లు లేని కాలంలో తమిళంలో సురా, తిల్లాలంగడి, చిరుతై, వీరం వంటి చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. ఇకపోతే సీనియర్ నటులతోనూ, వర్థమాన నటులతోనూ నటించడం వల్లే నాకు అవకాశాలు తగ్గాయా అన్న ప్రశ్న తలెత్తినా, ఆ వెనుకబడడం అన్నది తాత్కాలికమే.
Comments
Please login to add a commentAdd a comment