
తమన్నా
తెలుగు, తమిళం, కన్నడం, హిందీ ఇండస్ట్రీల్లో సినిమాలు చేసి మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు తమన్నా. నార్త్ టు సౌత్ తమన్నా అందరికీ పరిచయం. కానీ ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీకి తొలి పరిచయం కాబోతున్నారు. పద్నాలుగేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్న తమన్నా తొలిసారి మలయాళంలో స్ట్రయిట్ మూవీ చేస్తున్నారు.
గతంలో డబ్బింగ్ సినిమాల ద్వారా మలయాళంలో కనిపించారామె. ఇప్పుడు తొలి స్ట్రయిట్ సినిమాతోనే ప్రేక్షకులను భయపెడతానంటున్నారు. ‘సెంట్రల్ జైలిలే ప్రేతం’ (సెంట్రల్ జైల్‌లో దెయ్యం అని తెలుగు అర్థం) అనే హారర్ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నారు తమన్నా. కథ మొత్తం ఓ సెంట్రల్ జైల్, అందులో ఉండే దెయ్యాల చుట్టూ తిరుగుతుందట. ఇందులో మలయాళ, తమిళ స్టార్స్ యాక్ట్ చేయనున్నారు. సంధ్యా మీనన్ దర్శకురాలు.
Comments
Please login to add a commentAdd a comment