హార్రర్ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోన్న రెజీనా! | Regina Cassandra Re-Entry In Kollywood Films With Horror Movie | Sakshi
Sakshi News home page

Regina Cassandra: హార్రర్ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోన్న రెజీనా!

Published Thu, Sep 21 2023 8:29 AM | Last Updated on Thu, Sep 21 2023 8:42 AM

Regina Cassandra Re Entry In Kollywood Films With Horror Movie - Sakshi

టాలీవుడ్‌లో  శివ మనసులో శృతి, రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ రెజీనా. కోలీవుడ్‌ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన భామ టాలీవుడ్‌లో అగ్ర హీరోల సరసన నటించింది. ఇటీవలే ఓ వెబ్‌సిరీస్‌లోనూ నటించిన రెజీనా తాజాగా తమిళంలో కంజూరింగ్‌ కన్నప్పన్‌ అనే చిత్రం ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కల్పాతి ఎస్‌.అఘోరం, కల్పాతి ఎస్‌.గణేష్‌, కల్పాతి ఎస్‌.సురేష్‌ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటుడు సతీష నాజర్‌, శరణ్య పొన్‌వన్నన్‌, ఆనంద్‌రాజ్‌, వీటీవీ గణేష్‌, రెడిన్‌ కింగ్స్‌లీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీనికి సెల్విన్‌ రాజ్‌సేవియర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

(ఇది చదవండి: హీరోయిన్ త్రిషకు పెళ్లి? ఆ నిర్మాతతో ఏడడుగులు!)

ఈ చిత్రం గురించి సెల్విన్‌  మాట్లాడుతూ.. ఇది హార్రర్‌, కామెడీ జానర్‌లో రూపొందిస్తున్న చిత్రమని చెప్పారు. అయితే ఇది గత చిత్రాల తరహాలో ఉండదన్నారు. కథ, కథనాలు కొత్తగా ఉంటాయని తెలిపారు. హాలీవుడ్‌ స్టైల్‌లో కొన్ని విషయాలను చెప్పామన్నారు. వినూత్న కథాంశంతో కూడిన ఈ చిత్రాన్ని హార్రర్‌తో కూడిన ఫాంటసీ అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా రూపొందించినట్లు చెప్పారు. ఇందులోని క్యాష్‌బ్యాక్‌ సన్నివేశాలను బ్రహ్మాండంగా చిత్రీకరించినట్లు తెలిపారు. మంచి చిత్రాన్ని చేయాలనే భావనతో నిర్మాతలు ఖర్చుకు ఏమాత్రం వెనుకావట్లేదని చెప్పారు. చిత్ర షూటింగ్‌ అధిక భాగం పూర్తి అయిందని.. మరోపక్క నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని దర్శకుడు సెల్విన్‌ రాజ్‌సేవియర్‌ తెలిపారు. కాగా.. ప్రస్తుతం బాలీవుడ్‌లో సెక్షన్‌ 108 చిత్రంలో నటిస్తోంది భామ. ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ నటిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement