
పాత కథలే అయినా కొత్తగా తెరకెక్కిస్తే ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. అదే హారర్ సినిమాల విషయాలకొస్తే... కథలో కొత్తదనం లేకపోయినా... తెరకెక్కించే విధానం, మధ్యలో హాస్యాన్ని జోడించడం లాంటివి చేస్తే హారర్ మూవీలు విజయాన్ని సాధిస్తాయి. ప్రేమ కథా చిత్రమ్, ఆనందో బ్రహ్మ, గీతాంజలి లాంటి సినిమాలు ఇదే కోవలోకి వస్తాయి. భారీ తారాగణం లేకపోయినా భారీ స్థాయి విజయాన్ని అందుకోవచ్చని అంజలి హీరోయిన్‌గా తెరకెక్కిన ‘గీతాంజలి’ నిరూపించింది.
ప్రస్తుతం హీరోయిన్ అంజలి మరో హారర్ మూవీలో నటించనున్నట్లు పేర్కొన్నారు. త్రీడీలో తెరకెక్కుతున్న ‘లీసా’ సినిమాలో లీడ్ రోల్‌ను చేయనున్నట్లు అంజలి తెలిపారు. సరికొత్త కథ, కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం... తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటుందని తెలుస్తోంది. ఈ సినిమాకు రాజు విశ్వనాథ్ దర్శకత్వం వహించనున్నారు.
Me as Lisaa 🤗,, my next tamil #ANJALIasLISAA pic.twitter.com/rGzdpnTs4m
— Anjali (@yoursanjali) May 21, 2018
Comments
Please login to add a commentAdd a comment