![హర్రర్ చిత్రంలో విశాకాసింగ్ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/81435956805_625x300.jpg.webp?itok=MqZBsJ_t)
హర్రర్ చిత్రంలో విశాకాసింగ్
కోలీవుడ్ హర్రర్ చిత్రాల హవా నడుస్తోందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే సాధారణంగా ఈ తరహా చిత్రాల్లో కథ,కథనాల కే ప్రాధాన్యం ఉంటుంది. కనుక దర్శకనిర్మాతలు ప్రముఖ నటీనటుల జోలికి పోరు. అలాంటిది ఈ మధ్య వారిని వదలడం లేదు. ఇంకా చెప్పాలంటే చంద్రముఖి హర్రర్ కథా చిత్రమే. అందులో సూపర్‌స్టార్ రజనీకాత్ నటించిన విషయం గమనార్హం.అలాగే నటుడు సూర్య దెయ్యం ఇతి వృత్తంతో కూడిన మాస్ చిత్రంలో నటించారు. నయనతార మాయ అంటూ హర్రర్ సృష్టించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఇదే కోవలోకి నటి విశాకాసింగ్ చేరింది.
కన్నాలడ్డు తిన్న ఆశయా చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఈ బ్యూటీకి ఆ చిత్రం మంచి ఎంట్రీనే అయ్యింది.అయితే ఆ తరువాతే అవకాశాలు రాలేదు. నటి ప్రియా ఆనంద్ సిఫారసు మేరకు ఒక్క ఊరుల రెండు రాజా చిత్రంలో చిన్న పాత్ర చేసింది. బహుశా అదే ఆమె చేసిన పెద్ద తప్పు కావచ్చు.ఆ తరువాత పూర్తిగా కోలీవుడ్‌కు దూరమైంది. అలాంటి భామను వెతికి మళ్లీ తీసుకొస్తున్నారు నవ దర్శకుడు మణిశర్మ. ఈరం చిత్ర దర్శకుడు అరివళగన్ శిష్యుడైన ఈయన ఒక హర్రర్ చిత్రం ద్వారా మెగాఫోన్ పట్టనున్నారు.
ఇది కమర్శియల్ అంశాలతో కూడిన హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని అంటున్నారాయన. విశాకాసింగ్‌కు ఈ చిత్రంలో చాలా ప్రాముఖ్యత ఉంటుందంటున్నారు. త్వరలో సెట్‌పైకి వెళ్లడానికి సిద్ధం అవుతున్న ఈ చిత్రంలో నటించే హీరో, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని వెల్లడించారు.