సడెన్‌గా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేసిన 'ముంజ్యా' హరర్‌ సినిమా | Horror Comedy Movie Munjya Streaming In OTT | Sakshi
Sakshi News home page

సడెన్‌గా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేసిన 'ముంజ్యా'

Published Sun, Aug 25 2024 10:55 AM | Last Updated on Sun, Aug 25 2024 11:37 AM

Horror Comedy Movie Munjya Streaming In OTT

బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హార‌ర్ సినిమా 'ముంజ్యా' సడెన్‌గా ఓటీటీలో విడుదల అయింది. ఎలాంటి ప్రకటన లేకుండా ఈ చిత్ర మేకర్స్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం రూ. 25 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ. 140 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

ముంజ్యా సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నవారికి డిస్నీ+ హాట్‍స్టార్ సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఎలాంటి ప్రకటన లేకుండానే నేడు (ఆగష్టు 25) ఓటీటీలో విడుదలైంది. అయితే, కేవలం హిందీ వర్షన్‌లో మాత్రమే ఈ సినిమా అందుబాటులో ఉంది. త్వరలో తెలుగులో కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది.

ఆదిత్య సర్పోట్దార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో  మోనా సింగ్‌, శార్వరి, అభయ్‌ వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. పెద్ద సినిమాలను సైతం వెనక్కు నెట్టి బాక్సాఫీస్‌ దగ్గర  ముంజ్యా సత్తా చాటింది. మ్యాడ్‌డాక్‌ సూపర్‌నేచురల్‌ యూనివర్స్‌లో ఇప్పటివరకు స్త్రీ, రూహి, భేడియా సినిమాలు రాగా ఇప్పుడు వచ్చిన ముంజా నాలుగవది. ఈ యూనివర్స్‌లో వచ్చిన స్త్రీ 2 ఐదో సినిమా. ఇప్పుడు బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement