హన్సిక ప్రధాన పాత్రలో నటించిన హారర్ మూవీ గార్డియన్. తమిళంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి శబరి గురు శరవణన్ దర్శకత్వం వహించాడు. మార్చి 8న థియేటర్లలో రిలీజైన ఈమూవీ బిగ్ డిజాస్టర్‌గా నిలిచింది. మొదటి వారంలో థియేటర్లలో మాయమైపోయింది. తాజాగా ఈ చిత్రం ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీకి వచ్చేసింది.
హారర్ నేపథ్యంలో తెరకెక్కించిన గార్డియన్ మూవీ ఓవర్‌సీస్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం సింప్లీసౌత్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇండియాలోని ఆడియన్స్‌కు త్వరలోనే అందుబాటులోకి రానుంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ హారర్ మూవీ రానున్నట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్‌లో తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సురేష్ చంద్ర మీనన్, శ్రీమాన్ కీలక పాత్రలు పోషించారు.
అసలు కథేంటంటే..
రోటీన్ హారర్ స్టోరీగా దర్శకుడు శబరి గురుశరవణన్ తెరకెక్కించారు. అపర్ణ (హన్సిక) ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తుంది. ఓ ప్రమాదంలో గాయపడిన అపర్ణ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆమెను ఓ ఆత్మ ఆవహిస్తుంది. అపర్ణ సహాయంతో సిటీలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతోన్న వారిపై ఆత్మ ప్రతీకారం తీర్చుకుంటుంది? అసలు ఆ ఆత్మ ఎవరు? అపర్ణ శరీరంలోకి ఆ ఆత్మ ఎలా ప్రవేశించింది? ఆ ఆత్మ కారణంగా అపర్ణ జీవితంలో ఎలా చిక్కుల్లో పడింది అన్నదే అసలు కథ.
Comments
Please login to add a commentAdd a comment