అతివృష్టి, అనావృష్టి.. వర్షం విషయంలోనే కాదు బాక్సాఫీస్ విషయంలోనూ ఇది జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి భారీ బడ్జెట్ సినిమాలు కనీస వసూళ్లు కూడా రాబట్టలేక చతికిలపడుతుంటే చిన్న చిత్రాలు మాత్రం ఊహించని స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తుంటాయి. మొదటి సందర్భంలో నిర్మాత పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతే రెండో సందర్భంలో మాత్రం నిర్మాత పంట పండినట్లే! మరి ప్రపంచంలోనే అత్యధికంగా లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఏదో మీకు తెలుసా? లక్షలు పెట్టి తీస్తే వేల కోట్లు కొల్లగొట్టిన ఆ సినిమా ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే!
కశ్మీర్ ఫైల్స్.. పెట్టుబడి రూ.15 కోట్లు వసూళ్లు.. కలెక్షన్స్ రూ.350 కోట్లు. వావ్, గ్రేట్ అని నోరెళ్లబెడుతున్నారేమో.. 'పారానార్మల్ యాక్టివిటీ' సినిమా సంగతి చెప్తే దిమ్మ తిరిగి బొమ్మ కనబడటం ఖాయం! ఈ హాలీవుడ్ సినిమా ఏకంగా 13,30,000 శాతం లాభాలను అందుకుంది. ఈ సినిమాను 2007లో హాలీవుడ్ డైరెక్టర్ ఓరెన్ పెలి తెరకెక్కించాడు. తనే కథ రాసుకుని, దర్శకత్వం వహించి స్వయంగా నిర్మించాడు. ఈ సినిమాలో నలుగురు మనుషులు, ఒక అస్థిపంజరం ఇవి మాత్రమే కనిపిస్తాయి. ఈ సినిమా తీయడానికి ఆయనకు 15 వేల డాలర్లు (2007లో భారతీయ కరెన్సీ ప్రకారం రూ.6 లక్షలు) ఖర్చయ్యాయి.
అయితే పారామౌంట్ పిక్చర్స్ బ్యానర్ ఈ సినిమాను సొంతం చేసుకుని క్లైమాక్స్‌లో కాస్త మార్పులుచేర్పులు చేసి దానికి మరిన్ని హంగులు అద్ది రిలీజ్ చేసింది. దీనికి దాదాపు రూ.90 లక్షలు ఖర్చయ్యాయి. ఈ సినిమా ఎవరూ ఊహించనంతగా హిట్టయింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 193 మిలియన్ డాలర్లు (2007లో భారతీయ కరెన్సీ ప్రకారం రూ.800 కోట్లు) రాబట్టింది. ప్రపంచంలోనే తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. అప్పటివరకు లాభాల పంట పండించిన చిత్రంగా 'ద బ్లైయిర్ విచ్ ప్రాజెక్ట్' పేరిట ఉన్న రికార్డును పారానార్మల్ యాక్టివిటీ మూవీ తన స్వాధీనం చేసుకుంది.
ఈ ఊపుతో 'పారానార్మల్ యాక్టివిటీ' సినిమాకు సీక్వెల్స్ కూడా తీశారు. వరుసగా ఆరు సీక్వెల్స్ తీయగా ఇవి మొత్తంగా రూ.7320 కోట్లు రాబట్టాయి. ఇలా తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన సినిమాల్లో ద బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్ రెండో స్థానంలో ఉంటుంది. 1999లో వచ్చిన 'ద బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్' రూ.85 లక్షలతో తెరకెక్కగా రూ.1045 కోట్లు రాబట్టింది. 2003లో వచ్చిన టార్నేషన్ కేవలం రూ10,000తో తెరకెక్కగా రూ.5.5 కోట్లు సాధించింది. రెండు లక్షలతో తెరకెక్కిన పోర్నోగ్రఫీ చిత్రం 'డీప్ త్రోట్' రూ.17 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. రూ.87వేలతో నిర్మితమైన 'ఎరేజర్ హెడ్' సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.6 కోట్లు కలెక్షన్ల వర్షం కురిపించింది.
చదవండి: బ్రో సహా మరో బాలీవుడ్ సినిమాకు ఆదరణ కరువు, రిటైర్‌మెంట్ తీసుకోమన్న కంగనా
పెళ్లైన 6 ఏళ్లకే విడాకులు.. విడిపోవడం కష్టంగా ఉందని నటి పోస్ట్
Comments
Please login to add a commentAdd a comment