బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హారర్ సినిమా ముంజ్యా ఓటీటీ విడుదల కంటే బుల్లితెరపైకి రానుంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం రూ. 25 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 140 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. మోనా సింగ్, శార్వరి, అభయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పెద్ద సినిమాలను సైతం వెనక్కు నెట్టి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. మ్యాడ్‌డాక్ సూపర్‌నేచురల్ యూనివర్స్‌లో ఇప్పటివరకు స్త్రీ, రూహి, భేడియా సినిమాలు రాగా ఇప్పుడు వచ్చిన ముంజా నాలుగవది. త్వరలోనే ఈ యూనివర్స్‌లో స్త్రీ 2 ఐదో సినిమాగా రాబోతోంది.
నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టిన ముంజ్యా సినిమా ఓటీటీ కంటే ముందే టీవీల్లోకి రానుందని ప్రకటన వచ్చేసింది. స్టార్ గోల్డ్ ఛానల్ మంజ్యా సినిమా టెలికాస్ట్ గురించి ప్రకటించింది. ఆగస్ట్ 24న రాత్రి ఎనిమిది గంటలకు బుల్లితెరపై ఈ చిత్రాన్ని చూసేయండని పేర్కొంది.
అయితే, ఇప్పటికే ముంజ్యా ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కానీ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ఇప్పటికీ కూడా ప్రకటించలేదు. స్టార్ గోల్డ్ ఛానెల్ ముందుగా ప్రకటించి ప్రేక్షకులను తమపైపు తిప్పుకుంది. దీంతో హాట్‌స్టార్ కూడా అలెర్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 9న ముంజ్యా చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని ఆ సంస్థ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment