ఈ రోజు (శుక్రవారం) నుంచి షురూ అంటున్నారు జాన్వీ కపూర్. తన కొత్త చిత్రం గురించే జాన్వీ కపూర్ ఇలా చెబుతున్నారు. ఆమె కథానాయికగా నటిస్తున్న హారర్ మూవీ ‘రూహీ అఫ్జా’ శుక్రవారం మొదలైంది. ఇందులో రాజ్‌కుమార్ రావ్ హీరోగా నటిస్తున్నారు. హార్థిక్ మెహతా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ శర్మ కీలక పాత్రధారి. దినేష్ విజన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ శుక్రవారం మొదలైంది. ‘‘సినిమా అభిమానులందరూ శ్రద్ధగా ఆలకించండి. నా తర్వాతి హిందీ చిత్రం ఈ రోజు మొదలైంది’’ అని జాన్వీ కపూర్ అన్నారు. ఈ సినిమా కాకుండా వీరవనిత గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘కార్గిల్ గాళ్’ సినిమాలోనూ నటిస్తున్నారు జాన్వీ కపూర్. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment