నీలగిరి కొండల్లో... | Karthik Subbaraj to bankroll Aishwarya Rajesh next | Sakshi
Sakshi News home page

నీలగిరి కొండల్లో...

Published Fri, Sep 20 2019 3:18 AM | Last Updated on Fri, Sep 20 2019 3:18 AM

Karthik Subbaraj to bankroll Aishwarya Rajesh next - Sakshi

ఐశ్వర్య రాజేశ్‌

కోలీవుడ్‌ బిజీ హీరోయిన్‌ ఐశ్వర్య రాజేశ్‌ నిర్మానుష్య నీలగిరి కొండల్లో ఎవరి కోసమో వెతుకులాట ప్రారంభించనున్నారు. ఈ వెతుకులాట వెనక ఓ పెద్ద మిస్టరీ ఉంది. ఈ మిస్టరీ వివరాలు ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఇటీవల ‘కౌసల్య కృష్ణమూర్తి: దిక్రికెటర్‌ ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ఐశ్వర్య. తాజాగా కోలీవుడ్‌లో ఓ లేడీ ఓరియంటెడ్‌ సినిమాకు గ్రీన్‌ సిగ్న్‌ల్‌ ఇచ్చారు.

రతీంద్రన్‌ ఆర్‌. ప్రసాద్‌ దర్శకత్వం వహించనున్నారు. మిస్టరీ, హారర్, థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాకు దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ ఓ నిర్మాత. తమిళంలో రూపొందనున్న ఈ సినిమా చిత్రీకరణ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. నీలగిరి కొండల్లో ఈ చిత్రం మేజర్‌ షూటింగ్‌ జరుగుతుంది. ఈ సినిమాకు పృథ్వీ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement