మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్-సెన్సెషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇది రామ్‌చరణ్‌కు 15వ సినిమా కావడంతో ఆర్‌సీ 15 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడింది. అప్పటి నుంచి ఈ మూవీకీ సంబంధించిన అప్‌డేట్స్ వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో మరో డైరెక్టర్ భాగస్వామ్యం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ శంకర్ స్క్రిప్ట్‌ను డెవలప్ చేసే పనిని కార్తీక్ సుబ్బారాజుకు అప్పగించారట. ఓ స్ట్రాంగ్ లైన్‌ను కార్తీక్‌కు వివరించి దీనిపై పని చేయమని శంకర్ చెప్పినట్లు తెలుస్తోంది.
చదవండి: RC 15: రామ్ చరణ్‌కు గట్టి పోటీ ఇవ్వబోతోన్న ఫహద్ ఫాజిల్!
దీంతో కార్తీక్ సుబ్బారాజు స్క్రిప్ట్‌ను మరింత ఆసక్తిగా మలిచే పనిలో బిజీగా ఉన్నట్లు ఫిలిం దూనియాలో విడికిడి. అయితే దీనిపై డైరెక్టర్లు శంకర్ కానీ, కార్తీక్ కానీ ఇంతవరకు స్పందించలేదు. అయితే ఇందులో ఎంతమేర నిజముందనేది ఈ డైరెక్టర్లు స్పందించేవరకు వేచి చూడాలి. కాగా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సమర్ఫణలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మిగతా తారాగణంపై కూడా త్వరలోనే అధికారిక ప్రకటన వెలువనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పై వెళ్లనుంది.
చదవండి: ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి క్రేజీ అప్‌డేట్.. షూటింగ్ పూర్తి, కానీ..
Comments
Please login to add a commentAdd a comment