ఓటీటీకి రూ.250 కోట్ల సూపర్ హిట్‌ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Malayalam Super Hit Movie L2 Empuraan OTT Streaming Date Announced | Sakshi
Sakshi News home page

L2 Empuraan OTT Date: ఓటీటీకి మోహన్ లాల్ సూపర్ హిట్‌ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

Apr 17 2025 7:11 PM | Updated on Apr 17 2025 7:28 PM

Malayalam Super Hit Movie L2 Empuraan OTT Streaming Date Announced

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన యాక్షన్ చిత్రం ఎల్‌2: ఎంపురాన్. ఈ మూవీకి సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. 2019లో వచ్చిన లూసిఫర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఉగాది కానుకగా థియేటర్లలో విడుదలైన ఎంపురాన్ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. విడుదలైన 15 రోజుల్లోనే ఇండియన్‌ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మార్కును దాటేసింది. మార్చి 27న థియేటర్లలోకి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్‌ దేశీయ మార్కెట్‌లో వందకోట్లకు పైగా నికర వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్ల సాధించిన ఎంపురాన్.. మలయాళ ఇండస్ట్రీలోనే తొలి చిత్రంగా నిలిచింది.

తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీ జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈనెల 24 నుంచి మలయాళం, తెలుగు, తమిళం, కన్నడలో స్ట్రీమింగ్ కానుందని ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంది. అయితే హిందీలో స్ట్రీమింగ్ ఎప్పుడనేది మాత్రం క్లారిటీ లేదు. కాగా.. ఈ చిత్రంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌తో పాటు  మంజు వారియర్, టోవినో థామస్, జెరోమ్ ఫ్లిన్, సూరజ్ వెంజరమూడు కీలక పాత్రల్లో నటించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement