JioHotstar
-
ఓటీటీ/ థియేటర్లో ఈ వారం 10కి పైగా సినిమాలు విడుదల
ఏప్రిల్ మొదటి వారంలో థియేటర్, ఓటీటీలలో పెద్దగా సినిమాల సందడి కనిపించలేదు. మార్చి చివరన వచ్చిన సినిమాలతోనే అభిమానులు ఎంజాయ్ చేశారు. అయితే, ఈ వారంలో బాక్సాఫీస్ వద్ద కాస్త సందడి వాతావరణం కనిపించనుంది. రేసులో సిద్ధు నటించిన జాక్, అజిత్, త్రిష నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీతో పాటు సన్నీ డియోల్- దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ సినిమా 'జాట్' ఉంది. ఇదే క్రమంలో ఓటీటీ నుంచి కూడా కాస్త పర్వాలేదనే సినిమాలే ఉన్నాయి.థియేటర్స్‌లోకి వచ్చే సినిమాలు🎥 జాక్- ఏప్రిల్ 10🎥 గుడ్ బ్యాడ్ అగ్లీ -ఏప్రిల్ 10🎥 జాట్- ఏప్రిల్ 10🎥 బజూక- ఏప్రిల్ 10🎥 అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి- ఏప్రిల్ 11🎥 కౌసల్య తనయ రాఘవ- ఏప్రిల్ 11ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు/ వెబ్సిరీస్లునెట్ఫ్లిక్స్🎥 కోర్టు- ఏప్రిల్ 11🎥 పెరుసు (తెలుగు/ తమిళ్)- ఏప్రిల్ 11🎥 బ్లాక్ మిర్రర్ 7 (వెబ్‌సిరీస్/ఇంగ్లిష్)- ఏప్రిల్ 10 🎥 కిల్ టోనీ (వెబ్‌సిరీస్/ఇంగ్లిష్)- ఏప్రిల్ 7అమెజాన్ ప్రైమ్ వీడియో🎥 ఛోరీ 2 (హిందీ)- ఏప్రిల్ 11🎥 ఇన్ ది లాస్ట్ ల్యాండ్స్ ( ఇంగ్లీష్) - ఏప్రిల్ 8 🎥 జీ20 (ఇంగ్లీష్)- ఏప్రిల్ 10జియో హాట్‌స్టార్🎥 ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ 6 (యానిమేషన్ సిరీస్/హిందీ)- ఏప్రిల్ 11🎥 ది లాస్ట్ ఆఫ్ అజ్ (హిందీ/ తెలుగు/ ఇంగ్లీష్)- ఏసోనీలివ్🎥 ప్రావింకూడు షాపు (తెలుగు/ మలయాళం)- ఏప్రిల్ 11 జీ5🎥 కింగ్స్‌స్టన్ (తమిళ్/తెలుగు)- ఏప్రిల్ 13 -
ఫ్రీగా జియో హాట్‌స్టార్.. ఆఫర్ ప్లాన్ల పొడిగింపు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫీవర్ దేశాన్ని ఊపేస్తోంది. ఈ ఐపీఎల్-2025 18వ సీజన్ ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఈ సీజన్ ఈసారి కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ అవుతోంది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు జియో హాట్‌స్టార్‌లో ఐపీఎల్‌ను ఉచితంగా వీక్షించే ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను జియో లాంచ్ చేసింది.జియో ప్రకటించిన ఆఫర్ల ప్రకారం.. జియో హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందించే ప్రత్యేక ప్లాన్లను రీఛార్జ్ చేసుకునేందుకు మార్చి 31 వరకు అవకాశం ఉండేది. అయితే ఈ టోర్నమెంట్ కు లభిస్తున్న ఆదరణ దృష్ట్యా ఈ ఆఫర్ ను ఏప్రిల్ 15 వరకు పొడిగిస్తూ జియో నిర్ణయం తీసుకుంది. జియో హాట్‌స్టార్ ఉచిత సబ్స్క్రిప్షన్ కోసం కొత్త జియో సిమ్ కొనడం లేదా ప్రత్యేక ప్లాన్లతో ఇప్పటికే ఉన్న ప్లాన్లను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.జియో హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో యూజర్లు 4కే రిజల్యూషన్ లో టీవీ, మొబైల్ రెండింటిలోనూ ఐపీఎల్‌ను ఉచితంగా వీక్షించవచ్చు. ఈ ప్లాన్ ద్వారా అభిమానులు ఈ సీజన్‌లోని ప్రతి మ్యాచ్‌ను ఇంట్లో లేదా ప్రయాణంలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా హై క్వాలిటీ స్ట్రీమింగ్‌ను ఆస్వాదించవచ్చు.ఫ్రీ జియో హాట్‌స్టార్ ప్లాన్లు ఇవే..రూ.100 ప్లాన్: ఇది డేటా యాడ్ఆన్ ప్లాన్. దీంతో 5జీబీ డేటా, 90 రోజులపాటు జియో హాట్‌స్టార్ యాక్సెస్ లభిస్తుంది.రూ.195 ప్లాన్: ఇది జియో క్రికెట్ డేటా ప్యాక్. దీంతో 15జీబీ డేటా, 90 రోజులపాటు జియో హాట్‌స్టార్ యాక్సెస్ లభిస్తుంది.రూ.949 ప్లాన్: ఇది 84 రోజుల కాంప్రహెన్సివ్ ప్లాన్. దీంతో ప్రతిరోజూ 2జీబీ 4జీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్, 5జీ ప్రయోజనాలు ఉంటాయి. 84 రోజులపాటు జియో హాట్‌స్టార్ యాక్సెస్ లభిస్తుంది. అదనంగా జియోక్లౌడ్, ఓటీటీ, ఇతర టెలికమ్ బెనిఫిట్లు ఆనందించవచ్చు. -
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్'.. హాట్‌స్టార్ అలా క్లూ ఇచ్చేసిందా..?
ప్రముఖ రియల్టీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్- 9 కొన్ని నెలల్లో ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది ఆగష్టు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ షో మొదలౌతుందని తెలిసిందే. అంటే మరో నాలుగు నెలల్లో బిగ్‌బాస్ రన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే అందుకు సంబంధించిన పనుల్లో యూనిట్ ఉంది. సీజన్-9లో పాల్గొనే కంటెస్టంట్స్ ఎంపిక విషయంలో బిగ్‌బాస్ టీమ్ ఉంది.సోషల్‌మీడియాలో బాగా వైరల్ అయిన వారికే బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఛాన్స్ దక్కుతుంది. అలాంటి వారినే టీమ్ సెలక్ట్ చేస్తుంది. అయితే, కొద్దిరోజులుగా 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్ నెట్టింట వైరల్ అవుతున్నారు. సోషల్‌మీడియాలో మిలియన్ల కొద్ది వారికి ఫాలోవర్స్ ఉన్నారు. చాలాకాలంగా పచ్చళ్ళ వ్యాపారం చేస్తూ ట్రెండింగ్‌లో ఉన్నారు. అయితే, కస్టమర్స్‌పై వారు బూతులతో విరుచుకుపడటం.. అందుకు సంబంధించిన ఆడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్‌పై మీమ్స్, ట్రోల్స్, వీడియోలు కనీసం 100 మిలియన్స్‌కు పైగానే వ్యూస్‌తో ట్రెండ్ అవుతున్నాయి. అలా అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్‌లలో (చిట్టి, అలేఖ్య, రమ్య) ఒకరికి తప్పుకుండా బిగ్‌బాస్‌లోకి ఛాన్స్ వస్తుందని నెట్టింట వైరల్ అవుతుంది. కానీ, రమ్యకు ఛాన్స్ దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయిని తెలుస్తోంది. మోడ్రన్ డ్రెస్‌లతో ఆమె రీల్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి కూడా.. రీసెంట్గా జియోహాట్‌స్టార్‌లో పికిల్స్‌కు సంబంధించిన ఒక సీన్‌ను వారు షేర్ చేశారు. ప్రభాస్ ఛత్రపతి సినిమా నుంచి ఒక వీడియోను విడుదల చేశారు.ఇదే విషయంపై బిగ్‌బాస్ ఆదిరెడ్డి కూడా తన యూట్యూబ్ ఛానల్లో అభిప్రాయం చెప్పాడు. వారిలో ఒకరు బిగ్‌బాస్‌కు రావచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు. అసలు బిగ్‌బాస్‌కు కూడా కావాల్సింది ఇలాంటి కాంట్రవర్సీ వ్యక్తులే అని చెప్పవచ్చు. అప్పుడే తమ రేటింగ్స్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదని వారు అనుకుంటారు. ఇంత గొడవ జరుగుతున్నా సరే అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ ధైర్యంగా కెమెరాల ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పి వివరణ ఇచ్చారు. ఆపై లెక్కలేనన్ని నెగటివ్ కామెంట్లు వస్తున్నా సరే వాటిని తట్టుకుని నిలబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి వారి పేర్లు నోటెడ్ అయిపోయాయి. ఇలా ఎన్నో అంశాలు వారికి బిగ్‌బాస్ ఛాన్స్ దక్కేలా చేస్తాయని చెప్పవచ్చు. Guess we're in a pickle 🫠Ippudu mirchi kaavali ante, hotstar lone chuddali 🙃#Chatrapathi #Prabhas #HomemadePickle #JioHotstarTelugu pic.twitter.com/tqAC5ELmLg— JioHotstar Telugu (@JioHotstarTel_) April 3, 2025 -
ఐపీఎల్ మజా.. ఎయిర్టెల్ కొత్త ప్లాన్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ప్రారంభం నేపథ్యంలో ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో రెండు కొత్త డేటా వోచర్లను ప్రవేశపెట్టింది. రూ.100, రూ.195 ధర కలిగిన ఈ కొత్త ప్లాన్లు జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తోపాటు అదనపు డేటా కోసం చూస్తున్న వినియోగదారులకు ఉపయోగపడతాయి. ఈ వోచర్లను ఇప్పటికే ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్ పైన రీఛార్జ్ చేసుకోవచ్చు.రూ.100 డేటా వోచర్ఎయిర్టెల్ రూ .100 డేటా వోచర్ 5 జీబీ అదనపు డేటాతో పాటు జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను 30 రోజుల పాటు అందిస్తుంది. ఐపీఎల్ 2025 మ్యాచ్‌లను ప్రయాణంలో లేదా మొబైల్ ఫోన్ లేదా టాబ్లెట్‌లో చూడాలనుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ అనువైనది.రూ.195 డేటా వోచర్ఎయిర్టెల్ రూ .195 డేటా వోచర్ 15 జీబీ డేటా, 90 రోజుల వ్యాలిడిటీతో జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. ఎక్కువ వ్యాలిడిటీ, అధిక డేటాతోపాటు జియో హాట్‌స్టార్ కంటెంట్ యాక్సెస్ కావాలనుకునే యూజర్లకు ఈ ప్లాన్ సరిపోతుంది.ఇతర జియో హాట్‌స్టార్ ప్లాన్లుజియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో మరికొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లను కూడా ఎయిర్టెల్ అందిస్తోంది. రూ.3,999, రూ.1,029, రూ.549, రూ.398 విలువైన ఈ ప్లాన్లు సర్వీస్ వ్యాలిడిటీ, అధిక డేటా పరిమితులు, అదనపు బెనిఫిట్స్ వంటి వివిధ ప్రయోజనాలను అందిస్తున్నాయి. -
వ్యూయర్షిప్లో జియోహాట్‌స్టార్ కొత్త రికార్డులు
న్యూఢిల్లీ: దేశీయంగా లైవ్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ వ్యూయర్షిప్లో జియోహాట్‌స్టార్ కొత్త రికార్డులు నెలకొల్పింది. ఇటీవల ముగిసిన ‘ఐసీసీ పురుషుల క్రిక్రెట్ చాంపియన్స్ ట్రోఫీ 2025’ మ్యాచ్‌లకు సంబంధించి 540 కోట్ల వ్యూస్, దాదాపు 11,000 కోట్ల నిమిషాల వాచ్‌టైమ్ నమోదైంది. డిస్నీ స్టార్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన వయాకామ్ 18 విలీనంతో జియోహాట్‌స్టార్ ఏర్పాటైన తర్వాత స్ట్రీమ్ చేసిన తొలి భారీ క్రికెట్ టోర్నమెంట్ ఇది.ఇందులో న్యూజిల్యాండ్ మీద భారత్ గెల్చిన ఫైనల్ మ్యాచ్‌కి ఏకంగా 124.2 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఒక దశలో, ఏకకాలంలో వీక్షించిన వారి సంఖ్య 6.12 కోట్లుగా నమోదైంది. గతంలో డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారమైన 2023 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ని అత్యధికంగా 5.9 కోట్ల మంది వీక్షించారు.తాజా టోర్నిలో భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌కు 60.2 కోట్ల స్ట్రీమింగ్ వ్యూస్ వచ్చాయి. భారత్‌లో డిజిటల్ స్ట్రీమింగ్కు పెరుగుతున్న ఆదరణను తాజా గణాంకాలు సూచిస్తున్నాయని జియోస్టార్ డిజిటల్ సీఈవో కిరణ్ మణి తెలిపారు. ఐసీసీ టోర్నమెంటును తొలిసారిగా తెలుగు, తమిళం తదితర తొమ్మిది భాషల్లోను, సైన్ ల్యాంగ్వేజ్లోను, ఆడియో కామెంటరీ రూపంలోనూ అందించినట్లు వివరించారు. -
CT 2025: రికార్డులు బద్దలు.. సరికొత్త చరిత్ర! ఏకంగా 11 వేల కోట్లకు పైగా..
భారత్‌లో క్రికెట్ ఓ ‘మతం’ లాంటిది.. వేదిక ఏదైనా టీమిండియా ఆడుతోందంటే అందరూ టీవీలకు అతుక్కుపోవాల్సిందే. ఆ వెసలుబాటు లేని వాళ్లకు డిజిటల్ మీడియా రూపంలో ప్రత్యామ్నాయం ఉండనే ఉంది. ఇక ఇటీవల జరిగిన మెగా ఐసీసీ ఈవెంట్ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) జియోహాట్‌స్టార్(JioHotstar)లో ప్రత్యక్ష ప్రసారం అయిన విషయం తెలిసిందే.11 వేల కోట్ల నిమిషాలకు పైగాఈ నేపథ్యంలో తాజాగా ఈ టోర్నమెంట్ వ్యూయర్‌షిప్‌నకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఈ వన్డే టోర్నీకి 540.3 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక వాచ్ టైమ్ ఏకంగా 11 వేల కోట్ల నిమిషాలకు పైగా నమోదు కావడం విశేషం. అంతేకాదు.. ఓవరాల్‌గా 6.2 కోట్ల మంది వ్యూయర్స్ ఈ మెగా ఈవెంట్‌ను వీక్షించినట్లు బ్రాడ్‌కాస్టర్ వెల్లడించింది.కాగా 2017లో చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించారు. నాటి ఫైనల్లో టీమిండియాపై గెలిచి పాకిస్తాన్ టైటిల్ సొంతం చేసుకుంది. అయితే, అప్పటి నుంచి సుదీర్ఘకాలం పాటు ఈ టోర్నీని వాయిదా వేశారు. ఈ క్రమంలో 2025లో తిరిగి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్(Pakistan) ఆతిథ్య హక్కులు దక్కించుకోగా.. టీమిండియా మాత్రం భద్రతా కారణాల వల్ల దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడింది.కాగా పాకిస్తాన్లో 1996 తర్వాత ఓ ఐసీసీ టోర్నీ జరగడం ఇదే తొలిసారి. ఇక ఫిబ్రవరి 19న పాకిస్తాన్లో మొదలైన ఈ వన్డే ఈవెంట్ మార్చి 9న భారత్- న్యూజిలాండ్ మధ్య దుబాయ్ వేదికగా ఫైనల్‌తో ముగిసింది. హిట్‌మ్యాన్ ఖాతాలో రెండో ఐసీసీ టైటిల్ఇక ఈ టోర్నమెంట్లో రోహిత్ సేన ఆది నుంచి ఆఖరి వరకు అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్... సెమీస్‌లో ఆస్ట్రేలియాను, ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది.తద్వారా హిట్‌మ్యాన్ ఖాతాలో రెండో ఐసీసీ టైటిల్ చేరింది. మరోవైపు.. ఈ వన్డే టోర్నీలో తొలిసారి అడుగుపెట్టిన అఫ్గనిస్తాన్ ఇంగ్లండ్ వంటి పటిష్ట జట్టును చిత్తు చేసి గెలుపు నమోదు చేయడం విశేషం. ఇక వన్డే వరల్డ్‌కప్-2023 విజేత ఆసీస్‌పై రన్నరప్ టీమిండియా ప్రతీకారం తీర్చుకోవడం కూడా హైలైట్‌గా నిలిచింది.ఇన్ని ప్రత్యేకతలు ఉన్న చాంపియన్స్ ట్రోఫీ-2025ని కోట్లాది మంది వీక్షించడంలో ఆశ్చర్యమేమీ లేకపోయినా.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 540 కోట్లకు పైగా వ్యూస్ రావడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్' 18 నెట్‌వర్క్‌లో టీవీలో ప్రసారాలు జరుగగా.. జియోహాట్‌స్టార్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం చేశారు. అత్యధిక వ్యూస్ ఆ మ్యాచ్కేకాగా మిగతా మ్యాచ్‌లతో పోలిస్తే టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఫైనల్‌కు అత్యధిక వ్యూస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ పోరుకు ఏకంగా 124.2 కోట్ల వీక్షణలు వచ్చాయి.కాగా మొత్తంగా చాంపియన్స్ ట్రోఫీకి వచ్చిన వ్యూయర్షిప్లో ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, గోవా, పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి 38 శాతం మేర వ్యూస్ వచ్చినట్లు సమాచారం. ఇక వైఫై సాయంతో మ్యాచ్ వీక్షించిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందు ఉంది. కాగా 16 మాధ్యమాల్లో చాంపియన్స్ ట్రోఫీని ప్రసారం చేశారు. తొమ్మిది భాషల్లో కామెంట్రీ ఇచ్చారు.ఇక ఈ మెగా టోర్నీలో గెలవడం ద్వారా భారత్ ఖాతాలో ఏడో ఐసీసీ టైటిల్ చేరింది. 1983 వన్డే వరల్డ్‌కప్, 2002లో శ్రీలంకతో కలిసి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ, 2024 టీ20 ప్రపంచకప్, 2025 చాంపియన్స్ ట్రోఫీలను భారత్ గెలుచుకుంది. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పాల్గొన్నాయి. దుబాయ్‌తో పాటు కరాచీ, లాహోర్, రావల్పిండి ఇందుకు వేదికలు.చదవండి: IPL 2025: అతడి గురించి ఎవరూ మాట్లాడమే లేదు.. మూడో స్థానంలో ఆడిస్తారా? -
ఓటీటీలో సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన 'సోనూ సూద్' సినిమా
నెగటివ్ క్యారెక్టర్స్‌లో తనదైన విలనిజాన్ని పండించిన సోనూ సూద్ హీరోగా నటించిన బాలీవుడ్ చిత్రం 'ఫతే' సడెన్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రానికి సోనూయే దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు.‘ఫతే’ మూవీకి రచయిత కూడా సోనూనే కావడం విశేషం. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్హీరోయిన్గా నటించింది. నసీరుద్దీన్ షా, విజయ్ రాజ్, నాగినీడు కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న థియేటర్స్‌లో ఈ మూవీ సందడి చేసింది.సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఫతే చిత్రం సడెన్‌గా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ప్రస్తుతం కేవలం హిందీ వర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, మరో వారంలోపు తెలుగు వర్షన్లో కూడా ఈ చిత్రం రానుందని తెలుస్తోంది. ఈ మూవీతోనే డైరెక్టర్‌గా అరంగేట్రం చేసిన సోనూ ప్రేక్షకులను మెప్పించాడు. సైబర్ క్రైమ్‌లో ఎదురయ్యే సవాళ్ల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సుమారు రూ. 50 కోట్ల బడ్జెట్‌తో ఫతే చిత్రాన్ని సోనూసూద్ భార్య సోనాలి సూద్ నిర్మించింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 30 కోట్ల లోపే కలెక్షన్స్ రాబట్టింది.కథేంటి..?సైబర్ నేరాలు ఎలా జరుగుతాయో ఈ చిత్రంలో చూపించారు. పంజాబ్‌లోని ఒక గ్రామంలో పాల వ్యాపారం చేస్తున్న ఫతేహ్ సింగ్ (సోనూసూద్) వద్ద పని చేసే వ్యక్తి లోన్ యాప్ నిర్వాహుకల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ సంఘటన ఫతేహ్లో తీవ్రమైన ఆవేదన ఏర్పడుతుంది. అతని ఆత్మహత్యకు కారణం లోన్ యాప్ అని తెలుసుకుని లోతుగా పరిశీలిస్తాడు. ఈ క్రమంలో ఇదే లోన్ యాప్ వల్ల చాలమంది మరణించారని తెలుసుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో తన ఇంట్లో నివసించే నిమ్రత్ కౌర్ (శివజ్యోతి రాజ్‌పుత్)ను ఓ సైబర్ క్రైమ్ ముఠా కిడ్నాప్ చేస్తుంది. ఆమెను కాపాడే క్రమంలో ఫతేహ్కు అనేక సమస్యలు ఎదురౌతాయి. ఆమెను వారు ఎందుకు కిడ్నాప్ చేశారు..? ఆ లోన్ యాప్ సంస్థతో నిమ్రత్‌ను కిడ్నాప్ చేసిన ముఠాకు ఉన్న లింక్ ఏంటి..? పాల వ్యాపారం చేసే ఫతేహ్ గతమేంటి..? హ్యాకర్ ఖుషీతో (జాక్వెలైన్) ఫతేహ్కు ఉన్న సంబంధం ఏంటి..? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ చిత్రంలో మితిమీరిన హింస ఉంటుంది. సోనూసూద్ యాక్షన్ ఎపిసోడ్స్‌కు ఫిదా అవుతారు. ముఖ్యంగా సెకండాఫ్ బాగా నచ్చుతుంది. -
జియో కొత్త ప్లాన్.. జియోహాట్‌స్టార్ ఫ్రీ
రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం కొత్త రూ.195 డేటా-ఓన్లీ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్ డేటా యాడ్-ఆన్ వోచర్‌గా వస్తుంది. ఇది అదనపు డేటాతోపాటు జియోహాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉంటుంది. ప్రత్యేక సబ్స్క్రిప్షన్ కొనుగోలు చేయకుండా జియోహాట్‌స్టార్‌లో లైవ్ క్రికెట్, ఇతర కంటెంట్‌ను వీక్షించాలనుకునే వారి కోసం ఈ ప్లాన్‌ను రూపొందించారు.రూ.195 ప్లాన్ ప్రయోజనాలురూ.195 డేటా ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 15GB డేటాను అందిస్తుంది. క్రీడలు, వినోద ప్రియులకు ఇది తగిన ఎంపికగా ఉంటుంది. ఇతర ప్రామాణిక రీఛార్జ్ ప్లాన్ల మాదిరిగా ఈ ఆఫర్లో వాయిస్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. గుర్తించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో లభించే జియోహాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ 90 రోజుల మొబైల్ ప్లాన్ మాత్రమే. అంటే యూజర్లు జియోహాట్‌స్టార్‌ను మొబైల్లో మాత్రమే వీక్షించగలరు.రీచార్జ్ ఇలా..వినియోగదారులు ఈ ఆఫర్‌ను మైజియో (MyJio) యాప్, జియో వెబ్సైట్ లేదా అధీకృత జియో రిటైలర్ల ద్వారా పొందవచ్చు. రీఛార్జ్ ప్రక్రియ ఇతర జియో ప్రీపెయిడ్ ప్లాన్ల మాదిరిగానే ఉంటుంది. థర్డ్-పార్టీ రీఛార్జ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.మరో ప్లాన్రూ.195 డేటా ప్లాన్‌తోపాటు జియో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా వచ్చే మరో స్టాండర్డ్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. అదే రూ.949 ప్లాన్. దీనికి 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. 2GB రోజువారీ డేటా, అపరిమిత 5G డేటా, 84 రోజుల పాటు జియో హాట్‌స్టార్ ఉచిత మొబైల్ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలను ఈ ప్లాన్ అందిస్తుంది. -
ఓటీటీలో చిన్నారులను మెప్పించే 'సైన్స్ ఫిక్షన్' సినిమా
పిల్లలను ఎంతగానో ఆలరించిన యానిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'ది వైల్డ్ రోబోట్' ఓటీటీలోకి వచ్చేసింది. క్రిస్ సాండర్స్ దర్శకత్వం వహించిన ఈ మూవీ గతేడాది సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమాలో సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చాయి. సుమారు రూ. 2800 కోట్లకు పైగానే కలెక్షన్స్ వచ్చినట్లు అంచనా ఉంది.ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న 'ది వైల్డ్ రోబోట్' చిత్రం తాజాగా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఇంగ్లీష్ వర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవతుంది. డ్రీమ్ వర్క్స్ యానిమేషన్ పతాకంపై జెఫ్ హెర్మాన్ ఈ చిత్రాన్ని రూ. 670 కోట్లతో నిర్మించారు. అయితే, సుమారుగా రూ. 2000 కోట్లకు పైగానే లాభాలు వచ్చాయి. సైన్స్ ఫిక్షన్ మూవీ ఇష్టపడే పెద్దలతో పాటు చిన్నారలను ఈ చిత్రం బాగా మెప్పిస్తుంది. -
జియో హాట్‌స్టార్ ఫ్రీగా కావాలా?
రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్, జియోఫైబర్ ప్లాన్లను జియో హాట్‌స్టార్ (JioHotstar) సబ్‌స్క్రిప్షన్‌తో అప్డేట్ చేసింది. వీటిలో జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో ఒక కొత్త ప్లాన్‌ను తీసుకురాగా, డిస్నీ+ హాట్‌స్టార్‌కు బదులుగా జియోహాట్‌స్టార్‌ను చేర్చడానికి మరికొన్ని ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ జియోఫైబర్ ప్లాన్లను అప్డేట్ చేసింది.జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో జియో ప్రీపెయిడ్ ప్లాన్రిలయన్స్ జియో తన రూ.949 ప్రీపెయిడ్ ప్లాన్‌ను జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో అప్డేట్ చేసింది. ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్, అపరిమిత 5G డేటా, రోజుకు 2GB 4G డేటాతో వస్తుంది. అదనంగా, ఇది జియో టీవీ, జియోక్లౌడ్తో పాటు 3 నెలల పాటు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉంటుంది. అయితే ఇందులో చేర్చిన జియో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ 'మొబైల్' ప్లాన్ అని గమనించడం ముఖ్యం.జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో జియోఫైబర్ ప్లాన్లుజియోఫైబర్ రూ.999 ప్లాన్: ఈ ప్లాన్ అపరిమిత డేటా, వాయిస్ కాలింగ్‌తో 150 Mbps వేగాన్ని అందిస్తుంది. అంతేకాకుండా వినియోగదారులు ఈ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ లైట్, జియో హాట్‌స్టార్‌తో పాటు 8 ఇతర ఓటీటీ సబ్స్క్రిప్షన్లను పొందుతారు. అలాగే ఈ ఆఫర్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లకు వర్తిస్తుంది.జియోఫైబర్ రూ.1,499 ప్లాన్: ఈ ప్లాన్ అపరిమిత డేటా, వాయిస్ కాలింగ్‌తో 300 Mbps వేగాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఈ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ లైట్, జియో హాట్‌స్టార్‌తో పాటు 8 ఇతర ఓటీటీ సబ్స్క్రిప్షన్లను అందుకోవచ్చు. ఈ ఆఫర్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లకు వర్తిస్తుంది.జియోఫైబర్ రూ.2,499 ప్లాన్: అపరిమిత డేటా , వాయిస్ కాలింగ్‌తో 500 Mbps వేగాన్ని అందిస్తుంది. దీంతోపాటు వినియోగదారులు ఈ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ లైట్, జియో హాట్‌స్టార్‌తో పాటు 8 ఇతర ఓటీటీ సబ్స్క్రిప్షన్లను ఆనందించవచ్చు. ఈ ఆఫర్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లకు వర్తిస్తుంది.రూ.3999, రూ.8499 ప్లాన్లు: అపరిమిత డేటా, వాయిస్ కాలింగ్‌తో 1 Gbps వేగాన్ని అందిస్తుంది. అంతేకాకుండా, వినియోగదారులు ఈ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ లైట్, జియో హాట్‌స్టార్‌తో పాటు 8 ఇతర ఓటీటీ సబ్స్క్రిప్షన్లను పొందుతారు. ఈ ఆఫర్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లకు వర్తిస్తుంది.జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్లుజియో ఎయిర్ ఫైబర్ రూ.599 ప్లాన్: 1000GB డేటా, 30Mbps వేగం, ఉచిత వాయిస్ కాలింగ్‌తో పాటు 800 టీవీ ఛానెల్‌లు, జియో హాట్ స్టార్ తో సహా మొత్తం 9 ఓటీటీలను అందిస్తుంది.జియో రూ.899, రూ.1199 ప్లాన్లు: 1000GB డేటా, 100Mbps వేగం, ఉచిత వాయిస్ కాలింగ్‌తో పాటు 800 టీవీ ఛానెల్‌లు, జియో హాట్‌స్టార్‌తో సహా మొత్తం 13 ఓటీటీలను అందిస్తుంది. -
జియో హాట్‌స్టార్ ఆవిష్కరణ.. ఇకపై ఐపీఎల్ ఫ్రీ కాదు!
రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ కంపెనీల అనుబంధ సంస్థలుగా ఉన్న జియోస్టార్, జియో సినిమా, డిస్నీ + హాట్స్టార్లను పరస్పరం విలీనం చేస్తూ సమగ్ర స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘జియో హాట్‌స్టార్(JioHotStar)’ను అధికారికంగా ప్రారంభించారు. ఈ విలీనంతో దేశంలోని తమ వినియోగదారులకు వినోదం, క్రీడలతోపాటు మరెన్నో ఎంటర్టైన్మెంట్ సదుపాయాలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇరు సంస్థల అధికారులు తెలిపారు.సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ఇలా..జియో హాట్ స్టార్ హైబ్రిడ్ సబ్ స్క్రిప్షన్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం హాలీవుడ్ సినిమాలు మినహా ప్రతి నెలా పరిమిత గంటల పాటు వినియోగదారులు కంటెంట్‌ను ఉచితంగా వీక్షించవచ్చు. అంతకుమించి వీక్షించాలంటే మాత్రం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఐపీఎల్‌ను జియో, హాట్స్టార్లు ఫ్రీగా అందించేవి. కానీ మ్యాచ్‌ను పూర్తిగా వీక్షించాలంటే మాత్రం ఇకపై ప్రీమియం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రకటనలతో కేవలం మొబైల్ మాత్రమే వీక్షించాలంటే త్రైమాసికానికి రూ.149 నుంచి సబ్స్క్రిప్షన్ ప్లాన్లు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. యాడ్-ఫ్రీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ త్రైమాసికానికి రూ.499గా నిర్ణయించారు. రెండు డివైజ్‌లకు సపోర్ట్ చేసేలా రెండు సూపర్ ప్లాన్ల(యాడ్ బేస్)ను తీసుకొచ్చింది. దీనికి త్రైమాసికానికి ధర రూ.299. ఏడాదికి రూ.899 చెల్లించాలి. ప్రకటనలు లేకుండా కంటెంట్ వీక్షించాలంటే ఏడాది వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.1499గా నిర్ణయించారు.ప్రస్తుత వినియోగదారులపై ప్రభావంజియో సినిమా, డిస్నీ + హాట్స్టార్లను ప్రస్తుతం వాడుతున్న చందాదారులు జియో హాట్‌స్టార్‌కు మారుతారు. జియో సినిమా ప్రీమియం చందాదారులు తమ ప్లాన్ల మిగిలిన కాలవ్యవధి కోసం జియో హాట్ స్టార్ ప్రీమియంకు మైగ్రేట్ అవుతారు. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రైబర్లు మూడు నెలలపాటు అదే ప్లాన్‌లో కొనసాగి తర్వాత జియో హాట్‌స్టార్‌కు మారే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: యాప్ స్టోర్‌లో టిక్‌టాక్ పునరుద్ధరణ!జియో హాట్‌స్టార్‌లో కంటెంట్..డిస్నీ, ఎన్బీసీ యూనివర్సల్ పీకాక్, వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ, హెచ్‌బీఓ, పారామౌంట్.ప్రాంతీయ, బాలీవుడ్ సినిమాలు, టీవీ షోలు.ఎక్స్‌క్లూజివ్ ఒరిజినల్స్ అండ్ రియాలిటీ షోలు, డ్రామా, థ్రిల్లర్స్, ఎంగేజింగ్ రియాలిటీ కంటెంట్.ఐపీఎల్, డబ్ల్యుపీఎల్, ఐసీసీ ఈవెంట్లు వంటి ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంట్లు, ప్రీమియర్ లీగ్, వింబుల్డన్, ప్రో కబడ్డీ, ఐఎస్ఎల్ వంటి ప్రపంచ క్రీడా ఈవెంట్లు. -
అడిగితే 'జియో హాట్‌స్టార్' ఇచ్చేస్తాం: చిన్నారుల ఆఫర్
కొన్ని రోజులకు ముందు తీవ్ర చర్చకు దారితీసిన జియో హాట్‌స్టార్ డొమైన్ వ్యవహారం.. మళ్ళీ మరో కీలక మలుపు తిరిగింది. తాజాగా దుబాయ్‌కి చెందిన ఇద్దరు చిన్నారులు తాము కొనుగోలు చేసిన జియో హాట్‌స్టార్ డొమైన్‌ను రిలయన్స్ సంస్థకు ఉచితంగా ఇచ్చేస్తాం అంటూ ఆఫర్ ఇచ్చారు.నిజానికి జియో హాట్‌స్టార్ విలీనం వేళ.. ఈ పేరుతో ఉన్న డొమైన్‌ను ఢిల్లీకి చెందిన యాప్ డెవలపర్ ముందుగానే తన పేరుతో రిజిస్టర్ చేసుకున్నాడు. తాను కొనుగోలు చేసిన డొమైన్‌ను ఇవ్వాలంటే రూ. కోటి రూపాయలు ఇవ్వాలంటూ.. అంబానీకి ఆఫర్ ఇచ్చాడు. ఆ తరువాత డొమైన్‌ను దుబాయ్‌కు చెందిన ఇద్దరు చిన్నారులు కొనుగోలు చేశారు.జియో హాట్‌స్టార్ కొనుగోలు చేసిన చిన్నారులు.. దీనికి సంబంధించిన ఓ కీలక ప్రకటన చేశారు. ఈ డొమైన్‌ను రిలయన్స్ కంపెనీ కోరుకుంటే ఉచితంగానే ఇచ్చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక రిలయన్స్ సంస్థ నుంచి గానీ.. సంబంధిత అధికారుల నుంచి గానీ ఎలాంటి ఒత్తిడి లేదు. మనస్ఫూర్తిగానే మేము ఈ ప్రకటన చేస్తున్నామని ఆ చిన్నారులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: మాస్క్డ్ ఆధార్ కార్డు గురించి తెలుసా?: ఇది చాలా సేఫ్..చిన్నారులు ఇచ్చిన ఆఫర్‌కు కంపెనీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అంతకంటే ముందు యాప్ డెవలపర్ నుంచి చిన్నారులు కొనుగోలు చేసిన తరువాత.. చాలామంది ఆ డొమైన్‌ను విక్రయించండి, అంటూ ఆఫర్ చేసినట్లు వెల్లడించారు. కానీ ఎవరికీ డొమైన్‌ను విక్రయించలేదని వారు స్పష్టం చేశారు. కేవలం యాప్ డెవలపర్‌కు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో జియో హాట్‌స్టార్ డొమైన్ కొనుగోలు చేసినట్లు చిన్నారులు వెల్లడించారు.