![JioStar the joint venture between Reliance and the Walt Disney officially launched JioHotstar](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/jio01.jpg.webp?itok=fevg6WDE)
రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ కంపెనీల అనుబంధ సంస్థలుగా ఉన్న జియోస్టార్, జియో సినిమా, డిస్నీ + హాట్‌స్టార్లను పరస్పరం విలీనం చేస్తూ సమగ్ర స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘జియో హాట్‌స్టార్(JioHotStar)’ను అధికారికంగా ప్రారంభించారు. ఈ విలీనంతో దేశంలోని తమ వినియోగదారులకు వినోదం, క్రీడలతోపాటు మరెన్నో ఎంటర్‌టైన్‌మెంట్ సదుపాయాలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇరు సంస్థల అధికారులు తెలిపారు.
సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ఇలా..
జియో హాట్ స్టార్ హైబ్రిడ్ సబ్ స్క్రిప్షన్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం హాలీవుడ్ సినిమాలు మినహా ప్రతి నెలా పరిమిత గంటల పాటు వినియోగదారులు కంటెంట్‌ను ఉచితంగా వీక్షించవచ్చు. అంతకుమించి వీక్షించాలంటే మాత్రం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఐపీఎల్‌ను జియో, హాట్‌స్టార్‌లు ఫ్రీగా అందించేవి. కానీ మ్యాచ్‌ను పూర్తిగా వీక్షించాలంటే మాత్రం ఇకపై ప్రీమియం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రకటనలతో కేవలం మొబైల్ మాత్రమే వీక్షించాలంటే త్రైమాసికానికి రూ.149 నుంచి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. యాడ్-ఫ్రీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ త్రైమాసికానికి రూ.499గా నిర్ణయించారు. రెండు డివైజ్‌లకు సపోర్ట్ చేసేలా రెండు సూపర్ ప్లాన్ల(యాడ్ బేస్)ను తీసుకొచ్చింది. దీనికి త్రైమాసికానికి ధర రూ.299. ఏడాదికి రూ.899 చెల్లించాలి. ప్రకటనలు లేకుండా కంటెంట్ వీక్షించాలంటే ఏడాది వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.1499గా నిర్ణయించారు.
ప్రస్తుత వినియోగదారులపై ప్రభావం
జియో సినిమా, డిస్నీ + హాట్‌స్టార్‌లను ప్రస్తుతం వాడుతున్న చందాదారులు జియో హాట్‌స్టార్‌కు మారుతారు. జియో సినిమా ప్రీమియం చందాదారులు తమ ప్లాన్‌ల మిగిలిన కాలవ్యవధి కోసం జియో హాట్ స్టార్ ప్రీమియంకు మైగ్రేట్ అవుతారు. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్లు మూడు నెలలపాటు అదే ప్లాన్‌లో కొనసాగి తర్వాత జియో హాట్‌స్టార్‌కు మారే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.
ఇదీ చదవండి: యాప్ స్టోర్‌లో టిక్‌టాక్ పునరుద్ధరణ!
జియో హాట్‌స్టార్‌లో కంటెంట్..
డిస్నీ, ఎన్‌బీసీ యూనివర్సల్ పీకాక్, వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ, హెచ్‌బీఓ, పారామౌంట్.
ప్రాంతీయ, బాలీవుడ్ సినిమాలు, టీవీ షోలు.
ఎక్స్‌క్లూజివ్ ఒరిజినల్స్ అండ్ రియాలిటీ షోలు, డ్రామా, థ్రిల్లర్స్, ఎంగేజింగ్ రియాలిటీ కంటెంట్.
ఐపీఎల్, డబ్ల్యుపీఎల్, ఐసీసీ ఈవెంట్లు వంటి ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంట్లు, ప్రీమియర్ లీగ్, వింబుల్డన్, ప్రో కబడ్డీ, ఐఎస్ఎల్ వంటి ప్రపంచ క్రీడా ఈవెంట్లు.
Comments
Please login to add a commentAdd a comment