L2: Empuraan
-
బాక్సాఫీస్ వద్ద ఎంపురాన్.. ఆ సినిమా రికార్డ్ సేఫ్!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం ఎల్2: ఎంపురాన్. ఈ మూవీకి సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. 2019లో వచ్చిన లూసిఫర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఉగాది కానుకగా థియేటర్లలో విడుదలైన ఎంపురాన్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలిరోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ మూవీ.. మలయాళ ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.ఈ మూవీ రిలీజైన 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 257కు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ సాధించింది. ఈ వసూళ్లతో ఎల్2 ఎంపురాన్ 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో ఇండియన్ సినిమాగా నిలిచింది. అంతేకాకుండా మలయాళంలో ఆల్‌టైమ్ అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. అయితే ఈ సినిమా 2018 మూవీ రికార్డ్‌ను మాత్రం అధికగమించలేకపోయింది. అయితే 2023లో విడుదలైన 2018 సినిమా కేరళ వ్యాప్తంగా రూ.88.7 కోట్లు రాబట్టగా.. ఎంపురాన్ ఇప్పటి వరకు కేవలం రూ.80 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ విషయంలో 2018 మూవీని ఎల్2 ఎంపురాన్ దాటలేకపోయింది. కాగా.. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. -
తప్పు చేయలేదు.. మాకెందుకు భయం: స్టార్ హీరో తల్లి
సినిమాలు అప్పుడప్పుడు వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటాయి. రీసెంట్ టైంలో 'ఎల్ 2: ఎంపురాన్' (L2 Empuraan Movie) చిత్రం ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిలోనే ఉందని చెప్పొచ్చు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కొన్ని సన్నివేశాలున్నాయని తొలిరోజే విమర్శలు రావడంతో నిర్మాత గోపాలన్, హీరో మోహన్ లాల్ (Mohanlal) క్షమాపణలు చెప్పారు.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు ఆంథాలజీ సినిమా)మరోవైపు నిర్మాత గోకులం గోపాలన్ ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ రైడ్స్ జరగ్గా.. లెక్కల్లో చూపని కొంత డబ్బు బయటపడింది. మరోవైపు ఈ చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్( Prithviraj Sukumaran)కి కూడా ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. గత రెండు-మూడేళ్ల రెమ్యునరేషన్ లెక్కలు చూపించాలని మెయిల్ పంపింది. ఈ క్రమంలోనే పృథ్వీరాజ్ తల్లి మల్లిక స్పందించారు.'నా కొడుకు ఏ తప్పు చేయలేదు. మేం దర్యాప్తుకి రెడీ. భయపడటం లేదు. ఈ విషయాన్ని మాకు సపోర్ట్ గా ఉన్న వాళ్లకు థ్యాంక్యూ. మమ్ముట్టి మాకు ధైర్యాన్నిస్తున్నారు. ఈ వార్తలన్నీ చూసి మాకు ధైర్యం చెప్పారు. దీంతో నాకు కన్నీళ్లొచ్చాయి' అని మల్లిక సుకుమారన్ చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: తారక్ కి ప్రేమతో.. సుకుమార్ ఇంట్లో ఎన్టీఆర్) -
ఓవైపు వివాదాలు.. మరోవైపు వసూళ్లతో ఇండస్ట్రీ రికార్డ్
రీసెంట్ టైంలో రిలీజైన వెంటనే వివాదాల్లో చిక్కుకున్న సినిమా 'ఎల్ 2 ఎంపురాన్'(L2 Empuraan Movie). సలార్ ఫేమ్ పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ లాల్ (Mohanlal) హీరోగా నటించారు. గతంలో వచ్చిన లూసిఫర్ మూవీకి ఇది సీక్వెల్. రిలీజ్ దగ్గర నుంచి కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన ఈ చిత్రం వసూళ్లలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది.ఈ సినిమాలో మత విద్వేషాల రెచ్చగొట్టేలా కొన్ని సన్నివేశాలు ఉండటంపై విడుదలైన రోజే అభ్యంతరాలు వచ్చాయి. దీంతో నిర్మాత గోకులం గోపాలన్, హీరో మోహన్ లాల్ క్షమాపణలు చెప్పారు. ఇది కాదన్నట్లు నిర్మాత ఆఫీస్, ఇంటిపై ఐటీ రైడ్స్ జరిగాయి. దర్శకుడు పృథ్వీరాజ్ కి కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు.. రెమ్యునరేషన్ లెక్కలు చెప్పమని నోటీసులు జారీ చేశారు.(ఇదీ చదవండి: చేదు అనుభవం.. శ్రీలీలని పట్టి లాగేశారు)ఇలా దాదాపు వారం రోజుల నుంచి వార్తల్లో ఉన్న ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు (Movie Collection) వచ్చాయి. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. తద్వారా ఈ మూవీ మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్ సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది.ఈ సినిమాకు తొలుత మిశ్రమ స్పందన వచ్చింది. కథ కంటే ఎలివేషన్లు ఎక్కువయ్యాయమని తెలుగు ప్రేక్షకుల నుంచి టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు కలెక్షన్స్ చూస్తుంటే మలయాళ, ఓవర్సీస్ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినట్లు కనిపిస్తుంది.(ఇదీ చదవండి: పెద్ది vs ప్యారడైజ్.. ఒకరు కాదు పోటీలో ముగ్గురు) -
మోహన్‌లాల్ కారు డ్రైవర్‌కు ఐటీ నోటీసులు..
మలయాళ చిత్రపరిశ్రమలో 'L2 ఎంపురాన్' చిత్రం చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పలువురికి ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) నోటీసులు పంపింది. ఈ సినిమా నిర్మాత గోకులం గోపాలన్ కార్యాలయంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ చిత్ర దర్శకుడు, నటుడు పృథ్విరాజ్ సుకుమారన్‌కు కూడా ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. తాజాగా లూసిఫర్-1 నిర్మాత ఆంథోనీ పెరుంబవూర్‌కు కూడా ఐటీ నోటీసులు జారీ చేయడం గమనార్హం. 2019లో విడుదలైన సినిమాకు సంబంధించి ఇప్పుడు నోటీసులు ఇవ్వడం ఏంటి అంటూ నెటిజన్లు తప్పుబడుతున్నారు.లూసిఫర్-1 నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్‌కు నోటీసులు ఇవ్వడం వెనుక 'L2 ఎంపురాన్' కారణం కాదని ఐటీ శాఖ పేర్కొంది. 'మరక్కార్: అరేబియా సముద్ర సింహం, లూసిఫర్' సినిమాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై స్పష్టత ఇవ్వాలని నోటీసులో తెలిపింది. ఈ నెలాఖరులోగా నోటీసుకు సమాధానం ఇవ్వాలని ఆంథోనీ పెరుంబవూరును ఐటీ శాఖ కోరింది. 2022లో మొత్తం సినిమా పరిశ్రమలో ఐటీ దాడులు చేసిందని, దానికి కొనసాగింపుగానే ఈ చర్య తీసుకున్నట్లు ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. సినిమాకు సంబంధించి ఓవర్సీస్ హక్కులు, నటీనటులకు చెల్లించే రెమ్యూనరేషన్ వంటి విషయాల్లో క్లారిటీ ఇవ్వాలని ఆంథోనీ పెరుంబవూరును అధికారులు ప్రధానంగా ప్రశ్నించారు.మోహన్‌లాల్ కారు డ్రైవర్ 'ఆంటోనీ పెరుంబవూర్'మోహన్‌లాల్‌కు వీరాభిమాని 'ఆంటోనీ పెరుంబవూర్'.. సుమారు 20 ఏళ్ల క్రితం ఆంటోనీ సొంతూరులో మోహన్‌లాల్ సినిమా షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ కోసం కొన్ని కార్లు అవసరం రావడంతో అక్కడే ఉన్న ఒక కాంట్రాక్టర్‌తో ఆ చిత్ర నిర్మాత ఒప్పందం చేసుకున్నాడు. అలా తొలిసారి మోహన్‌లాల్ వద్దకు తాత్కాలిక డ్రైవర్‌గా ఆంటోనీ వెళ్లాడు. ఆ సినిమా పూర్తి అయిన కొద్దిరోజులకు మోహన్‌లాల్‌కు పర్సనల్ డ్రైవర్ కావాలని అనుకున్నాడు. అప్పుడు ఆయనకు వెంటనే గుర్తొచ్చిన పేరు ఆంటోనీ.. వెంటనే అతన్ని పిలిచి తన వద్ద పనిచేస్తావా..? అని ఆఫర్ ఇచ్చాడు. దీంతో ఆయన కూడా వెంటనే ఒప్పుకొని పనిలో సెట్ అయ్యాడు. అలా వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అప్పటికే స్టార్ హీరోగా ఉన్న మోహన్‌లాల్ చిత్ర నిర్మాణ రంగంలో అడుగుపెట్టాలనుకున్నాడు. దీంతో తనే ఫైనాన్షియర్‌గా ఉంటూ ఆంటోనీని నిర్మాతను చేశాడు. అలా ఆయన చాలా సినిమాలకు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌గా విడుదల చేశాడు. L2 ఎంపురాన్ ప్రాజెక్ట్‌లో కూడా అంటోనీ నిర్మాతగా ఉన్నారు. -
సినిమా వివాదం.. 'సలార్' విలన్ కి నోటీసులు
గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన 'ఎల్2: ఎంపురాన్' (L2: Empuran Movie) పలు వివాదాలకు కారణమైంది. కొన్ని సీన్లు మత విద్వేషాలని రెచ్చగొట్టేలా ఉన్నాయని అభ్యంతరాలు రావడంతో సెన్సార్ మళ్లీ కత్తెరకు పనిచెప్పింది. దీంతో చాలా సన్నివేశాల్ని తొలగించారు. అయితే ఆ గొడవ ఇంకా చల్లారనట్లు కనిపిస్తోంది.ఈ సినిమాని రిలీజ్ చేసిన నిర్మాత గోకులం గోపాలన్ ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు జరిగాయి. రూ.1000 కోట్ల మేర అక్రమ సంపాదన గుర్తించినట్లు వార్తలొస్తున్నాయి. ఇది నిజమా కాదా అని అనుకునేలోపే చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran)కి షాక్ తగిలింది. 2022 నుంచి సినిమాల ద్వారా ఆర్జించిన మొత్తం గురించి లెక్కలు చెప్పాలని ఐటీ అధికారులు నోటీసులు పంపించారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 18 మూవీస్)కడువ, జనగణమన, గోల్డ్ సినిమాలకు సంబంధించి రెమ్యునరేషన్ సమాచారం అందించాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించిన పృథ్వీరాజ్.. ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. కానీ కో ప్రొడ్యూసర్ గా రూ.40 కోట్ల మేర ఆర్జించనట్లు తెలుస్తోంది.ఇదంతా కూడా చాలా సాధారణమైన నోటీసులు అని ఆదాయపు పన్ను శాఖ నోటీసుల్లో పేర్కొంది. గత నెల 29న పృథ్వీరాజ్ కి మెయిల్ రాగా.. ఏప్రిల్ 29లోగా దీనిపై వివరణ ఇవ్వాలని క్లారిటీ ఇచ్చారు. స్వతహాగా పృథ్వీరాజ్ మలయాళ నటుడు అయినప్పటికీ.. సలార్ (Salaar Movie) చిత్రంతో తెలుగు వాళ్లకు బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం మహేశ్-రాజమౌళి మూవీలోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్') -
బాక్సాఫీస్ వద్ద ఎంపురాన్.. మంజుమ్మెల్ బాయ్స్ రికార్డ్ బ్రేక్!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం 'ఎల్2: ఎంపురాన్'. సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మార్చి 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా రికార్డ్ సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.100 కోట్ల మార్క్ దాటేసిన లూసిఫర్ సీక్వెల్.. తాజాగా మరో మైలురాయిని చేరుకుంది. విడుదలైన ఎనిమిది రోజుల్లోనే క్రేజీ రికార్డ్‌ను సొంతం చేసుకుంది.ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. గతేడాది సూపర్‌హిట్‌గా నిలిచిన మంజుమ్మెల్ బాయ్స్‌ను అధిగమించి అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా ఎంపురాన్ నిలిచింది. మంజుమ్మల్ బాయ్స్ రూ.242 కోట్లతో సాధించి మలయాళ మూవీ ఇండస్ట్రీలో రికార్డుకెక్కింది. తాజాగా ఆ రికార్డ్‌ను లూసిఫర్-2 అధిగమించింది. దీంతో మోహన్ లాల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 2019లో వచ్చిన లూసిఫర్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. సుమారు రూ.140 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్లో లూసిఫర్2 చిత్రాన్ని తెరకెక్కించారు.ఇక దేశీయంగా వసూళ్లు పరిశీలిస్తే రూ.88.25 కోట్ల నికర వసూళ్లు సాధించింది. అలాగే ఓవర్సీస్లోనే ఎెంపురాన్ అద్భుతాలు సృష్టిస్తోంది. ఏకంగా రూ.103 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్లో ఖాయంగా కనిపిస్తోంది. -
L2: ఎంపురన్ చిత్ర నిర్మాత ఆఫీసుల్లో ఈడీ సోదాలు
-
'లూసిఫర్2' నిర్మాత ఆఫీస్లపై ఈడీ దాడులు.. రూ. 1000 కోట్ల కేసులో
మోహన్‌లాల్ (Mohanlal) ప్రధాన పాత్రలో నటించిన ‘ఎల్2: ఎంపురాన్’ (L2:Empuraan) చుట్టూ వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాత ఆఫీస్‌లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. 2002లో గుజరాత్లో చోటుచేసుకున్న అల్లర్లను తప్పుగా ఇందులో కీలక సన్నివేశాలుగా చూపించారని విమర్శలు వచ్చాయి. ఆపై విలన్ పేరును భజరంగిగా పెట్టడం కూడా తప్పుబట్టారు. బీజేపీ ఎంపీ, మలయాళ నటుడు సురేష్ గోపీ కూడా రాజ్యసభలో ఈ మూవీపై మాట్లాడారు. ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు ఈ చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలంటూ పిలుపునిచ్చారు. ఇలాంటి సమయంలో నిర్మాతపై ఈడీ దాడులు చేయడం చర్చనియాంశంగా మారింది.లూసిఫర్2 సినిమాపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో నిర్మాతలలో ఒకరైన గోకులం గోపాలన్ చిట్ ఫండ్ కంపెనీలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఆయనకు సంబంధించిన తమిళనాడు, కేరళ కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేసింది. సుమారు రూ.1,000 కోట్ల విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘన కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. చెన్నైలోని కోడంబాక్కంలోని గోకుల్ చిట్ ఫండ్స్ కార్యాలయంతో సహా అనేక ప్రదేశాలలో ఈడీ దాడులు ప్రారంభమయ్యాయి.పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎల్2: ఎంపురాన్’ (L2:Empuraan) బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు సుమారు రూ. 240 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాపై వివాదం రావడంతో సుమారు 17 సెన్సార్ కట్స్ చేశారు. దీంతో సినిమా నిడివి సుమారు 5నిమిషాలు తగ్గింది. -
మోహన్ లాల్ 'ఎల్2- ఎంపురాన్'.. ఆ విషయంలో తొలి సినిమాగా రికార్డ్!
మలయాళ సూపర్ స్టార్ నటించిన చిత్రం ఎల్2 ఎంపురాన్. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన లూసిఫర్‌కు సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఉగాది కానుకగా ఈనెల 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు పరంగా సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.కేవలం ఐదు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రావడంతో పృథ్వీరాజ్ సుకుమారన్, మోహన్ లాల్ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇండియన్ సినిమాగా ఎంపురాన్ నిలిచిందని ట్వీట్ చేశారు. దీంతో మోహన్ లాల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. మలయాళంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో ప్రథమ స్థానంలో మంజుమ్మెల్ బాయ్స్ ఉంది. గతేడాది విడుదలైన ఈ సినిమా ఆల్‌టైమ్ కలెక్షన్స్ రూ.240 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ జాబితాలో ఎంపురాన్ రెండోస్థానంలో కొనసాగుతోంది.వివాదంలో ఎంపురాన్..ఇటీవల ఎంపురాన్ మూవీపై వివాదం తలెత్తింది. గుజరాత్ అల్లర్ల సీన్స్ ఈ మూవీ ఉంచడంపై కొందరు విమర్శలు చేశారు. ఎంపురాన్‌ను బాయ్ కాట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే ఆ తర్వాత అభ్యంతరం ఉన్న సన్నివేశాలు తొలగిస్తామని మేకర్స్ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ❤️ https://t.co/VaI6EsvZbQ— Prithviraj Sukumaran (@PrithviOfficial) March 31, 2025 🙂❤️❤️❤️ https://t.co/QpRIuhJ9oQ— Prithviraj Sukumaran (@PrithviOfficial) March 31, 2025 -
సోషల్ మీడియాలో బాయ్‌కాట్ లూసిఫర్-2.. క్షమాపణలు చెప్పిన మోహన్‌లాల్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం 'ఎల్2: ఎంపురాన్'. గతంలో వచ్చిన లూసిఫర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.అయితే తొలి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న లూసిఫర్-2 మూవీ ఊహించని విధంగా చిక్కుల్లో పడింది. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ గుజరాత్ అల్లర్లను ఉద్దేశించి ఉండడంతో పలువురు మేకర్స్‌పై మండిపడుతున్నారు. ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపురాన్ మూవీ హీరో మోహన్ లాల్ స్పందించారు. ఈ సందర్భంగా అభిమానులకు క్షమాపణలు చెప్పారు.మోహన్ లాల్ తన పోస్ట్‌లో రాస్తూ..'ఎంపురాన్ చిత్రంలో వచ్చిన కొన్ని రాజకీయ, సామాజిక ఇతివృత్తాలు చాలా మందికి తీవ్ర మనోవేదన కలిగించాయని నాకు తెలుసు. ఒక ఆర్టిస్ట్‌గా నా సినిమాలేవీ రాజకీయ ఉద్యమం, భావజాలం, వర్గం పట్ల ద్వేషాన్ని కలిగి ఉండకుండా చూసుకోవడం నా కర్తవ్యం. మా సినిమా మిమ్మల్ని బాధపెట్టినందుకు చింతిస్తున్నాం. అందుకే ఎంపురాన్ టీమ్ తరఫున క్షమాపణలు చెబుతున్నా. మిమ్మల్ని బాధపెట్టేలా ఉన్న సీన్స్ సినిమా నుంచి తప్పనిసరిగా తొలగించాలని నిర్ణయించుకున్నాం. గత నాలుగు దశాబ్దాలుగా మీలో ఒకరిగా నా సినీ జీవితాన్ని గడిపాను. మీ ప్రేమ, విశ్వాసమే నా బలం. అంతకు మించిన మోహన్‌లాల్ మరేది లేదని నా నమ్మకం...ఇట్లు ప్రేమతో మీ మోహన్ లాల్' అంటూ పోస్ట్ చేశారు.ఈ వివాదం తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) 17 మార్పులు చేయాలని చిత్ర బృందాన్ని ఆదేశించింది. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకున్న తర్వాత సీబీఎఫ్సీ ఆదేశాలు జారీ చేసింది. కాగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళ సినిమా చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్, టోవినో థామస్, అభిమన్యు సింగ్, మంజు వారియర్, జెరోమ్ ఫ్లిన్, ఎరిక్ ఎబౌనీ ప్రధాన పాత్రల్లో నటించారు. -
మలయాళంలో బిగ్గెస్ట్ ఓపెనింగ్.. ఎల్ ఎంపురాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
మలయాళ స్టార్ మోహన్‌లాల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీ లూసిఫర్ (Lucifer Movie) ఒకటి. 2019లో వచ్చిన ఈ మలయాళ చిత్రం ఘనవిజయం సాధించింది. రూ.30 కోట్లతో తీస్తే రూ.125 కోట్లు రాబట్టింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘L2: ఎంపురాన్’ (L2: Empuraan Movie) తెరకెక్కించారు. తొలి భాగాన్ని రూపొందించిన పృథ్వీరాజ్ ఈ సినిమాకు సైతం దర్శకుడిగా పని చేశాడు. అలాగే కథలోనూ కీలక పాత్రలో కనిపించాడు. లూసిఫర్ అంటే దైవదూత అని అర్థం కాగా ఎంపురాన్ అంటే రాజు కంటే ఎక్కువ.. దేవుడి కంటే తక్కువ అని అర్థం.తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?L2: ఎంపురాన్ మూవీ మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తున్నప్పటికీ ఫస్ట్ డే కలెక్షన్స్ అదిరిపోయాయి. కేవలం భారత్‌లోనే రూ.22 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. మలయాళంలో ఈ రేంజ్ వసూళ్లు అందుకున్న తొలి చిత్రంగా ఎంపురాన్ నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు 'ద గోట్ లైఫ్' పేరిట ఉంది. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఈ సినిమా దేశంలో రూ.8.95 కోట్ల (నెట్) వసూలు చేసింది. ఇకపోతే ఎంపురాన్ సినిమా విదేశాల్లోనూ అదరగొడుతున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోనూ భారీ ఓపెనింగ్స్ వచ్చినట్లు భోగట్టా!ఆ రికార్డు బ్రేక్ చేస్తుందా?2019 వరకు మలయాళంలో రూ.100 కోట్లు రాబట్టిన సినిమాలే లేవు. లూసిఫర్ సినిమా ఈ సంకెళ్లను తెంచుకుని రూ.100 కోట్లు రాబట్టిన తొలి మలయాళ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన మంజుమ్మల్ బాయ్స్ రూ.200 కోట్లు రాబట్టిన ఏకైక మలయాళ మూవీగా రికార్డుకెక్కింది. మరి ఈ రికార్డును ఎంపురాన్ బ్రేక్ చేస్తుందేమో చూడాలి! We made history! Biggest opening ever for a Malayalam movie. Our heartfelt gratitude to each of you for making this happen.#L2E #Empuraan in theatres now! pic.twitter.com/iN2bdhZz1E— Mohanlal (@Mohanlal) March 28, 2025 #Empuraan sets sail to New Zealand, claiming the Biggest Indian Opener!#L2E #Empuraan in theatres near you!@mohanlal @PrithviOfficial #MuraliGopy @antonypbvr @aashirvadcine @GokulamGopalan @GokulamMovies #VCPraveen #BaijuGopalan #Krishnamoorthy @DreamBig_film_s @jsujithnair… pic.twitter.com/3NtUzx17DV— Aashirvad Cinemas (@aashirvadcine) March 28, 2025చదవండి: Robinhood: ‘రాబిన్‌హుడ్’ మూవీ ట్విటర్ రివ్యూ -
‘ఎల్2: ఎంపురాన్’ మూవీ రివ్యూ
మోహన్‌లాల్(mohalal) సినిమాలకు మాలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోనూ మంచి ఆదరణ ఉంటుంది. ఆయన నటించిన చిత్రాలన్నీ తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. ముఖ్యంగా ‘లూసిఫర్’ చిత్రం యావత్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీకి కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రమే ‘ఎల్2: ఎంపురాన్’ (L2: Empuraan Telugu Movie Review ). పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్లే దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్ చేశారు మేకర్స్. టాలీవుడ్లో దిల్ రాజు విడుదల చేస్తుండడంతో ఈ చిత్రానికి తెలుగులో కూడా మంచి బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(మార్చి 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. లూసిఫర్ చిత్రం ఎక్కడ ముగిసిందో అక్కడ నుంచి ఈ సినిమా కథ ప్రారంభం అవుతుంది. పీకేఆర్ మరణంతో కేరళలో రాజకీయ అలజడి మొదలవ్వడం.. సీఎం సీటు కోసం కుట్రలు చేసిన బాబీ(వివేక్ ఒబెరాయ్)ని స్టీఫెన్ (మోహన్‌లాల్) అడ్డుకొని.. పీకేఆర్ కొడుకు జతిన్ రాందాస్(టొవినో థామస్)ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తాడు. అక్కడితో లూసిఫర్ కథ ముగుస్తుంది. సీఎం అయిన తర్వాత జతిన్ రాందాస్ బుద్ది కూడా మారుతుంది. సొంత ప్రయోజనాల కోసం మతతత్వ వాది బాబా భజరంగి(అభిమన్యు సింగ్)తో చేతులు కలిపి ఎల్‌యూఎఫ్ పీకేఆర్ అని కొత్త పార్టీని స్థాపించి ఎన్నికల్లోకి వెళ్తాడు. ఈ విషయం లండన్‌లో ఉన్న స్టీఫెన్(మోహన్ లాల్)కి తెలుస్తుంది. తన రాష్ట్రాన్ని కబలించడానికి శత్రువులంతా ఏకమై రాజకీయ యుద్ధం చేయడానికి సిద్ధమైతే..స్టీఫెన్ దాన్ని ఎలా తిప్పికొట్టాడు? అనేది సినిమా కథ. అసలు స్టీఫెన్ నేపథ్యం ఏంటి? ఖురేషీ అబ్రాన్‌గా పేరు మార్చుకొని విదేశాల్లో ఏం చేస్తున్నాడు? అతని కోసం ఇతర దేశాల గుఢాచార సంస్థలు ఎందుకు వెతుకుతున్నాయి. జతిన్ కొత్త పార్టీని స్థాపించిన తర్వాత పీకేఆర్ కూతురు ప్రియ(మంజు వారియర్) ఎలాంటి నిర్ణయం తీసుకుంది? బల్రాజ్ పటేల్ కాస్త బాబా భజరంగిగా ఎలా మారాడు? భజరంగికి జయేద్ మసూద్(పృథ్విరాజ్ సుకుమార్) మధ్య ఉన్న శత్రుత్వం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(L2: Empuraan Movie Review ) ఎలా ఉందంటే..ఆరేళ్ల క్రితం వచ్చిన లూసిఫర్ చిత్రంలో మోహన్‌లాల్‌ని డిఫరెంట్‌గా చూపించడంతో పాటు పొలిటికల్ డ్రామాను బాగా పండించాడు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్. హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్, మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. సీక్వెల్‌కి కూడా అదే ఫాలో అయ్యాడు. హీరోతో పాటు ప్రతి పాత్రకు భారీ ఎలివేషన్స్ ఇచ్చాడు.కథ-కథనాన్ని కూడా బాగానే రాసుకున్నాడు. కానీ కథ కంటే ఎక్కువ ఎలివేషన్స్‌పైనే దృష్టిపెట్టాడు. మోహల్‌లాల్ వచ్చే ప్రతి సీన్‌కి ఎలివేషన్ పెట్టడం కొన్నిచోట్ల అతిగా అనిపిస్తుంది. అలాగే సినిమాలోని ప్రతి పాతకు ఓ ప్లాష్‌బ్యాక్ స్టోరీ చూపించడంతో కథనం సాగదీసినట్లుగా సాగుతుంది. సీన్ల పరంగా చూస్తే మాత్రం సినిమా అదిరిపోతుంది. ప్రతి ఐదు పది నిమిషాలకు గూస్బంప్స్ తెప్పించే సన్నివేశం ఉంటుంది. సినిమా ప్రారంభమైన యాభై నిమిషాల వరకు మోహన్‌లాల్ తెరపై కనిపించడు. ఆయన వచ్చి ఈ రాజకీయ అలజడిని ఎలా అడ్డుకుంటాడో అనేలా కథనాన్ని నడిపించి.. ఆయన ఎంట్రీ కోసం ఎదురు చూసేలా చేశారు. ప్రేక్షకుడు ఎదురుచూపులకు ఏ మాత్రం నిరాశ కలగకుండా ఎంట్రీ సీన్ ఉంటుంది. హీరో విదేశాల్లో ఉన్నప్పుడు వచ్చే యాక్షన్ సీన్లు హాలీవుడ్ సినిమాలను గుర్తు చేస్తాయి. ఆయా సన్నివేశాలను స్టైలీష్‌గా తీర్చి దిద్దారు. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగిస్తుంది. ఇక ద్వితియార్థం మొత్తం కేరళ రాజకీయాల చుట్టే జరుగుతుంది. అయితే సినిమాల్లో చాలా లేయర్లు ఉండడం.. పార్ట్ 3 కోసమే అన్నట్లుగా కొన్ని సన్నివేశాలు పెట్టడం ఆడియెన్స్ ని డీవియేట్ చేస్తుంది. ఇక సినిమాకి మరో ప్రధాన మైనస్ ఎంటంటే.. డైలాగులు. ఈ సినిమాలోని డైలాగులలో ఎక్కువగా ఓ మతం ప్రజలు వాడే పదాలే ఎక్కువగా కలిపిస్తాయి . డబ్బింగ్ విషయంలో జాగ్రత్త పడాల్సింది. తెలుగు నేటివిటికి తగ్గట్లుగా మార్పులు చేస్తే బాగుండేది. క్లైమాక్స్‌లో మోహల్ లాల్, పృథ్విరాజ్ కలిసి చేసే ఫైటింగ్ సీన్ ఫ్యాన్స్‌ని ఈలలు వేయిస్తుంది. పార్ట్ 3పై ఆసక్తిని పెంచేలా ముగింపు ఉంటుంది. స్టీఫెన్ అలియాస్ ఖురేషీ అబ్రాన్ నేపథ్యం పూర్తిగా తెలియాలంటే ‘ఎల్ 3’ కోసం ఎదురు చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. మోహన్‌లాల్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.దేశం గర్వించదగ్గ గొప్ప నటుల్లో ఆయన ఒకరు. ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేస్తాడు. ‘ఎల్2:ఎంపురాన్’లో స్టీఫెన్‌గా, ఖురేషి అబ్రాన్‌గా రెండు పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఫ్యాన్స్ సినిమా చూడడానికి ఆయన ఎంట్రీ సీన్ ఒకటి చాలు. తెరపై ఆయన కనిపించిన ప్రతిసారి ఫ్యాన్స్‌కి పునకాలే. సీఎం జతిన్ రాందాస్‌గా టోవినో థామస్ సెటిల్డ్ యాక్టింగ్‌తో మెప్పించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన పాత్ర కోసం రాసుకున్న సన్నివేశాలే సినిమాకు కీలకం. మంజు వారియర్ మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించింది. పొలిటికల్ లీడర్‌గా ఆమె బాగా నటించారు. సెకండాఫ్‌లో ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక విలన్ బాబా భజరంగీ అలియాస్ బల్రాజు పటేల్‌గా అభిమన్యు సింగ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. మిగతావారంతా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. యాక్షన్ కొరియోగ్రఫీ సినిమా స్థాయిని పెంచేసింది. హాలీవుడ్ మూవీ స్థాయిలో యాక్షన్ సీన్లను తీర్చిదిద్దారు. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ప్రతి సీన్‌ని తెరపై చాలా రిచ్‌గా చూపించాడు. దీపక్ దేవ్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలను ఇంకాస్త క్రిస్పీగా కట్ చేసి, నిడివిని తగ్గిస్తే బాగుండేదేమో. లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ పిక్చర్స్, శ్రీ గోకులం మూవీస్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘ఎల్ 2: ఎంపురాన్’ మూవీ ట్విటర్ రివ్యూ
మలయాళ బ్లాక్‌బస్టర్ లూసిఫర్ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న L2: ఎంపురాన్ (L2:Empuraan) మూవీ ఎట్టకేలకు నేడు(మార్చి 27) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తూ, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై అభిమానుల్లో మొదటి భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ఇటీవల రిలీజైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. మాలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోనూ ఈ చిత్రానికి భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలు మధ్య నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఇప్పటికే బొమ్మ పడపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా సినిమా గురించి తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఎంపురాన్ ఎలా ఉంది? లూసిఫర్ స్థాయిలో విజయం సాధిస్తుందా లేదా? మోహన్‌లాల్ ఖాతాలో మరో భారీ హిట్ పడినట్టేనా? తదితర విషయాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే.ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షి బాధ్యత వహించదు.ఎక్స్‌లో ఎంపురాన్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. కథలో డెప్త్, స్క్రీన్‌ప్లేలో ఉన్న ఉత్కంఠను మెచ్చుకుంటున్నారు. పృథ్విరాజ్ మేకింగ్, మోహన్‌లాల్ యాక్టింగ్ అదిరిపోయిందని చెబుతున్నారు. మరికొంత మంది లూసిఫర్ రేంజ్లో సినిమా లేదని కామెంట్ చేస్తున్నారు. సినిమా సూపర్ హిట్ కావాలని దళపతి విజయ్, మమ్ముట్టితో పాటు పలువురు టాలీవుడ్ హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. 🔥 #EmpuraanReview: A light Storytelling in the First Half, Extraordinary Interval, Exceptional Second half with Outstanding Climax - Surprising Post Credit #Mohanlal #tovinothomas#PrithvirajSukumaran #Empuraan #L2E pic.twitter.com/N1ROnfByRI— MJ Cartels (@Mjcartels) March 26, 2025 లైట్ స్టోరీ టెల్లింగ్‌తో ఫస్టాఫ్ ఆకట్టుకునేలా ఉంది. ఇంటర్వెల్ సీన్, సెకండాఫ్ అదిరిపోతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ బాగుంటుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.Face The World AbraamHello is coming to hunt down Box office #Empuraan #L2E#Mohanlal #L2Empuraan#KajalAggarwal #Sikandar #Devara #JrNTR #JanaNayagan #ThalapathyVijay #VeeraDheeraSooran#RamCharan #NTRNeel #Nayanthara #RC16 #Thudarum #AlappuzhaGymkhana #Bazooka pic.twitter.com/Br8cHlXQPQ— AD Signatures (@AD_Signatures) March 27, 2025Best wishes to the entire cast and crew of #Empuraan for a historic victory! Hope it crosses boundaries across the world and makes the entire Malayalam industry proud. Rooting for you, Dear Lal and Prithvi 😊 pic.twitter.com/ipPJ7SNO67— Mammootty (@mammukka) March 26, 2025#L2E #Empuraan - Bang ON entry for Mohanlal after an Hour with peak commercial elevation. Hollywood level visuals & stunts🥵Director Prithviraj 🔥🔥 pic.twitter.com/WdHqFt1K00— AmuthaBharathi (@CinemaWithAB) March 27, 2025#EmpuraanReview First Half - MASSSSSS So far 🤯🔥First half primarily focused on Character & story building 🎯💯Mohanlal Entry & Interval block are filled with peak elements 🔥🥵 ENGAGING waiting for Second Half ⚡⚡#Empuraan pic.twitter.com/2IbwJCcR26— Pan India Review (@PanIndiaReview) March 27, 2025#Empuraan Jungle Poli 💥💥🔥🔥🔥Peak Theatre Experience 💥🔥🔥🔥🔥 pic.twitter.com/AZOsFy5X16— Kerala Box Office (@KeralaBxOffce) March 27, 2025#EMPURAAN FIRST HALF - FIRE MAXXX With Peak Interval Block🙏🏻🔥#PRITHVRAJSUKUMARAN Making, Visuals & Frames are Just Lit That Never Seen before in Mollywood!Finally my Man #MOHANLAL Unleashed His Stardom Upto The Potential & Theatre Erupted for Each😭🔥 pic.twitter.com/GxEaySFFWZ— Abin Babu 🦇 (@AbinBabu2255) March 27, 2025#L2Empuraan ReviewFIRST HALFGood & Engaging 👍#Mohanlal Shines 🙌The story is built well 👌Each n every star cast are terrific till now 👏BGM & Technical Aspects 🔥#PrithvirakSukumaran’s direction going well💯Interval🔥#Empuraan #L2EmpuraanReview #EmpuraanReview pic.twitter.com/QzgmXDliko— Swayam Kumar Das (@KumarSwayam3) March 27, 2025 -
‘లూసిఫర్’ కథేంటి? ఎంపురాన్ అంటే అర్థం ఏంటో తెలుసా?
‘లూసిఫర్’.. 2019లో రిలీజైన ఈ మలయాళ మూవీ ఎంత ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. రూ.30 కోట్లతో తీస్తే, రూ.125 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. మలయాళంలో అత్యధిక వసూళ్లను సాధించిన ఎనిమిదో చిత్రంగా నిలిచింది. హీరో మోహన్లాల్కి, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమార్‌కి కెరీర్లోనే బెస్ట్ చిత్రంగా ‘లూసిఫర్’ నిలిచిపోయింది. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘L2: ఎంపురాన్’ (L2: Empuraan Movie) వస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రేపు(మార్చి 27)న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో లూసిఫర్ కథేంటి? ఎంపురాన్ లో ఏం చెప్పబోతున్నారు? అసలు ఎంపురాన్ అంటే ఏంటి? తదితర ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.లూసిఫర్ కథేంటి?ముఖ్యమంత్రి పి.కె రామదాసు అలియాస్ పీకేఆర్(సచిన్ ఖేడ్కర్) అకాల మరణంతో ఐయూఎఫ్ (ఇండియన్ యూనియన్ ఫ్రంట్) పెద్దల కన్ను సీఎం సీటుపై పడుతుంది. తదుపరి సీఎం కావాలని అతని అల్లుడు బిమల్ నాయుడు అలియాస్ బాబీ(వివేక్ ఒబెరాయ్) భావిస్తాడు. అందుకోసం పార్టీలోని కొంతమంది అవినీతిపరులతో చేతులు కలుపుతాడు. అయితే పీకేఆర్ సన్నిహితుడు, పార్టీ కీలక నేత స్టీఫెన్ గట్టుపల్లి (మోహన్‌లాల్) మాత్రం బాబీ ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ సీఎం కాకుండా చేస్తాడు. దీంతో స్టీఫెన్ని హత్య చేయించేందుకు బాబీ కుట్ర చేస్తాడు. ఆ కుట్రను బాబీ ఎలా తిప్పి కొట్టాడు? బాబీ తీసుకురావాలనుకున్న డ్రగ్స్‌ను రాష్ట్రానికి రాకుండా ఎలా అడ్డుకున్నాడు? పీకేఆర్ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరించింది? అసలు స్టీఫెన్ గతం ఏంటి? అన్నదే లూసీఫర్ కథ. స్టోరీ పరంగా చూస్తే ఇది రొటీన్ పొలిటికల్ డ్రామా. కానీ దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమార్ ఒక్కో సీన్‌ని తీర్చి దిద్దిన విధానం, మోహన్‌లాల్ సెటిల్డ్ యాక్టింగ్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. వివేక్ ఒబెరాయ్, మోహన్ లాల్ పాత్రల మధ్య నువ్వా నేనా అన్నట్లు సన్నివేశాలు సాగుతాయి. మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. క్లైమాక్స్‌లో స్టీఫెన్ నేపథ్యం చెబుతూ సినిమాను ముగించారు. ఇప్పుడదే ‘ఎల్2: ఎంపురాన్’పై ఆసక్తిని పెంచేసింది. అసలు ఎంపురాన్ అంటే ఏంటి?లూసిఫర్ అనే టైటిల్ వినగానే అసలు ఈ పేరు ఎందుకు పెట్టారని అంతా అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ టైటిల్ ఎందుకు పెట్టారో తెలిసింది. క్రైస్తవంలో లూసిఫర్ అంటే దైవదూత అని అర్థం. భగవంతుని ఆజ్ఞను వ్యతిరేకించి కిందకు వచ్చి దుష్టుడిగా మారి, మానవాళి పాపాలు చేసేందుకు ప్రేరేపించేవాడినే లూసీఫర్ అంటారు. అందుకే ఈ సినిమాలో ‘దుర్మార్గులకు, మహాదుర్మార్గులకు జరిగే యుద్ధం’ అని హీరో పాత్రలో చెప్పించారు. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన మూవీకి ‘ఎంపురాన్’ అని టైటిల్ పెట్టారు. దీని అర్థం ఏంటంటే.. ‘రాజు కంటే ఎక్కువ.. దేవుడి కంటే తక్కువ’ అని అర్థం. హీరో పాత్రను దృష్టిలో పెట్టుకొని ఈ టైటిల్‌ని పెట్టారు. దాదాపు రూ. 180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. -
ఎంపురాన్ మూవీ పోస్టర్.. ఆ మిస్టరీ మ్యాన్ ఎవరు?
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ లేటెస్ట్ మూవీ 'ఎల్ 2: ఎంపురాన్'. గతంలో హిట్‌గా నిలిచిన 'లూసిఫర్' చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రానికి సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ ఉగాది కానుకగా మార్చి 27న థియేటర్లలో సందడి చేయనుంది.అయితే తాజాగా ఎంపురాన్ విడుదల చేసిన పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ పోస్టర్లో ఉన్నది ఎవరా? అనే చర్చ మొదలైంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ కూడా నటించారా? అనే ఆసక్తి నెలకొంది. తాజాగా విడుదలైన ఎంపురాన్ కొత్త పోస్టర్లో ఉన్నది అమిర్ ఖానా? రిక్ యూనేనా అని నెటిజన్స్ తెగ కన్ఫ్యూజ్ అవుతున్నారు.ఒక అభిమాని రాస్తూ.. ఈ ఫోటోలో ఉన్నది అమీర్ ఖానే.. అతని చెవులు చూడండి అచ్చం అలానే ఉన్నారు. అవును ఆ పోస్టర్లో ఉన్నది కచ్చితంగా అమీర్ ఖానే.. ఎందుకంటే ఆయన సోదరి కూడా చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని మరో నెటిజన్స్ కామెంట్ చేశాడు. మరికొందరైతే హాలీవుడ్ నటుడు రిక్ యునే కావచ్చుని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫోటోలో ఉన్నది అమిర్ ఖాన్ కాదు.. కచ్చితంగా రిక్ యున్ అని కామెంట్స్‌లో రాసుకొచ్చాడు.ఓ నెటిజన్ ఏకంగా ఏఐ గ్రోక్‌ని కూడా అడిగాడు. ఈ ఫోటో రిక్ యున్‌తో పోలికను కలిగి ఉందా? అని అడిగాడు. ఈ పోస్టర్లో డ్రాగన్‌కి ఎదురుగా ఉన్న సూట్లో వెనుక నుంచి ఒక వ్యక్తి కనిపిస్తాడు.. అది బహుశా మోహన్‌లాల్ అయి ఉండొచ్చు. ముఖం కనిపించకుండా ఉన్న ఈ పోస్టర్‌కు రిక్ యున్‌తో పెద్దగా పోలిక లేదు. ఈ శైలి యున్ యాక్షన్ పాత్రలను సరిపోలినప్పటికీ.. కానీ భౌతికంగా చూస్తే ఆ పోలిక అస్పష్టంగా ఉంది" అని గ్రోక్ సమాధానమిచ్చింది. అయితే ఎల్2 ఎంపురాన్ పోస్టర్ మిస్టరీ మ్యాన్ ఎవరనే విషయంపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 2 days to go! #L2E #EMPURAAN In theatres worldwide from 27/03/25.BMS - https://t.co/N8VWfpo2bnPaytm - https://t.co/Fjlf0z8Vtv District - https://t.co/y1UCD4nLGVTicketnew - https://t.co/wvQGWTXGxa#March27 @mohanlal #MuraliGopy @antonypbvr @aashirvadcine @GokulamGopalan… pic.twitter.com/XxRkMHNgr5— Prithviraj Sukumaran (@PrithviOfficial) March 24, 2025 -
రిలీజ్ కి ముందే రూ.58 కోట్ల కలెక్షన్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ లేటెస్ట్ మూవీ 'ఎల్ 2: ఎంపురన్'. గతంలో రిలీజైన 'లూసిఫర్' చిత్రానికి ఇది సీక్వెల్. కాకపోతే అప్పట్లో తక్కువ బడ్జెట్ తో సింపుల్ గా తీశారు. ఇప్పుడు భారీగా తీశారు. మార్చి 27న థియేటర్లలోకి రాబోతున్న ఈ పాన్ ఇండియా మూవీ.. రిలీజ్ కి ముందే కళ్లు చెదిరే వసూళ్లు సాధిస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: 'కన్నప్ప' మూవీని ట్రోల్ చేస్తే శాపానికి గురవుతారు: రఘుబాబు)మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ చిత్రానికి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకుడు. లూసిఫర్ చిత్రాన్ని అప్పట్లో మలయాళంతో పాటు తెలుగులోనూ డబ్బింగ్ చేశారు. కాకపోతే ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం బడ్జెట్ గట్టిగానే పెట్టి సినిమా భారీగా తీశారు. అంతే భారీగా రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నారు.తెలుగులో దిల్ రాజు.. ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ ప్రీ సేల్స్ ద్వారానే దాదాపు రూ.58 కోట్ల వరకు సొంతం చేసుకుందని పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు తెలుగులో ఓ మాదిరి హైప్ మాత్రమే ఉంది. దీనికి విక్రమ్ 'వీరధీర శూర', 'మ్యాడ్ స్క్వేర్', 'రాబిన్ హుడ్' చిత్రాలు పోటీగా ఉన్నాయి. మరి తెలుగులో మోహన్ లాల్ మూవీ ఏం రిజల్ట్ అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో హారర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్) -
లూసీఫర్ 2 తెలుగు వెర్షనే చూడండి : పృథీరాజ్ సుకుమార్
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్(Mohanlal), పృథ్వీరాజ్ సుకుమార్(Prithviraj Sukumaran) కాంబోలో తెరకెక్కిన భారీ చిత్రం ‘లూసిఫర్2: ఎంపురాన్’. ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. మురళీ గోపి కథను అందించారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మార్చి 27న మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం చిత్రబృందం ప్రీరిలీజ్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా పృథ్విరాజ్ సినిమా గురించి మాట్లాడుతూ.. తెలుగులోనే ఈ చిత్రాన్ని చూడాలని కోరాడు. ‘మాములుగా ఏ డెరెక్టర్ అయినా కూడా తన సినిమాను ఒరిజినల్ వెర్షన్ చూడమని చెపుతారు. నేను మాత్రం లూసీఫర్ 2 తెలుగు వెర్షన్ చూడమని సలహా ఇస్తున్నాను. తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని తెలుగులోనే చూడండి. ఒరిజినల్ వెర్షన్ చూసిన ఫీలింగే కలుగుతుంది. డబ్బింగ్ విషయంలో టీమ్ బాగా కష్టపడి మంచి ఔట్పుట్ ఇచ్చింది. దిల్ రాజుగారు తెలుగు రాష్ట్రాల్లో మలయాళ వెర్షన్ కూడా రిలీజ్ చేస్తున్నారు కానీ.. నేను మాత్రం తెలుగులోనే చూడమని కోరుతున్నాను’ అన్నారు. మోహన్ లాల్ మాట్లాడుతూ.. ‘టాలీవుడ్ ప్రపంచంలోనే నెంబర్ వన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. తెలుగులో సినిమా చేయాలని నేను కూడా ఎదురుచూన్నాను. మంచి కథ వస్తే కచ్చితంగా చేస్తాను. ఇప్పుడు ఏ సినిమా ఫైనల్ కాలేదు.అయితే కచ్చితంగా చెబుతాను’ అన్నారు. -
ఎల్2కు ముందు 'లూసిఫర్' రీరిలీజ్
మోహన్‌లాల్ హీరోగా నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘లూసిఫర్’ (2019) మళ్లీ విడుదల కానుంది. స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో ఒక చిన్న రోల్లో నటించడమే కాకుండా.. దర్శకత్వం కూడా వహించారు. ఈ మూవీ భారీ విజయం అందుకోవడంతో సీక్వెల్‌గా ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా కూడా తెరకెక్కించారు. ఈ మూవీలో కూడా మోహన్‌లాల్ హీరోగా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహించారు.‘లూసిఫర్’ మార్చి 20న రీరిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. ఈమేరకు మోహన్‌లాల్ ట్రైలర్‌ను కూడా తన సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఈ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ‘ఎల్ 2 :ఎంపురాన్’ మార్చి 27న విడుదల కానున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పార్ట్-2 విడుదలకు ముందు ఇలా పార్ట్-1 రీరిలీజ్ చేయడం వల్ల ప్రేక్షకులకు సినిమా బాగా రీచ్ అవుతుందని మేకర్స్ ప్లాన్ చేశారు. లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ నిర్మించిన ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.మొదట కేవలం మలయాళంలో మాత్రమే విడుదలైన లూసిఫర్ బాక్సాఫీస్ వద్ద రూ. 160 కోట్ల రాబట్టి భారీ విజయాన్ని అందుకుంది. అయితే, తెలుగులో గాడ్‌ఫాదర్ పేరుతో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేసిన విషయం తెలిసిందే. కానీ, ఇక్కడ పెద్దగా చిరు ప్రభావం చూపలేకపోయారు. దీంతో రూ. 100 కోట్ల వరకు మాత్రమే గాడ్‌ఫాదర్ కలెక్ట్ చేసింది. మలయాళంలో విడుదలైన లూసిఫర్‌తో పోల్చితే చాలా వ్యత్యాసం కనిపించింది.