
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్(Mohanlal), పృథ్వీరాజ్ సుకుమార్(Prithviraj Sukumaran) కాంబోలో తెరకెక్కిన భారీ చిత్రం ‘లూసిఫర్2: ఎంపురాన్’. ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. మురళీ గోపి కథను అందించారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మార్చి 27న మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు.
ఈ క్రమంలో శనివారం చిత్రబృందం ప్రీరిలీజ్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా పృథ్విరాజ్ సినిమా గురించి మాట్లాడుతూ.. తెలుగులోనే ఈ చిత్రాన్ని చూడాలని కోరాడు. ‘మాములుగా ఏ డెరెక్టర్ అయినా కూడా తన సినిమాను ఒరిజినల్ వెర్షన్ చూడమని చెపుతారు. నేను మాత్రం లూసీఫర్ 2 తెలుగు వెర్షన్ చూడమని సలహా ఇస్తున్నాను.
తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని తెలుగులోనే చూడండి. ఒరిజినల్ వెర్షన్ చూసిన ఫీలింగే కలుగుతుంది. డబ్బింగ్ విషయంలో టీమ్ బాగా కష్టపడి మంచి ఔట్‌పుట్ ఇచ్చింది. దిల్ రాజుగారు తెలుగు రాష్ట్రాల్లో మలయాళ వెర్షన్ కూడా రిలీజ్ చేస్తున్నారు కానీ.. నేను మాత్రం తెలుగులోనే చూడమని కోరుతున్నాను’ అన్నారు. మోహన్ లాల్ మాట్లాడుతూ.. ‘టాలీవుడ్ ప్రపంచంలోనే నెంబర్ వన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. తెలుగులో సినిమా చేయాలని నేను కూడా ఎదురుచూన్నాను. మంచి కథ వస్తే కచ్చితంగా చేస్తాను. ఇప్పుడు ఏ సినిమా ఫైనల్ కాలేదు.అయితే కచ్చితంగా చెబుతాను’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment