‘ఎల్‌ 2: ఎంపురాన్‌’ మూవీ ట్విటర్‌ రివ్యూ | Mohanlal And Prithviraj Sukumaran L2:Empuraan Movie Twitter Review In Telugu, Check These Tweets Before Watching Film | Sakshi
Sakshi News home page

L2:Empuraan Twitter Review: ‘ఎల్‌ 2: ఎంపురాన్‌’ మూవీ ట్విటర్‌ రివ్యూ

Published Thu, Mar 27 2025 6:16 AM | Last Updated on Thu, Mar 27 2025 8:49 AM

L2:Empuraan Movie Twitter Review In Telugu

 మలయాళ  బ్లాక్‌బస్టర్‌ లూసిఫర్ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న L2: ఎంపురాన్ (L2:Empuraan) మూవీ ఎట్టకేలకు నేడు(మార్చి 27) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తూ, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై అభిమానుల్లో మొదటి భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ఇటీవల రిలీజైన ట్రైలర్‌ ఆ అంచనాలను మరింత పెంచేసింది. మాలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోనూ ఈ చిత్రానికి భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాలు మధ్య నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఇప్పటికే బొమ్మ పడపోయింది. 

దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా సినిమా గురించి తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఎంపురాన్‌ ఎలా ఉంది? లూసిఫర్‌ స్థాయిలో విజయం సాధిస్తుందా లేదా? మోహన్‌లాల్‌ ఖాతాలో మరో భారీ హిట్‌ పడినట్టేనా? తదితర విషయాలను ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే.ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షి బాధ్యత వహించదు.

ఎక్స్‌లో ఎంపురాన్‌ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. కథలో డెప్త్, స్క్రీన్‌ప్లేలో ఉన్న ఉత్కంఠను మెచ్చుకుంటున్నారు. పృథ్విరాజ్‌ మేకింగ్‌, మోహన్‌లాల్‌ యాక్టింగ్‌ అదిరిపోయిందని చెబుతున్నారు. మరికొంత మంది లూసిఫర్‌ రేంజ్‌లో సినిమా లేదని కామెంట్‌ చేస్తున్నారు. సినిమా సూపర్‌ హిట్‌ కావాలని దళపతి విజయ్‌, మమ్ముట్టితో పాటు పలువురు టాలీవుడ్‌ హీరోల అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా చిత్ర యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌  చెబుతున్నారు. 
 

 లైట్‌ స్టోరీ టెల్లింగ్‌తో ఫస్టాఫ్‌ ఆకట్టుకునేలా ఉంది. ఇంటర్వెల్‌ సీన్‌, సెకండాఫ్‌ అదిరిపోతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ బాగుంటుందని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.

Sticky for cinema

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement