
సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ 'ఆడుజీవితం (ది గోట్ లైఫ్). గతేడాది ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఉపాధి కోసం అరబ్ దేశాలకు వెళ్లిన వారి నిజ జీవితాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దర్శకుడు బ్లెస్సీ ఎంతో అద్భుతంగా ఈ మూవీని తెరకెక్కించాడు.
అయితే తాజాగా ఈ సినిమా కేరళ రాష్ట్ర అవార్డుల్లో సత్తాచాటింది. ఈ సినిమాలో నటనకు గానూ పృథ్వీరాజ్ సుకుమారన్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డ్ వరించింది. అంతే కాకుండా ఈ చిత్రం ఏకంగా తొమ్మిది విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుని సత్తా చాటింది. కేరళ సీఎం పినరయి విజయన్ చేతుల మీదుగా ఆయన అవార్డ్ అందుకున్నారు. తిరువనంతపురం వేదికగా 54వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల వేడుక గ్రాండ్‌గా జరిగింది.
కాగా.. పృథ్వీరాజ్ తండ్రి, లెజెండరీ సుకుమారన్ ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి కావడం మరో విశేషం. ఆ తర్వాత ఈ టైటిల్‌ను మోహన్‌లాల్ సొంతం చేసుకున్నారు. అంతకుముందే 2006లో పృథ్వీరాజ్ కేవలం 24 సంవత్సరాల వయసులో వాస్తవమ్ చిత్రంలో నటనకు ఈ అవార్డును అందుకున్నారు. ఈ ఘనత సొంతం చేసుకున్న అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. దాదాపు ఇరవై సంవత్సరాల మరోసారి ఆయనను అవార్డ్ వరించింది.