
గుంటూరు: పట్టాభిపురంలో రేవ్‌పార్టీ జరిగిందన్నది అవాస్తవమని సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. అక్కడ హోటల్లో జరిగింది పుట్టినరోజు పార్టీనే.. రేవ్ పార్టీ కాదని వెల్లడించారు. కొన్ని ఛానల్స్‌లో అసత్య కథనాలు వచ్చినట్లు సీఐ పేర్కొన్నారు. పోలీసు అధికారితోపాటు కొంతమందిని పోలీసులు తప్పించారంటూ.. మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదని సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.