సాక్షి, గుంటూరు: గ్రామ సచివాలయ పరీక్షలపై అవాస్తవాలు ప్రచారం పట్ల నిరుద్యోగులు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శనివారం గుంటూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సచివాలయ ఉద్యోగ రాత పరీక్షల ప్రశ్నపత్రం లీకైందంటూ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాలను ఖండించారు. తప్పుడు వార్తలు రాసిన ఆంధ్రజ్యోతి పత్రిక కాపీలను తగలబెట్టారు. వంద రోజుల్లో 4 లక్షల ఉద్యోగాల కల్పనపై యువత హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, ఉండవల్లి శ్రీదేవి, పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, ఏసురత్నం, రమేష్ గాంధీ, విద్యార్థి నేతలు సలాం, పానుగంటి చైతన్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment