
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జవహార్‌లాల్ నెహ్రు టెక్నాలజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) వద్ద విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. ఇంజనీరింగ్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.. యూనివర్సిటీ గేటు దాటి విద్యార్థులంతా మూకుమ్మడిగా లోపలికి వెళ్లేందుకు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు. పలువురు విద్యార్థును అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.