టీడీపీ కార్యకర్తలకే కండువాలు వేసి ఫొటోలకు ఫోజులు
పార్టీలో చేరినట్లు అసత్య కథనాలు
సాక్షి, పుట్టపర్తి: అధికారం కోసం ‘తమ్ముళ్లు’ నానా తంటాలు పడుతున్నారు. అధినేత ఆదేశాల మేరకే తప్పుదోవ పడుతున్నారు. ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని టీడీపీ కార్యకర్తలు అసత్య కథనాలను ప్రచారం చేస్తున్నారు. రోజురోజుకూ టీడీపీని వీడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న క్రమంలో దిక్కుతోచని స్థితిలో టీడీపీ నేతలు అసత్య వార్తలను ఎల్లో మీడియా ద్వారా జనాల్లోకి తీసుకెళ్తున్నారు.
టీడీపీలో ఉన్న వారికే కండువాలు వేసి ఫొటోలకు ఫోజులు ఇచ్చి.. కొత్తగా పార్టీలో చేరినట్లు వార్తలు రాయిస్తున్నారు. ఒకరిద్దరికి కండువాలు వేసి వందల కుటుంబాలు వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరినట్లు ఉత్తుత్తి ప్రచారం చేస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో ఇటీవల పుట్టపర్తి, రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి. అయితే వాస్తవాలు తెలుసుకున్న ప్రజలు, చివరకు టీడీపీ కార్యకర్తలు కూడా నేతల తీరుపై మండిపడుతున్నారు. పార్టీ క్రెడిబులిటీ పోతుందని వాపోతున్నారు.
ఓటర్లను మభ్య పెట్టేందుకే..
టీడీపీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతోంది. పార్టీ వీ డుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ధర్మవరంలో వార్డుల వారీగా ఆ పార్టీ ఖాళీ అవుతోంది. పరిటాల ఇలాకాలోని గ్రామాల్లో సైతం వైఎస్సార్‌సీపీలోకి వె ల్లువలా చేరుతున్నారు. ఈ నేపథ్యంలో ఉన్న వారిని కాపాడుకునే క్రమంలో టీడీపీ నేతలు వాళ్లకే మళ్లీ మళ్లీ కండువాలు వేసి పార్టీలో చేరినట్లు ప్రకటిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీని ఎదుర్కొనే సత్తా లేకే..
శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రచారానికి అనూహ్య స్పందన వస్తోంది. ప్రజాదరణను చూసి ఓర్వలేని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారాలకు పూనుకున్నారు. అందుకు ఎల్లో, సోషల్ మీడియాలను ఉపయోగించుకుంటున్నారు. ఫలితంగా ప్రజల్లో మరింత చులకన అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment