భారతదేశం గొప్ప ఆర్థిక వేత్తను కోల్పోనుంది
Published Sun, Jun 19 2016 12:13 PM | Last Updated on Mon, Sep 4 2017 2:53 AM
న్యూఢిల్లీ: ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ రెండో సారి పదవి చేపట్టనని ప్రకటించడం దురదృష్టకరమని ప్రముఖ ఆర్ధిక వేత్త, నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్య సేన్ పేర్కొన్నారు. భారతదేశం, ప్రపంచం ఒక అత్యంత నైపుణ్యంతో ఆలోచించగల ఆర్థిక నిపుణున్ని కోల్పోనుందని సేన్ అవేదన వ్యక్తం చేశారు. ఇది దేశానికి, ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమని ఆయన అన్నారు. ఆర్బీఐ అనేది పూర్తి స్వతంత్ర సంస్థ కాదని సేన్ అన్నారు. ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కొంత మంది అధికార పార్టీకి చెందిన వారు రాజన్ ను వ్యతిరేకించడం అత్యంత దురదృష్టకరమైన విషయం అని అన్నారు. రాజన్ నరేంద్రమోదీని ఆరాధించేవారు కాదని అన్నారు. రెండో సారి ఆర్బీఐ గవర్నర్ గా పదవీ బాద్యతలు చేపట్టనని తన పదవీకాలం పూర్తియిన తర్వాత పాఠాలు బోధిస్తానని రాజన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement