ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ త్వరలో రాజకీయాల్లోకి రానున్నారా? 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాజన్ కాంగ్రెస్ చేరుతున్నారంటూ వచ్చిన వార్తల్ని ఖండించారు. తాజాగా మరోమారు ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై వార్తలు వస్తున్నాయి. దీనిపైన రాజన్ స్పందించారు.
రాజకీయాల్లోకి అడుగు పెట్టడం కంటే నేను చేయగలిగిన చోట మార్గనిర్దేశం చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్రయత్నిస్తున్నాని తెలిపారు.
ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నాను. నేను విద్యా వేత్తని. ‘మై బిజినెస్ ఈజ్ నాట్ కిస్సింగ్ బేబీస్’. కానీ ప్రజలు ఇప్పటికీ నా మాటల్ని నమ్మడం లేదు. పాలిటిక్స్ అంటే నా భార్యకు, నాకుటుంబానికి ఇష్టం లేదు. రాజకీయాల్లోకి రావడం తనకు ఇష్టం లేదన్నారు.
అనంతరం భారత్, అమెరికా తదితర దేశాల్లోని ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, చిన్న పరిశ్రమల ముందున్న సవాళ్లు, ఆర్థిక అసమానతలపై రాజన్ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రపంచ దేశాల్లో యుద్ధ భయాలతో పాటు ఇతర అంశాలే అందుకు కారణం. దీనికి తోడు అధిక వడ్డీ రేట్ల ప్రభావం ప్రపంచ వృద్ది ఆశించిన స్థాయిలో ఉండదని తెలిపారు.
‘మై బిజినెస్ ఈజ్ నాట్ కిస్సింగ్ బేబీస్’ అంటే
పరోక్షంగా రాజకీయాల్లో రావడం ఇష్టం లేదు.. సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పేందుకు ఇంగ్లీష్‌లో ఈ పదాన్ని సందర్భాన్ని బట్టి వాడుతుంటారు.
Comments
Please login to add a commentAdd a comment