దేశంలో 5వ విడుత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో ముఖేష్ అంబానీ సోదరులు అనిల్ అంబానీ, ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ముంబైలోని పెద్దార్ రోడ్డులోని యాక్టివిటీ స్కూల్‌లోని పోలింగ్ కేంద్రానికి గవర్నర్ తన భార్య, కుమార్తెతో కలిసి వచ్చారు. ఓటు వేసిన అనంతరం..140 కోట్ల మంది ప్రజలు ఎన్నికల‍్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గర్వించదగ్గ తరుణం. ప్రతి భారతీయుడికి ఓ గర్వకారణం అని అన్నారు. ఆర్థిక విషయాల గురించి మాట్లాడేందుకు ఇది సమయం కాదని, జూన్ 7న తదుపరి ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమావేశం వరకు వేచి చూడాల్సిందేనని అన్నారు.
#WATCH | Industrialist Anil Ambani casts his vote at a polling booth in Mumbai, for the fifth phase of #LokSabhaElections2024 pic.twitter.com/2CpXIZ6I0l
— ANI (@ANI) May 20, 2024
మనదేశానికి ఎంతో గర్వకారణమైన ఈ ఎన్నికల్లో దేశ పౌరులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని శక్తికాంత దాస్ విజ్ఞప్తి చేశారు.
ఓటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. ఎంతో కఠినమైన ఎన్నికల ప్రక్రియను సజావుగా జరిగేలా అహర్నిశలు శ్రమిస్తున్న భారత ఎన్నికల సంఘానికి, ఎన్నికల‍్లో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి నా అభినందనలు.
కాగా, దేశ వ్యాప్తంగా 5వ దశ లోక్ సభ ఎన్నికలకు ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 49 నియోజక వర్గాలకు (మే 20న)ఈ రోజు పోలింగ్ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment