
సాక్షి, కోల్‌కతా : ఎట్టకేలకు ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ డాక్యుమెంటరీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గతంలో నిషేధించిన ఆ నాలుగు పదాలకు కూడా సీబీఎఫ్‌సీ (కేంద్ర చిత్ర సెన్సార్ బోర్డు) ఓకే చెప్పింది. అమర్త్యసేన్ జీవితం-సేవలపై 'ది ఆర్గుమెంటేటివ్ ఇండియన్' పేరిట జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ డైరెక్టర్ సుమన్ ఘోష్ ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. దాదాపు గంటపాటు ఉండే ఈ డాక్యుమెంటరీ గత ఏడాది వివాదంలో చిక్కుకుంది.
ఇందులో నాలుగు పదాలు (ఆవు, గుజరాత్, హిందుత్వ, హిందూ) అనే పదాలు తొలగించాలని, లేదంటే సర్టిఫికెట్ ఇవ్వబోమంటూ కోల్‌కతా సెన్సార్ బోర్డు అడ్డు చెప్పింది. దీంతో గత ఏడాది నుంచి ఇది విడులకు నోచుకోలేదు. అయితే, 'ఇటీవలె సీబీఎఫ్‌సీ చైర్మన్ ప్రసూన్ జోషి ఈ డాక్యుమెంటరీ ముంబయిలో ఇతర బోర్డు సభ్యులతో చూశారు. అనంతరం ఎలాంటి కట్‌లు చెప్పకుండా డాక్యుమెంటరీ విడుదల చేసుకోవచ్చని అన్నారు' అని ఘోష్ తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించి తనకు వ్రాత పూర్వక అనుమతి వస్తుందని భావిస్తున్నానని చెప్పారు. ఈ డాక్యుమెంటరీ రెండు పార్టులుగా తీశారు.
Comments
Please login to add a commentAdd a comment