ప్రజాసంక్షేమానికి పెద్దపీట | YS Rajasekhar reddy's regime shown what welfare is | Sakshi
Sakshi News home page

ప్రజాసంక్షేమానికి పెద్దపీట

Published Sun, Sep 1 2013 2:30 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

ప్రజాసంక్షేమానికి పెద్దపీట - Sakshi

ప్రజాసంక్షేమానికి పెద్దపీట

నివేదిక: అభివృద్ధికి మానవీయ కోణం ఉండాలని అమర్త్యసేన్ వంటి ఆర్థికవేత్తల నిశ్చితాభిప్రాయం. ఈ వాస్తవాన్ని ఆచరణలో చూపించిన రాజకీయ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. మానవీయ కోణంతో సాగే అభివృద్ధితోనే ఏ ఫలితాలైనా అట్టడుగు వర్గాలకు చేరతాయి. వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెరిగిన ఆర్థిక హోదా ద్వారా వచ్చే ఫలితాలను అందుకోవడానికి ఆరోగ్యం తప్పనిసరి. నిజానికి అభివృద్ధి, ప్రజారోగ్యం పరస్పరాధారాలు. వైద్య వృత్తి నుంచి వచ్చిన వారు కాబట్టే వైఎస్ ఈ అంశాన్ని గుర్తించారు. 2005, 2006-2010 మధ్య గణాంకాలను పరిశీలిస్తే ఇది బోధపడుతుంది. అందుకే దేశంలో ముందంజలో ఉందని పేరు పొందిన గుజరాత్‌లో కూడా ‘ఆరోగ్యశ్రీ’ కనిపించదు. వైఎస్ హయాంలో రాష్ట్రంలో వైద్యరంగానికి కేటాయించిన ఎక్కువ నిధులు కానీ, అదే సమయంలో పేదలకు కార్పొరేట్ వైద్యసేవలు కానీ గుజరాత్‌లో ఇప్పటికీ కానరావు.
 
  గుజరాత్‌లో ఆయుః ప్రమాణం 64 శాతం కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఆ ప్రమాణం 64.4 శాతంగా గమనించవచ్చు. ప్రసూతి మరణాలు గుజరాత్‌లో 148 కాగా, మన రాష్ట్రంలో 134గా (ప్రతి లక్ష మందికి) నమోదైంది. ఇక్కడ శిశుమరణాలు (ప్రతి వెయ్యిలోను) 46 కాగా, ఇదే కాలంలో వాటి జాతీయ సగటు 47. రాష్ట్రం ఆరోగ్య రంగంపై1.20 శాతం ఖర్చు చేయగా, గుజరాత్ 0.73 శాతం మాత్రమే ఖర్చు చేసింది. 2007-08 మధ్య కాలంలో 5-14 సంవత్సరాల బాలబాలికలు 90 శాతం పాఠశాలలకు వెళ్లారు. జాతీయ సగటు, గుజరాత్ కంటే కూడా ఇదే ఎక్కువ. ఆరోగ్యం, విద్య, సామాజికరంగాలకు సంబంధించి ఇలా గుజరాత్ కంటే ముందంజలో ఉండటం వైఎస్ హయాంలోనే కనిపిస్తుంది. ఈ అంశాల మీద ప్రొఫెసర్ కె.వి.రమణారెడ్డి అధ్యయన నివేదిక రెండవ భాగం ఇది.
 
 అభివృద్ధికి మానవీయకోణం ఉండాలనేది వైఎస్ ఫిలాసఫీ. సంక్షేమం లేని అభివృద్ధిని ఆయన కాంక్షిం చలేదు. అందుకే అభివృద్ధికి ఎంత ప్రాధాన్యం ఇచ్చా రో అంతే ప్రాధాన్యం సంక్షేమానికీ ఇచ్చారు. సామా జికరంగాలైన విద్య, వైద్యం, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమంపై ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరచడం ఇం దుకు సాక్ష్యం. గుజరాత్ అభివృద్ధి నమూనాతో పోల్చి నప్పుడు ఈ కోణాన్ని మరింత స్పష్టంగా చూడవచ్చు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో అభి వృద్ధి- సంక్షేమం ఒకే నాణేనికి రెండు ముఖాలుగా భాసిల్లాయి. వైద్యరంగంపై ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతీపైసా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఫలితంగా వారి ఆర్థికస్థితి మెరుగుపడటంతో పాటు మంచి ఆరోగ్యమైన సమాజం నిర్మితమవుతుంది.
 
  దీనిని దృష్టిలో ఉంచుకునే స్వత హాగా డాక్టర్ అయిన వైఎస్ ప్రజల ఆరోగ్యం మెరుగుపరచేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. వైద్యరంగానికి నిధులు భారీగా కేటాయింపులు చేయ డమే కాకుండా... పేదలకూ కార్పొరేట్ వైద్యం అందించేందుకు వీలుగా ఆరో గ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశానికే రోల్‌మోడల్‌గా గుజరాత్‌ను చూపి స్తున్న మోడీ  హయాంలో ఇటువంటి ఆరోగ్య పథకం లేదు. ఫలితంగా ఆరోగ్య రంగంలో గుజరాత్ కంటే వైఎస్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఎంతో మెరుగ్గా ఉంది. శిశుమరణాల సంఖ్య, పోషకాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య మన రాష్ట్రం కంటే గుజరాత్‌లో అధికం కావడమే ఇందుకు దాఖలా. అదే విధంగా పిల్లల చదువులకు ఆర్థిక పరిస్థితి ఆటంకం కాకూడదని భావించారు వైఎస్. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా పేదసాదలకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చారు. సామాజికరంగాలైన విద్య, వైద్య, గ్రామీణ రంగం, ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమంతో పాటు పట్టణాభివృద్ధి వంటి రంగాలపై వైఎస్ శ్రద్ధ కనబరిచారు. తద్వారా సామాజికరంగాల అభివృద్ధిలో గుజరాత్‌ను మించి రాష్ట్రమే దేశానికి రోల్ మోడల్‌గా నిలిచింది. ‘సమ్మిళిత అభివృద్ధి- చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి, నరేంద్రమోడీల విధానాల మధ్య తులనాత్మక విశ్లేషణ’ పేరుతో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి చెందిన కామర్స్ విభాగం ప్రొఫెసర్ కేవీ రమణారెడ్డి అధ్యయన నివేదిక నికార్సయిన గణాంకాలతో ఇదే అంశాన్ని నిగ్గు తేల్చింది.
 
 ఆరోగ్యం

  • ఆయుః ప్రమాణం శాతం గుజరాత్‌లో కంటే ఆనాడు మన రాష్ట్రంలోనే ఎక్కువ. గుజరాత్‌లో ఇది 64 శాతం కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 64.4 శాతంగా ఉంది.
  •   రాష్ట్రంలో 2006-10 మధ్యకాలంలో ప్రతి వెయ్యిమందికి శిశుమరణాల సంఖ్య 46 మంది ఉండగా ఇది జాతీయస్థాయిలో 47గా ఉంది.
  •   2006-10 మధ్యకాలంలో రాష్ట్రంలో ప్రతి లక్ష మందికి ప్రసూతి మరణాల సూచీ 134 ఉండగా, గుజరాత్‌లో 148గా ఉంది. జాతీయ సగటు (212) కంటే ఆ నాడు రాష్ట్రం చాలా మెరుగని దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇందుకు కారణం రాష్ట్రంలో అందుతున్న మెరుగైన వైద్యసదుపాయాలే. ఆరోగ్యరంగంపై ప్రభుత్వం వెచ్చిస్తున్న ఖర్చు గతంతో పోలిస్తే పెరగడమే ఇందుకు కారణం అని చెప్పవచ్చు.
  •  2006-10 మధ్యకాలంలో పోషకాహార లోపంతో జన్మిస్తున్న పిల్లల సంఖ్య రాష్ట్రంలో ప్రతి వెయ్యి మందిలో 38.40 మంది ఉండగా, గుజరాత్‌లో ఇది ఏకంగా 49.20గా ఉంది. ఈ అంశాల్లో గుజరాత్ కంటేనే కాదు దేశం కంటే (45.8) కూడా రాష్ట్రం మెరుగైన స్థానంలో ఉంది.
  •           పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల సంఖ్య 2006-10 మధ్య కాలంలో గుజరాత్‌లో ఎక్కువగా ఉంది. గుజరాత్‌లో పోషకాహార లోపం తో బాధపడుతున్న పిల్లల సంఖ్య (ప్రతి వెయ్యి మందిలో) 43.6 నుంచి 49.20కు పెరిగింది. అదే సమయంలో రాష్ట్రంలో 37.73 నుంచి 36.6కు తగ్గింది.
  •           ఒక్కో వ్యక్తిపై వైద్యానికి చేస్తున్న తలసరి ఖర్చు చంద్రబాబు హయాం కంటే వైఎస్ హయాంలో పెరిగింది. తలసరి వైద్య ఖర్చు 1995-2000 మధ్యకాలంలో రూ.133.3, 2001-04 మధ్యకాలంలో రూ.166.4 ఉంది. అయితే, 2005-10 మధ్యకాలంలో ఇది ఏకంగా రూ.222.4కు పెరిగింది.
  •           మొత్తం రాష్ట్ర వ్యయంలో ఆరోగ్యరంగానికి చేస్తున్న ఖర్చు 2005-10 మధ్యకాలంలో రాష్ట్రంలో 1.20 శాతం ఉండగా, గుజరాత్‌లో ఇది కేవలం 0.73 శాతం మాత్రమే.

  విద్య
 
          2007-08 సంవత్సరంలో 5-14 సంవత్సరాల మధ్య వయసు కలిగిన రాష్ట్రంలోని పిల్లలలో 90 శాతం పాఠశాలలకు వెళుతున్నారు. ఇది జాతీయ సగటు కంటేనే కాదు గుజరాత్ కంటే కూడా ఎక్కువ. జాతీయస్థాయిలో రాష్ట్రం 7వ స్థానంలో నిలవగా గుజరాత్ 15వ స్థానంతో సరిపెట్టుకుంది. రాష్ట్రంలోని 6-14 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలలో 3.3 శాతం మంది మాత్రమే పాఠశాలలకు దూరంగా ఉన్నారని తాజాగా 2010లో విడుదలైన ఏఎస్‌ఈఆర్ (యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్) సర్వే తెలిపింది. పాఠశాల విద్యలో ప్రత్యేకంగా 2007-08 నుంచి రాష్ట్రం పురోగతిని సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బ్రిడ్జి స్కూల్స్ కోర్సులతో పాటు గ్రామీణ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ స్కూల్స్ వంటి పథకాలు ఇందుకు దోహదపడ్డాయి.


          అందువల్లే 2008-09 విద్యా సంవత్సరానికిగానూ ఈడీఐ (ఎడ్యుకేషన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్) ఆధారంగా వెలువడిన నివేదిక ప్రకారం దేశంలోని 21 రాష్ట్రాల్లో మన రాష్ట్రం 7వ స్థానాన్ని దక్కించుకోగలిగింది.
          మాధ్యమికస్థాయి విద్యలోనూ గుజరాత్ కంటే రాష్ట్రం మెరుగైన స్థితిలో ఉంది. 13-15 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలలో రాష్ట్రంలో పాఠశాలలకు వెళ్లే వారి సంఖ్య 55.4 శాతం ఉండగా, గుజరాత్‌లో ఇది కేవలం 42.3 శాతం మాత్రమే.
          పాఠశాలలకు వెళ్లే పిల్లలలో మగ, ఆడపిల్లల మధ్య వ్యత్యాసం 1995- 96తో పోలిస్తే 2007-08 నాటికి బాగా తగ్గింది. 1995-96లో ఈ వ్యత్యా సం 7.2 శాతం ఉండగా, 2007-08 నాటికి 4.3 శాతానికి తగ్గింది. అంటే పాఠశాలలకు వెళ్లే ఆడపిల్లల సంఖ్య పెరుగుతోందన్నమాట.
          సామాజికవర్గాల వారీగా చూసినప్పటికీ బాబు హయాం కంటే వైఎస్  హయాంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలు పురోగమించాయి. 1995-96లో ఎస్టీ వర్గాల్లో పాఠశాలలకు వెళ్లే వారి సంఖ్య కేవలం 47.7 శాతం ఉండగా, 2007-08 నాటికి 83.1 శాతానికి పెరిగింది. ఎస్సీ వర్గాల్లో ఇది 57.7 శాతం నుంచి 89.6 శాతానికి పెరిగింది. అంటే 21.9 శాతం పెరిగిందన్న మాట. ఇది కాస్తా 2009-10 నాటికి ఏకంగా 94.4 శాతానికి ఎగబాకింది. అదేవిధంగా పాఠశాలలకు వెళుతున్న ముస్లిం పిల్లల సంఖ్య 95.2 శాతా నికి చేరుకుంది.
 
 సామాజిక రంగం

          రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ప్రణాళిక వ్యయం 2000-03లో 5.76 మాత్రమే ఉండగా, 2004-08 మధ్యకాలంలో 6.66 శాతానికి పెరిగింది. అయితే, వైఎస్ మరణానంతరం ఇది కాస్తా తగ్గింది. 2009-11 మధ్య కాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ప్రణాళిక వ్యయం 6.04 శాతానికి తగ్గిపోయింది.
          సగటు తలసరి వాస్తవిక పెట్టుబడి 2000-03 మధ్యకాలంలో రూ.594 ఉండగా, 2004-08 మధ్యకాలంలో రూ.991కు పెరిగింది. సామాజిక రంగాలకు ఖర్చు 2000-03 కంటే 2004-08 మధ్యకాలంలో భారీగా పెరిగింది. ఇందుకు ప్రధాన కారణం విద్య, వైద్యరంగాలకు ప్రభుత్వ కేటాయింపులు పెరగడమే. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షే మం, భద్రతతోపాటు ఇళ్ల నిర్మాణ కార్యక్రమం వైఎస్ హయాంలో ప్రభు త్వం భారీగా చేపట్టడం ఇందుకు తోడ్పడింది.
          సామాజికరంగాలపై ఖర్చు పెట్టడంలో 2000-01 మధ్యకాలంలో గుజ రాత్ కంటే రాష్ట్రం వెనుకబడి ఉంది. అయితే, 2005-06 మధ్యకాలంలో మాత్రం గుజరాత్ కంటే రాష్ట్రం ముందంజలో ఉంది. మొత్తం ప్రభుత్వ వ్యయంలో సామాజికరంగాలకు గుజరాత్‌లో 2005-06లో 36.8 శాతం మాత్రమే కేటాయించగా, ఇదేకాలంలో రాష్ట్రంలో 41.6 శాతంగా ఉంది.
          మొత్తం ప్రణాళిక వ్యయంలో సామాజికరంగాలకు చేసిన వ్యయం కూడా 2000-01 కంటే 2008-09లో భారీగా పెరిగింది. 2008-09 ఆర్థిక సంవ త్సరంలో మొత్తం ప్రణాళిక వ్యయంలో సామాజికరంగాలకు చేసిన వ్యయం రాష్ట్రంలో 48 శాతం ఉండగా, గుజరాత్‌లో ఇది 38 శాతం మాత్రమే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement