న్యూఢిల్లీ: ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు ఫోన్ మోగుతుంది.. ఇంత పొద్దునే ఎవరా అనే అనుమానంతో పాటు.. ఏదైనా బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందేమో అనే భయంతోనే ఫోన్ లిఫ్ట్ చేస్తాం. అవతలి మనిషి కంఠం గుర్తుపట్టి.. విషయం విన్నాక కానీ స్థిమితపడం. ఇదే పరిస్థితి తనకు ఎదురయ్యింది అంటున్నారు నోబెల్ అవార్డు గ్రహీత, ప్రముఖ భారత ఆర్థిక నిపుణులు అమర్త్య సేన్. కానీ ఆ ఫోన్ కాల్ తన జీవితంలోని అత్యంత ఆనందమైన.. వెలకట్టలేని శుభవార్తను తెలిపింది అన్నారు. తాను నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నానని తెలిపే కాల్ అది అన్నారు. ఆ నాటి మధుర జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకున్నారు అమర్త్య సేన్. (చదవండి: నా నోబెల్ బహుమతి తిరిగి ఇప్పించండి)
‘అక్టోబర్ 14, 1998 ఉదయం ఐదు గంటలకు ఫోన్ మోగుతుంది. అప్పుడు నా మొదటి ఆలోచన ఏంటంటే.. ఏదైనా బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందా.. ఎవరైనా అనారోగ్యానికి గురయ్యారా అనే అనుమానాలు మనసులో మెదిలాయి. రిసివర్ తీసుకుని చెవి దగ్గర పెట్టుకున్నాను. అకాడమీ నుంచి వచ్చిన ఫోన్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నాను. కాల్ మాట్లాడిన తర్వాత శుభవార్త అని అర్థం అయ్యింది. నాకు నోబెల్ బహుమతి వచ్చిందని చెప్పడానికి అకాడమీ వారు కాల్ చేశారు.
ఆ తర్వాత ప్రశాంతంగా కాఫీ తాగాను’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అన జ్ఞాపకాలను పంచుకున్నారు అమర్త్య సేన్. సోషల్ చాయిస్, వెల్ఫేర్ మెజర్‌మెంట్ అండ్ పావర్టి రిసర్చ్ అంశంలో పరిశోధనలకు గాను 1998లో అమర్త్య సేన్‌కు నోబెల్ బహుమతి లభించిన సంగతి తెలిసిందే. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment