సాక్షి, హైదరాబాద్: పాత రూ.500, రూ.వెరుు్య నోట్లతో స్టాంప్ డ్యూటీ చెల్లించేందుకు ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 24 వరకు వెసులుబాటు కల్పించిన ఫలితంగా రిజిస్ట్రేషన్ల శాఖకు రాబడి గణనీయంగా పెరిగింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా తగ్గిపోయారుు. వినియోగదారులు అప్పటికే కొనుగోలు చేసిన ఆస్తులను రిజిస్ట్రేషన్ చేరుుంచుకోవడం పైనా నోట్ల రద్దు ప్రభావం చూపింది. రిజిస్ట్రేషన్ల నిమిత్తం చెల్లించే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కూడా పన్ను చెల్లింపు పరిధిలోకే వస్తున్నందున పాత నోట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 24 వరకు వెసులుబాటు కల్పించింది.
ఫలితంగా రిజిస్ట్రేషన్ల శాఖలో లావాదేవీలు పెరిగి రోజువారీ రాబడి పెరిగింది. కాగా, కొన్ని రకాల పన్నులను పాత నోట్లతోనే చెల్లించేందుకు కేంద్రం డిసెంబర్ 15 వరకు వెసులుబాటు కల్పించగా రిజిస్ట్రేషన్లకు వర్తింప జేసే విషయమై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలే దని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరోవైపు గ్రామ పంచాయతీల్లో పాత నోట్లతో ఆస్తి పన్ను చెల్లించేందుకు డిసెంబర్ 15 వరకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించినట్లు పంచాయ తీరాజ్ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.