పసిడికి డాలర్ కష్టాలు..
ముంబై: అటు అంతర్జాతీయంగా బలహీన ట్రెండ్, ఇటు దేశీయంగా పెద్ద నోట్ల రద్దు సమస్యలతో స్టాకిస్టులు, జ్యుయలర్ల నుంచి డిమాండ్ పడిపోవడం వంటి అంశాలు సమీపకాలంలో పుత్తడిపై ప్రభావం చూపనున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ గానీ ఊహించినట్లుగా వచ్చే నెలలో వడ్డీ రేట్లు పెంచిన పక్షంలో ఇన్వెస్టర్లు పసిడిని పక్కన పెట్టి డాలర్ల వైపు మళ్ళొచ్చని వారి అభిప్రాయం. డాలర్ పెరుగుతున్న కొద్దీ బంగారానికి డిమాండ్ మరింత తగ్గొచ్చని అంచనాలున్నారుు. ఇప్పటికే డాలర్ ఇండెక్స్ దాదాపు దశాబ్ద గరిష్ట స్థారుులో తిరుగాడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా పసిడి రేట్లు గత వారం తొమ్మిది నెలల ఇంట్రా డే కనిష్ట స్థారుుని తాకారుు.
శుక్రవారంతో ముగిసిన వారంలో పుత్తడి రేటు తగ్గింది. ముంబైలో మేలిమి బంగారం (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల రేటు రూ. 305 (1.04 శాతం) క్షీణించి రూ. 29,005 వద్ద ముగిసింది. ఇక ఆభరణాల బంగారం కూడా దాదాపు అంతే తగ్గుదలతో రూ. 28,855 వద్ద ముగిసింది. వెండి కిలో ధర రూ. 500 (11.97 శాతం) క్షీణించి రూ. 41,265 వద్ద క్లోజ రుు్యంది. అటు అంతర్జాతీయంగా న్యూ యార్క్ ఫ్యూచర్స్ మార్కెట్లో పసిడి ఔన్సు (31.1 గ్రాములు) రేటు 1,208.7 డాలర్ల నుంచి 1,179 డాలర్లకు తగ్గింది.