క్యాష్‌లెస్‌పై కసరత్తు | excercise on cash less payments | Sakshi
Sakshi News home page

క్యాష్‌లెస్‌పై కసరత్తు

Published Fri, Dec 2 2016 4:50 AM | Last Updated on Mon, Sep 4 2017 9:38 PM

క్యాష్‌లెస్‌పై కసరత్తు

క్యాష్‌లెస్‌పై కసరత్తు

►  నగదు రహిత లావాదేవీలు
►  వయోజనులకు ఖాతాలు.. డిజిటల్ చెల్లింపులు..
►  జన్‌ధన్ ఖాతాలు, జీరో అకౌంట్స్ వివరాల సేకరణ
►  జిల్లాలో 82 బ్రాంచ్‌లు.. 7 లక్షలకుపైగా ఖాతాలు..

 
ఆదిలాబాద్ అర్బన్ :కరెన్సీ వినియోగం పాతమాట.. క్యాష్‌లెస్ విధానం కొత్త బాట. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కరెన్సీ నోట్ల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం క్యాష్‌లెస్(నగదు రహిత) విధానం అమల్లోకి తెచ్చేందుకు నడుం బిగించింది. క్యాష్‌లెస్ లావాదేవీల నిర్వహణకు ప్రభుత్వంతోపాటు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలతోపాటు బ్యాంకు ఖాతాలు లేని వియోజనులందరికీ ఖాతాలు తెరిపించడం, క్యాష్‌లెస్ విధానంపై అవగాహన కల్పించడం, నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించడం వంటివి చేపట్టేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఆయా బ్యాంక్ బ్రాంచిల పరిధిలో ఖాతాలు తెరిపించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడంతోపాటు వాణిజ్య పన్నుల చెల్లింపులన్నీ నగదు రహితంగా జరిగేలా ప్రజలకు అవగాహన కల్పిస్తారు.

ఇందుకు రేషన్ డీలర్లు, వ్యాపారులను ప్రోత్సహించనున్నారు. అత్యసవరంగా క్యాష్‌లెన్ విధానాన్ని ప్రోత్సహించాలని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్, న్యూఢిల్లీ నుంచి ఆయా ప్రభుత్వ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్‌‌స ద్వారా సూచించారు. కలెక్టర్ జ్యోతిబుద్ధ ప్రకాశ్ సైతం మూడు రోజుల్లోనే రెండుసార్లు బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. క్యాష్‌లెస్ విధానం ప్రజలకు తెలియజేసి అవగాహన కల్పించాలని మండల స్థారుు అధికారులకూ సూచించారు.

జిల్లాలో 7.50 లక్షల ఖాతాలు..
జిల్లాలోని 18 మండలాల పరిధిలో 29 బ్యాంకులు ఉన్నారుు.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 82 బ్యాంకు బ్రాంచిలు ఉన్నారుు. వీటి పరిధిలో సేవింగ్‌‌స అకౌంట్స్‌తోపాటు, జన్‌ధన్ ఖాతాలు, జీరో బ్యాలెన్‌‌స ఖాతాలు ఉన్నారుు. జిల్లాలో జీరో బ్యాలన్‌‌స అకౌంట్లు 2.50 లక్షలు ఉండగా, జన్‌ధన్ ఖాతాలు ఐదు లక్షల వరకు, రెండు కలిపి దాదాపు 7.50 లక్షల ఖాతాలు ఉంటాయని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. నోట్ల రద్దుకు ముందు ఈ రెండు రకాల ఖాతాల ద్వారా నగదు లావాదేవీలు ఎక్కువగా జరిగేవి కావు. ప్రస్తుతం జన్‌ధన్, జీరో బ్యాలెన్‌‌స ఖాతాలపై బ్యాంకు అధికారులు దృష్టి సారించారు.

రద్దుకు ముందు ఎప్పుడూ నగదు లావాదేవీలు జరగని ఖాతాలు, రద్దు తర్వాత నగదు లావాదేవీలు జరిగిన ఖాతాలు వివరాలను సేకరించేలో పనిలో నిమగ్నమయ్యారు. ఖాతాలకు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చారుు. ఎక్కడ డిపాజిట్ చేస్తున్నారు.. ఎక్కడ డ్రా చేస్తున్నారనే వివరాలు సేకరించాల్సి ఉందని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. జన్‌ధన్, జీరో బ్యాలెన్‌‌స ఖాతాదారులకు ఖాతా తెరిచే సమయంలో కొత్తగా రూపే ఏటీఎం కార్డులు అందజేశారు. కానీ చాలా చోట్ల పిన్ ఇవ్వలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఖాతాలను ఎక్కువగా వినియోగించకపోరుునా ప్రస్తుతం డిజిటల్ చెల్లింపు విధానం అమలైతే కొంత మందికి కొత్త ఖాతా తెరవాల్సిన అవసరం లేకుండా పోరుుందని చెప్పవచ్చు.

వయోజనులందరికీ ఖాతాలు..
జిల్లాలో చాలామందికి బ్యాంకు ఖాతాలు ఉన్నప్పటికీ అందరికీ రూపే కార్డులు లేవు. 18 ఏళ్లు ఆపై వయసున్న వయోజనులందరికీ బ్యాంకు ఖాతాలు ఇప్పించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. గ్రామాలకు వెళ్లి బ్యాంకు ఖాతాల తెరిచే విధంగా ప్రజలకు అవగాహన కల్పించి అందరినీ డిజిటల్ విధానంలోకి తీసుకురావాలని నిర్ణరుుంచారు. ఇందుకోసం అధికారులు, బ్యాంకర్లు బిజీబిజీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముందుగా ఆసరా పింఛన్ లబ్ధిదారులు, ఉపాధి హామీ కూలీలు, కార్మికులకు బ్యాంకు ఖాతాలు ఇప్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. ఇలా తెరిచిన బ్యాంకు ఖాతాలకు ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేస్తారు.

ఖాతా నంబర్ తెలియకపోరుునా ఆధార్ నంబర్ సాయంతో సంబంధిత బ్యాంకు ఖాతాల్లో ఎక్కడి నుంచైనా చెల్లింపులు జరిపే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ఓ బ్యాంకు కోఆర్డినేటర్‌ను అందుబాటులో ఉంచడంతోపాటు లీడ్‌బ్యాంకు మేనేజర్, మీ సేవ, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేయనున్నారు. ప్రజలు అలవాటు పడాలి - ప్రసాద్, లీడ్‌బ్యాంకు మేనేజరు, ఆదిలాబాద్

జిల్లాలో కొంతమందికి ఇప్పటికే బ్యాంకు ఖాతాలు ఉన్నా ఇంకొంత మంది కొత్త ఖాతాలు తెరవాల్సి ఉంది. ప్రజలు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలి. నగదు రూపంలోనే కాకుండా చాలా సౌకర్యాలు ఉన్నారుు. స్వైపింగ్ మిషన్, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లకు ప్రజలు అలవాటు పడాలి. డిజిటల్ విధానం ద్వారా చెల్లింపులు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement