
డిజిటల్ వాలెట్లు ఎంత భద్రం?
దేశంలో ఇటీవల డిజిటల్ వాలెట్ల వాడకం జోరందుకుంది. దీనికి నోట్ల రద్దు అంశం కూడా బాగా కలిసొచ్చింది. డిజిటల్ వాలెట్లు ఉపయోగిస్తూ క్యాష్‌లెస్ ఎకానమీ వైపు అడుగులేస్తున్న మనం వాటి భద్రత గురించి కూడా ఆలోచించాలి కదా. చాలా మందికి ఇప్పటికీ కూడా డిజిటల్ వాలెట్లపై పూర్తి విశ్వాసంతో లేరు. అంటే ఫోన్ ద్వారా లావాదేవీలు జరపడంపై అభద్రతాభావంతో ఉన్నారు. హ్యాకింగ్, వైరస్, ఫోన్ తస్కరణ వంటి అంశాలు వీరిని భయాందోళనలకు గురిచేస్తున్నారుు. బలమైన ఎన్‌క్రిప్షన్ వల్ల హ్యాకింగ్, వైరస్ వంటి సమస్యలను ఎదుర్కోవచ్చని నిపుణులు అంటున్నారు.
ఆయా కంపెనీలు ఈ అంశంపై తీవ్రంగా శ్రమిస్తున్నాయని వివరించారు. ఇక మొబైల్ ఫోన్ జారిపోరుునా కూడా డిజిటల్ వాలెట్లకు వచ్చిన కష్టం ఏమీ ఉండదని, ఫోన్‌ను బ్లాక్ చేయవచ్చని తెలిపారు. అలాగే వాలెట్లను ప్రత్యేకమైన పిన్ ఉపయోగించి లాక్ వేసుకోవచ్చన్నారు. కొంతమేర భద్రతా పరమైన అనుమానాలు ఉన్నప్పటికీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులతో పోలిస్తే మాత్రం డిజిటల్ వాలెట్లు ఉత్తమమని నిపుణుల అభిప్రాయం. క్రెడిట్ కార్డును ఎవరన్నా కొట్టేసినా, ఆన్‌లైన్ ఐడెంటిటీని తస్కరించిన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాగా క్రెడిట్ కార్డు మోసాలను నిత్యం చూస్తునే ఉన్నాం. ఈ మధ్యనే భారీగా డెబిట్ కార్డుల డేటా తరస్కరణకు గురవ్వడం పలు బ్యాంకులు వాటిని బ్లాక్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.