నోట్లు.. పాట్లు.. | public suffering with big nots cancelled | Sakshi
Sakshi News home page

నోట్లు.. పాట్లు..

Published Fri, Nov 11 2016 3:39 AM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

నోట్లు.. పాట్లు..

నోట్లు.. పాట్లు..

ఈ చిత్రంలో నిల్చుని వినయంగా వేడుకుంటున్న వ్యక్తి పేరు శంకర్. సొంతూరు వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ముజాహి ద్‌పూర్ అనుబంధ దాశ్యనాయక్ తండా....

పరిగి: ఈ చిత్రంలో నిల్చుని వినయంగా వేడుకుంటున్న వ్యక్తి పేరు శంకర్. సొంతూరు వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ముజాహి ద్‌పూర్ అనుబంధ దాశ్యనాయక్ తండా. శంకర్ సోదరుడు బాల్‌రాజ్ వివాహం శుక్రవారం జరగనుంది. పెళ్లి ఖర్చుల కోసం రూ.లక్ష సిద్ధం చేసుకుని ఇంట్లో దాచుకున్నారు. ఇంతలో రూ. 500, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో ఏం చేయాలో పాలుపో లేదు. గురువారం ఇదిగో ఇలా పరిగి ఎస్‌బీహెచ్ (ఏడీబీ)కి వచ్చాడు. బ్యాంకు మేనేజర్‌ను కలసి రూ.లక్ష డిపాజిట్ చేసుకుని కొత్త నోట్లు ఇవ్వాలని ప్రాధేయపడ్డాడు. నిబంధనలు దాటి తాను ఏమీ చేయలేనని..డిపాజిట్ చేసుకుని రూ.4 వేలు మాత్రమే ఇవ్వగలనని బ్యాంకు మేనేజర్ ఫకీరయ్య సమాధానం ఇచ్చారు. దీంతో చేసేదిలేక శంకర్ ఇంటిముఖం పట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement