కొనుగోళ్లకు తరుణమిదే
• ఏడాదిలో 20 శాతం ధరలు పెరిగే అవకాశం
• క్రెడాయ్ తెలంగాణ అంచనా
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ప్రభావం స్థిరాస్తి రంగంలో ప్రత్యేకించి అపార్ట్‌మెంట్ విభాగానికి ఎలాంటి ప్రభావం లేదని.. కొద్ది కాలం మాత్రం స్థలాలు, ప్లాట్స్ విభాగాలపై పడుతుందని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) తెలంగాణ అధ్యక్షుడు జి రాంరెడ్డి చెప్పారు. ఐటీ, ఫార్మా, ప్రభుత్వం, ఇతర కార్పొరేట్ ఉద్యోగులే మా కస్టమర్లు. వీరందరూ 90 శాతం లావాదేవీలు చెక్కులు, ఆన్‌లైన్ ద్వారానే జరుపుతారని పేర్కొన్నారు. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ), స్థిరాస్తి నియంత్రణ బిల్లు (రెరా) అమలులోకి వచ్చాక ధరలు పెరిగే అవకాశముందని చెప్పారు. ఆయా చట్టాల్లోని నిబంధనలతో అసంఘటిత బిల్డర్లు/డెవలపర్లు నిలదొక్కుకోలేరన్నారు.
పెద్ద బిల్డర్లు మార్కెట్లో ధరలను కృత్రిమంగా పెంచే ప్రమాదముందని ఏడాది కాలంలో 20 శాతం మేర ధరలు పెరిగే అవకాశముందని అంచనా వేశారు. కాబట్టి స్థిరాస్తి కొనుగోళ్లకు ఇదే సరైన సమయమని సూచించారు. దేశంలో పాత నోట్ల మార్పిడితో కోట్లాది సొమ్ము ప్రభుత్వానికి చేరుతోంది. దీంతో మౌలిక వసతులు, సదుపాయాలపై ఖర్చు చేసే అవకాశముందని సెక్రటరీ సీహెచ్ రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. వచ్చే దశాబ్ధ కాలంలో 50 శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లోకి వలస వస్తారు. స్టార్టప్స్, సెల్ఫ్ ఎంప్లారుుమెంట్ పెరిగి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతారుు. దీంతో స్థిరాస్తి రంగానికి డిమాండ్ వస్తుందని అంచనా వేశారు.
ఇంటి అందం రెట్టింపు
ఫ్లోరింగ్: మార్బుల్ ఫ్లోరింగ్ ఇంటికి అదనపు అందం, ఆకర్షణే. అరుుతే ఇదంతా తరుచూ నిర్వహణ ఉన్నప్పుడే సుమా. ఇంట్లోకి దుమ్ము, ధూళి రాకుండా నివారించుకోవాలి. దీని కోసం డోర్‌మ్యాట్ల వాడకంతో సరిపెట్టకుండా ఇంటికి వచ్చే అతిథులు షూ, చెప్పులను బయటే విప్పి ఇంట్లోకి వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ఫ్లోరింగ్ శుభ్రత కోసం రసాయనాల జోలికి వెళ్లకుండా నీటిలో కొంచెం అమ్మోనియా కలిపితే శుభ్రం చేశాక చూడండి మీ ఫ్లోరింగ్ తళతళ మెరిసిపోతుంది.
కార్పెట్లు: కార్పెట్లు దుమ్మును ఎక్కువగా ఆకర్షిస్తారుు. వీటిని తరుచుగా వాక్యుమ్ క్లీనర్‌తో శుభ్రం చేయక తప్పదు. దుమ్ము పట్టడం వల్ల కార్పెట్లు కళావిహీనంగా కనిపిస్తారుు. కాబట్టి నాలుగున్నర లీటర్ల నీటిలో ఓ కప్పు తెల్ల వెనిగర్‌ను కలిపి బ్రష్‌తో రుద్దితే కార్పెట్‌లోని వర్ణాలు మెరుస్తారుు. కార్పెట్లపై టీ, సిరా వంటి మరకలు పడితే వాటిని పోగొట్టడానికి పావుకప్పు తినే సోడా, రెండు చెంచాల తెల్ల వెనిగర్‌తో చేసిన పేస్టు రుద్దాలి. ఆ పేస్టును ఆరనిచ్చి, వాక్యుమ్ క్లీనర్‌తో మరకలు ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేశాక చూడండి కార్పెట్లు మెరిసిపోతారుు.
గోడలు: గోడలను తరుచూ స్టాటిక్ డస్టర్‌తో తుడవాలి. దీంతో ఎక్కడైనా బూజు, సాలెగూడు వంటివి ఉంటే తొలిగిపోతారుు. గోడలపై పానియాలు, టీ వంటివి పడితే వెంటనే నీళ్లు, గాఢత తక్కువగా ఉండే డిటెర్జంట్లతో శుభ్రం చేయాలి. అరుుతే ఈ సమయంలో గోడల్ని గట్టిగా రుద్దడం చేయకూడదు.
మైక్రోఓవెన్: మైక్రోఓవెన్‌ను అధికంగా వాడటం వల్ల ఎక్కువగా మురికిపడుతుంది. దీన్ని శుభ్రం చేయడానికి ఉత్తమ మార్గం.. సగం కప్పు నీళ్లు, సగం కప్పు తెల్ల వెనీర్‌ను మైక్రోప్రూఫ్ గిన్నెలో పోసి, మైక్రోఓవెన్‌లో వేడి చేయాలి. దీంతో గట్టిగా ఉండే ఆహారపదార్థాలు, గ్రీజు మరకలు శుభ్రం చేయడానికి అనువుగా తేలికపడతారుు.
వంటింట్లో..: బాత్ ఫిట్టింగ్‌ల దగ్గర నుంచి ఫర్నిచర్ వరకు ఉక్కు ఎక్కువగా వాడుతుంటాం. స్టీల్‌కే పరిమితం కాకుండా పైన క్రోమ్ పూతతో వస్తున్నారుుప్పుడు. స్నానాల గదిలో, వంటింట్లో వాడే నల్లాలు, నీటిలోని ఉప్పు పేరుకుపోవడం వల్ల చూడడానికి వికారంగా కన్పిస్తారుు. ఇలాంటి మరకల్ని తొలగించి స్టీల్ వస్తువులు మెరిసేలా కన్పించాలంటే ఆల్కహాల్‌తో తుడవాలి. నల్లాపైన ఏర్పడే నీటి మర కల్ని టూత్‌పేస్టుతో రుద్దడం ద్వారా తొలగించవచ్చు. వంటింట్లోని సింక్ పరిశుభ్రంగా కన్పించాలంటే నాలుగు పాళ్ల ఉప్పుకు ఒక పాలు వెనిగర్ కలిపి ప్రయత్నించండి.