credai Telangana
-
నిర్మాణ అనుమతుల కలెక్టర్లకు అప్పగింతపై పునరాలోచించండి!
సాక్షి, హైదరాబాద్: ‘జిల్లాలలోని పని ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్న కలెక్టర్లకు అదనంగా భవన నిర్మాణ అనుమతులు అప్పగించడం సరైంది కాదు. డీటీసీపీ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలో ఉన్నట్టు సాంకేతిక నిపుణులు, ఇన్ఫ్రా జిల్లా కేంద్రాలలో లేవు. భవన నిర్మాణ అనుమతుల ఏర్పడే సమస్యల పరిష్కారం కోసం వారంలో రెండు రోజులను కేటాయించారు. అయితే ఆ రోజుల్లో మంత్రి, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం ఉంటే గనక ఇక అంతే సంగతులు. ప్రతి జిల్లాలోను టీఎస్‌బీపాస్ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. దాని పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని’ క్రెడాయ్ తెలంగాణ నూతన కార్యవర్గం కోరింది. ఈ విషయంపై సంబంధింత మంత్రిని సంప్రదించనున్నామని తెలిపింది. క్రెడాయ్ తెలంగాణ నూతన ప్రెసిడెంట్ ఎన్నికైన డీ మురళీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. భూముల సమగ్రత, సులభతర క్రయ విక్రయాల కోసం ఏర్పాటు చేసిన ధరణిపై సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని.. కాకపోతే దీన్ని దశల వారీగా అమలు చేస్తే మరింత సమర్థవంతంగా ఉండేదని సూచించారు. ధరణిలో ఏర్పడుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అప్పటివరకు పాత పద్ధతులను సైతం కొనసాగించాలని కోరారు. టీఎస్‌బీపాస్‌ను జిల్లాలలో పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టి, అమలులో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇతర నగరాల్లో రియల్టీ రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని, హైదరాబాద్‌లో మాత్రం డిమాండ్ ఏర్పడుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సమగ్రవంతమైన పారిశ్రామిక విధానాలు, అందుబాటులో భూముల ధరలు వంటివి ఇందుకు కారణమని తెలిపారు. టీఎస్‌ఐసీతో జిల్లాలలో అభివృద్ధి.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ)ని తీసుకొచ్చారని.. దీంతో స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఈ. ప్రేమ్‌సాగర్ రెడ్డి అన్నారు. జిల్లాల విభజన, మౌలిక వసతుల అభివృద్ధి, ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లలో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ వంటి జిల్లాలలో భూముల ధరలు పెరిగాయని చెప్పారు. అయినప్పటికీ ఇతర నగరాల్లోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలతో పోలిస్తే ఆయా జిల్లాలలో అందుబాటులోనే ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో గృహాలకు, గిడ్డంగి సముదాయాలకు డిమాండ్ పెరిగిందని చెప్పారు. వన్ డిస్ట్రిక్ట్–వన్ ప్రొడక్ట్‌తో డిమాండ్.. ఇప్పటివరకు ఐటీ, ఫార్మా హబ్‌గా ఉన్న హైదరాబాద్ ఏరోస్పేస్, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ విభాగాలలో భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తుందని సెక్రటరీ కే. ఇంద్రసేనా రెడ్డి అన్నారు. మార్కెట్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఎగుమతులను ప్రోత్సహించేందుకు, జిల్లాలలో పారిశ్రామిక జోన్ల అభివృద్ధి కోసం ‘వన్ డిస్ట్రిక్ట్– వన్ ప్రొడక్ట్’ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తుందని.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రియల్టీ రంగానికి డిమాండ్ ఏర్పడుతుందని చెప్పారు. క్రెడాయ్ నూతన కార్యవర్గం కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ చైర్మన్‌గా సీహెచ్. రామచంద్రారెడ్డి, ప్రెసిడెంట్‌గా డీ. మురళీ కృష్ణారెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్‌గా ఈ. ప్రేమ్‌సాగర్ రెడ్డి, సెక్రటరీగా కే. ఇంద్రసేనా రెడ్డి, ఉపాధ్యక్షులుగా జీ. అజయ్ కుమార్, జగన్ మోహన్ చిన్నాల, వీ. మధుసూదన్ రెడ్డి, బీ. పాండు రంగారెడ్డి, జాయింట్ సెక్రటరీగా జీ. శ్రీనివాస్ గౌడ్, ట్రెజరర్‌గా ఎం. ప్రశాంత రావు ఎన్నికయ్యారు. క్రెడాయ్ యూత్ వింగ్ తెలంగాణ కో–ఆర్డినేటర్‌గా సీ సంకీర్త్ ఆదిత్యరెడ్డి, సెక్రటరీగా రోహిత్ ఆశ్రిత్ నియమితులయ్యారు. 2021–23 సంవత్సరానికి గాను ఈ నూతన కార్యవర్గం పదవిలో ఉంటుంది. ప్రోత్సాహకర విధానాలు.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రోత్సాహకర విధానాలతో రాష్ట్రం వృద్ధిపథంలో దూసుకుపోతుందని చైర్మన్ సీహెచ్ రామచంద్రా రెడ్డి చెప్పారు. టీఎస్ఐపాస్తో హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాలలోను చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమలు వచ్చాయని, దీంతో ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యాయన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు టీ–హబ్, ఎస్సీ, ఎస్టీల కోసం టీప్రైడ్ వంటి వినూత్న పథకాలతో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెరిగిందని.. దీంతో స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లతో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూములు పెరిగాయని, పంట ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయికి రాష్ట్రం ఎదిగిందని తెలిపారు. వీటన్నింటి ప్రయోజనాలతో హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ వంటి జిల్లాలలోను గృహలకు, వాణిజ్య కేంద్రాలు, గిడ్డంగులకు డిమాండ్ పెరిగిందని వివరించారు. నిర్మాణ రంగంలో సాంకేతిక వినియోగం, నైపుణ్యం కలిగిన మానవ వనరులను జిల్లా చాప్టర్లకు సైతం విస్తరించేందుకు కార్మికుల నైపుణ్యాభివృద్ధి, సభ్యులకు శిక్షణ వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని, నీటి పొదుపు, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలపై మెంబర్లకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. సంఘటిత డెవలపర్ల ప్రాజెక్ట్‌లు, అందుబాటు ధరల్లో నాణ్యమైన గృహాలను ఒకే వేదికగా సామాన్యులకు సైతం చేరేలా అన్ని జిల్లా చాప్టర్లలోను ప్రాపర్టీ షోలను నిర్వహిస్తామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 క్రెడాయ్ చాప్టర్లున్నాయని, ఈ రెండేళ్ల కాలపరిమితిలో వీటిని 20కి విస్తరిస్తామని పేర్కొన్నారు. -
తగ్గడంలే... ఇళ్ల ధరలు పెరుగుతాయట!
సాక్షి, వెబ్‌డెస్క్: అద్దె ఇళ్లలో ఉండే సవాలక్ష నిబంధనలకు తోడు కరోనా సంక్షోభం నేర్పిన పాఠాలతో సొంతిళ్లు అవసరమనుకునే వారి సంఖ్య పెరిగింది. అప్పు చేసైనా సరే ఇది నా ఇల్లు అనిపించుకుందామనే ప్రయత్నాలు పెరిగాయి. అయితే అంతకు ముందే ఇంటి నిర్మాణ రంగంలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు అనూహ్యంగా పెరిగిపోవడంతో సొంతింటికి కల మరోసారి మధ్య తరగతి ప్రజలకు అందని ద్రాక్షగానే మారుతోంది. స్టీలు ధరలకు రెక్కలు ఇంటి నిర్మాణ రంగంలో కీలకమైన స్టీలు ధరలు ఏడాది కాలంలో దాదాపు 30 శాతం పెరిగాయి. లాక్డౌన్ కంటే ముందు హోల్‌సేల్ మార్కెట్లో 8 మిల్లీమీటరు స్టీలు టన్ను ధర రూ.42,000 ఉండగా ఇప్పుడు టన్ను స్టీలు ధర రూ.57,00లకు చేరుకుంది. ఇదే తరహాలో సిమెంటు బ్యాగు ధర సగటున వంద రూపాయల వరకు పెరిగింది. వీటితో పాటు ఇంటి నిర్మాణంలో కీలకమైన కాపర్ ధర 40 శాతం, అల్యుమినియం ధర 60 శాతం పెరిగినట్టు డెవలపర్లు చెబుతున్నారు. డిమాండ్ పెరిగింది కరోనా కల్లోల సమయంలో అద్దె ఇళ్లలో ఎదురైన ఇబ్బందులతో సొంత ఇల్లు కావాలనుకునే వారి సంఖ్య పెరిగింది. దీంతో నిర్మాణంలో ఉన్న వెంచర్లు, అపార్ట్మెంట్లకు డిమాండ్ పెరిగింది. అయితే పెరిగిన ధరలు వారికి షాక్ ఇస్తున్నాయి. కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పటికే సేవింగ్స్ చాలా ఖర్చుకావడం, ఎక్కువ మందికి జీతాల్లో కోతలు పడ్డాయి. ఈ తరుణంలో లోన్లు తీసుకుని ఇళ్లు కొందామనుకునే వారికి పెరుగుతున్న ధరలు అశనిపాతంలా మారాయి. కట్టాలన్నా కష్టమే డెవలపర్లు ఒకేసారి పెద్ద ఎత్తున సిమెంటు, స్టీలు కొనడం వల్ల హోల్‌సేల్ ధరలకు లభిస్తున్నాయి. కానీ జిల్లా కేంద్రాలు, ఇతర చిన్న పట్టణాల్లో ఇంటి నిర్మాణం స్వంతంగా చేపట్టాలనుకునే వారికి పెరిగిన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రిటైల్ మార్కెట్లో టన్ను స్టీలు ధర 65,000 దగ్గర ఉంది. సిమెంటు బ్యాగు రూ. 400 దగ్గర లభిస్తోంది. దీంతో సొంతింటి కల భారంగా మారుతోంది. పెరిగిన లేబర్ కష్టాలు గతంలో బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిషాల నుంచి లేబర్ పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌తో పాటు పెద్ద ప్రాజెక్టులు, జిల్లా కేంద్రాల్లో పనికి వచ్చే వారు. లోకల్ లేబర్‌తో పోల్చితే వీరు తక్కువ కూలీలకే పనులకు వచ్చేవారు. వరుస లాక్డౌన్లు, కోవిడ్ నిబంధనల కారణంగా తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిన లేబర్‌లో చాలా మంది అక్కడే ఉండి పోయారు. దీంతో పని ప్రదేశాల్లో కూలీల కొరత ఏర్పడింది. డబుల్ కూలీ ఇస్తే తప్ప లేబర్ దొరికే పరిస్థితి లేదంటున్నారు డెవలపర్స్. 30 శాతం పెరుగుతాయి కోవిడ్ తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోంది. మరోవైపు క్రమంగా నిర్మాణ రంగం కూడా గాడిన పడుతోంది. ధీర్ఘకాలం పాటు మధ్యలో ఆగిపోయిన భవనాల్లో తిరిగి పనులు ప్రారంభం అవుతున్నాయి. ప్రస్తుతం అపార్ట్మెంట్ల ధరలు పెరిగిన మాట వాస్తవమేని, అయినా సరే ఇప్పుడు ఇళ్లు కొనడమే మంచిందని, పెరిగిన ముడి పదార్థాల ధరల వల్ల రాబోయే రోజుల్లో ఇళ్ల ధరలు కనీసం 30 శాతం వరకు పెరగవచ్చని క్రెడాయ్ ప్రతినిధులు అంటున్నారు. స్టీలు ధరల పెరుగుదల (టన్ను ధర ) స్టీలు సైజు 2020 ఫిబ్రవరి 2021 ఆగస్టు 8 ఎంఎం రూ.42,000 రూ.57,000 10 ఎంఎం రూ. 41,000 రూ.56,000 12 ఎంఎం రూ.40,5000 రూ 56,000 14 ఎంఎం రూ.41,000 రూ.56,000 16 ఎంఎం రూ.41,000 రూ. 56,000 -
చేయూతనిస్తే నిర్మాణానికి ఊతం!
సాక్షి, హైదరాబాద్: ‘మునుముందు నిర్మాణ రంగంలో ‘సెమీ మెకనైజ్డ్ విధానం’ అనుసరించడం ద్వారా కార్మికుల కొరతను అధిగమించవచ్చు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితి మరో 3 – 4 నెలల్లో సమసిపోతుంది. కొత్త ప్రాజెక్టుల ప్రారంభం కంటే ప్రస్తుతం పురోగతిలో ఉన్న ప్రాజెక్టుల పూర్తిపై నిర్మాణ సంస్థలు దృష్టిపెట్టాలి. పారిశ్రామిక రంగం తరహాలో ఈ రంగానికీ ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలి. చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో నిర్మాణ రంగానికి కరోనా సంక్షోభంలోనూ మంచి భవిష్యత్తు ఉంది’ అని క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు చెరుకు రామచంద్రారెడ్డి అన్నారు. నిర్మాణరంగం స్థితిగతులపై ‘సాక్షి’తో ఆయన తన అభిప్రాయాలు పంచుకున్నారు. కూలీల కొరత సమస్య కాదు.. కరోనాకు ముందు తెలంగాణలో, ప్రత్యేకించి హైదరాబాద్‌లో నిర్మాణ రంగం మార్కెటింగ్‌పరంగా మంచి స్థితిలో ఉంది. లాక్‌డౌన్‌తో ఏర్పడిన అనిశ్చితికి తోడు కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోవడంతో పురోగతిలో ఉన్న ప్రాజెక్టులు కొంత ఆలస్యం కావచ్చు. నిర్మాణ రంగంలో యంత్రాల వినియోగం పెంచడం ద్వారా కూలీల కొరత పెద్ద సమస్య కాబోదు. దుబాయ్, అబుదాబి వంటి దేశాల్లో నిర్మాణరంగంలో ‘సెమి మెకనైజ్డ్ సిస్టమ్’ వినియోగిస్తున్నారు. నిజానికి హైదరాబాద్ నిర్మాణ రంగంలోనూ 2013 తర్వాత నుంచి ఈ విధానం క్రమంగా పెరుగుతోంది. అంటే టవర్ క్రేన్లు, హీస్ట్, ప్లాస్టరింగ్ మెషీన్ల వినియోగం పెరిగింది. కాబట్టి ఈ రంగం కార్మికుల కొరతను తట్టుకునే అవకాశం ఉంది. కాకపోతే, ఎంఎస్ఎంఈ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలను రియల్ ఎస్టేట్ రంగానికి కూడా వర్తింపచేస్తే మేలు జరుగుతుంది. ఇలాచేస్తే ఉత్తమం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం కంటే ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయడంపైనే దృష్టిపెట్టాలి. సాధారణంగా పెద్ద వెంచర్లు రెండున్నర నుంచి నాలుగైదేళ్లలో ప్రాజెక్టులను పూర్తి చేస్తుంటాయి. ప్రస్తుతం 3–4 నెలల సమయం వృథా కావడం, కొత్త ప్రాజెక్టులు ప్రారంభమయ్యే పరిస్థితి లేకపోవడంతో ఫ్లాట్స్ లభ్యత తగ్గితే మార్కెట్ కూడా స్థిరీకరణ చెందుతుంది. నెలన్నర పాటు పని లేకున్నా కార్మికులకు వేతనాలివ్వడం, ఇతర సౌకర్యాల కల్పనతో నిర్మాణ సంస్థల వద్ద ఉన్న నగదు నిల్వలు ఆవిరైపోయాయి. మరోవైపు కొనుగోలుదారులకు వేతనాల్లో కోత, ఉద్యోగ భద్రత వంటి అంశాలు కొత్త బుకింగ్‌లపై ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో పారిశ్రామిక రంగం తరహాలో నిర్మాణరంగానికి కూడా ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలి. పెట్టుబడులకు మరింత అవకాశం హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలకు నిర్మాణరంగం విస్తరిస్తోంది. భూమి లభ్యత తగ్గడంతో డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం, సానుకూల విధానాలతో ఫార్మా, ఐటీ, పారిశ్రామిక రంగాల్లోకి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. మరోవైపు చైనా పై అమెరికా, యూరోప్ దేశాలకు ఉన్న అపనమ్మకం కూడా హైదరాబాద్‌లో పెట్టుబడులకు అనుకూలంగా మారుతుంది. కరోనా మూలంగా అమెరికా ఎదుర్కొన్న సంక్షోభంతో ఔట్సోర్సింగ్ విధానం మనకు అనుకూలించే అంశం. వివిధ రంగా ల్లో ఉద్యోగాల కల్పన పెరగడం ద్వారా నిర్మాణ రంగానికి మంచి భవిష్యత్తు ఉంది. ఇక, ఈ రం గంలో ధరల విషయానికొస్తే పొరుగునున్న చెన్నై, బెంగళూరు, ముంబై నగరాలతో పోలిస్తే మన దగ్గర ఫ్లాట్లు, విల్లాలు, ఇళ్ల ధరలు తక్కువే. సడలింపులిస్తే మంచిది పురోగతిలో ఉన్న ప్రాజెక్టులకు అదనంగా 20 శాతం రుణాన్ని తక్షణమే అందుబాటులోకి వచ్చేలా చూడాలి. రుణాలు, కిస్తీలపై మారటోరియంను విడతలు గా కాకుండా ఒకేసారి ఏడాది పాటు పొడిగిస్తే ప్ర యోజనం. నిరర్ధక ఆస్తుల నిబంధనలను సడలించి రుణాలు పొందేందుకు మార్గం సుగమం చేయాలి. బ్యాంకు రుణాల చెల్లింపు వాయిదా గడువు పెంపు, ఆస్తిపన్ను, విద్యుత్ బిల్లులు, జీఎస్టీలో సడలింపులిస్తే కొనుగోలుదారులు ముందుకొస్తారు. రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా ప్రస్తుతమున్న ఆరు శాతం నుంచి తొలి మాసంలో రెండు శాతం, తర్వాతి నెలకు మూడు నుంచి మూడున్నర శాతం మేర తగ్గిస్తే కొనుగోలుదారులకు ప్రోత్సాహం లభిస్తుంది. తద్వారా జరిగే లావాదేవీల ద్వారా ప్రభుత్వానికి కూడా పన్నుల రూపంలో 30 శాతానికిపైగా ఆదాయం సమకూరుతుంది. -
మూడు రాజధానులతో ఏపీ అభివృద్ధి చెందుతుంది
-
కొనుగోళ్లకు తరుణమిదే
• ఏడాదిలో 20 శాతం ధరలు పెరిగే అవకాశం • క్రెడాయ్ తెలంగాణ అంచనా సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ప్రభావం స్థిరాస్తి రంగంలో ప్రత్యేకించి అపార్ట్మెంట్ విభాగానికి ఎలాంటి ప్రభావం లేదని.. కొద్ది కాలం మాత్రం స్థలాలు, ప్లాట్స్ విభాగాలపై పడుతుందని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) తెలంగాణ అధ్యక్షుడు జి రాంరెడ్డి చెప్పారు. ఐటీ, ఫార్మా, ప్రభుత్వం, ఇతర కార్పొరేట్ ఉద్యోగులే మా కస్టమర్లు. వీరందరూ 90 శాతం లావాదేవీలు చెక్కులు, ఆన్లైన్ ద్వారానే జరుపుతారని పేర్కొన్నారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ), స్థిరాస్తి నియంత్రణ బిల్లు (రెరా) అమలులోకి వచ్చాక ధరలు పెరిగే అవకాశముందని చెప్పారు. ఆయా చట్టాల్లోని నిబంధనలతో అసంఘటిత బిల్డర్లు/డెవలపర్లు నిలదొక్కుకోలేరన్నారు. పెద్ద బిల్డర్లు మార్కెట్లో ధరలను కృత్రిమంగా పెంచే ప్రమాదముందని ఏడాది కాలంలో 20 శాతం మేర ధరలు పెరిగే అవకాశముందని అంచనా వేశారు. కాబట్టి స్థిరాస్తి కొనుగోళ్లకు ఇదే సరైన సమయమని సూచించారు. దేశంలో పాత నోట్ల మార్పిడితో కోట్లాది సొమ్ము ప్రభుత్వానికి చేరుతోంది. దీంతో మౌలిక వసతులు, సదుపాయాలపై ఖర్చు చేసే అవకాశముందని సెక్రటరీ సీహెచ్ రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. వచ్చే దశాబ్ధ కాలంలో 50 శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లోకి వలస వస్తారు. స్టార్టప్స్, సెల్ఫ్ ఎంప్లారుుమెంట్ పెరిగి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతారుు. దీంతో స్థిరాస్తి రంగానికి డిమాండ్ వస్తుందని అంచనా వేశారు. ఇంటి అందం రెట్టింపు ఫ్లోరింగ్: మార్బుల్ ఫ్లోరింగ్ ఇంటికి అదనపు అందం, ఆకర్షణే. అరుుతే ఇదంతా తరుచూ నిర్వహణ ఉన్నప్పుడే సుమా. ఇంట్లోకి దుమ్ము, ధూళి రాకుండా నివారించుకోవాలి. దీని కోసం డోర్మ్యాట్ల వాడకంతో సరిపెట్టకుండా ఇంటికి వచ్చే అతిథులు షూ, చెప్పులను బయటే విప్పి ఇంట్లోకి వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ఫ్లోరింగ్ శుభ్రత కోసం రసాయనాల జోలికి వెళ్లకుండా నీటిలో కొంచెం అమ్మోనియా కలిపితే శుభ్రం చేశాక చూడండి మీ ఫ్లోరింగ్ తళతళ మెరిసిపోతుంది. కార్పెట్లు: కార్పెట్లు దుమ్మును ఎక్కువగా ఆకర్షిస్తారుు. వీటిని తరుచుగా వాక్యుమ్ క్లీనర్‌తో శుభ్రం చేయక తప్పదు. దుమ్ము పట్టడం వల్ల కార్పెట్లు కళావిహీనంగా కనిపిస్తారుు. కాబట్టి నాలుగున్నర లీటర్ల నీటిలో ఓ కప్పు తెల్ల వెనిగర్‌ను కలిపి బ్రష్‌తో రుద్దితే కార్పెట్‌లోని వర్ణాలు మెరుస్తారుు. కార్పెట్లపై టీ, సిరా వంటి మరకలు పడితే వాటిని పోగొట్టడానికి పావుకప్పు తినే సోడా, రెండు చెంచాల తెల్ల వెనిగర్‌తో చేసిన పేస్టు రుద్దాలి. ఆ పేస్టును ఆరనిచ్చి, వాక్యుమ్ క్లీనర్‌తో మరకలు ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేశాక చూడండి కార్పెట్లు మెరిసిపోతారుు. గోడలు: గోడలను తరుచూ స్టాటిక్ డస్టర్‌తో తుడవాలి. దీంతో ఎక్కడైనా బూజు, సాలెగూడు వంటివి ఉంటే తొలిగిపోతారుు. గోడలపై పానియాలు, టీ వంటివి పడితే వెంటనే నీళ్లు, గాఢత తక్కువగా ఉండే డిటెర్జంట్లతో శుభ్రం చేయాలి. అరుుతే ఈ సమయంలో గోడల్ని గట్టిగా రుద్దడం చేయకూడదు. మైక్రోఓవెన్: మైక్రోఓవెన్‌ను అధికంగా వాడటం వల్ల ఎక్కువగా మురికిపడుతుంది. దీన్ని శుభ్రం చేయడానికి ఉత్తమ మార్గం.. సగం కప్పు నీళ్లు, సగం కప్పు తెల్ల వెనీర్‌ను మైక్రోప్రూఫ్ గిన్నెలో పోసి, మైక్రోఓవెన్లో వేడి చేయాలి. దీంతో గట్టిగా ఉండే ఆహారపదార్థాలు, గ్రీజు మరకలు శుభ్రం చేయడానికి అనువుగా తేలికపడతారుు. వంటింట్లో..: బాత్ ఫిట్టింగ్‌ల దగ్గర నుంచి ఫర్నిచర్ వరకు ఉక్కు ఎక్కువగా వాడుతుంటాం. స్టీల్‌కే పరిమితం కాకుండా పైన క్రోమ్ పూతతో వస్తున్నారుుప్పుడు. స్నానాల గదిలో, వంటింట్లో వాడే నల్లాలు, నీటిలోని ఉప్పు పేరుకుపోవడం వల్ల చూడడానికి వికారంగా కన్పిస్తారుు. ఇలాంటి మరకల్ని తొలగించి స్టీల్ వస్తువులు మెరిసేలా కన్పించాలంటే ఆల్కహాల్‌తో తుడవాలి. నల్లాపైన ఏర్పడే నీటి మర కల్ని టూత్‌పేస్టుతో రుద్దడం ద్వారా తొలగించవచ్చు. వంటింట్లోని సింక్ పరిశుభ్రంగా కన్పించాలంటే నాలుగు పాళ్ల ఉప్పుకు ఒక పాలు వెనిగర్ కలిపి ప్రయత్నించండి.