28న లెఫ్ట్పార్టీల నిరసన
నేడు హైదరాబాద్‌లో మోటర్ సైకిల్ ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 28న సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు ర్యాలీ చేపట్టాలని, అనంతరం అక్కడే బహిరంగ సభను నిర్వహించాలని వివిధ వామపక్ష పార్టీలు నిర్ణరుుంచారుు. మరో పక్క ఈ పార్టీలు శనివారం సాయంత్రం ఆర్‌టీసీ క్రాస్‌రోడ్‌స నుంచి కోఠి వరకు మోటర్ సైకిల్ ర్యాలీని నిర్వహించనున్నారుు. రద్దుచేసిన పెద్ద నోట్లను డిసెంబర్ 31 వరకు మార్చుకునేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారుు. ఈ నిర్ణయంతో పేదలకు అన్యాయం చేసి సంపన్నులు, కార్పొరేట్లకు ప్రధాని మోదీ మేలు చేశారని ఆరోపించారుు.
పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుండగా, గ్రామీణుల ఆర్థిక వ్యవస్థ కుదేలై పోరుుందని ధ్వజమెత్తారుు. శుక్రవారం సాయంత్రం మగ్దూం భవన్‌లో జరిగిన వామపక్షాల సమావేశంలో చాడ వెంకటరెడ్డి (సీపీఐ), జి.నాగయ్య, డీజీ నరసింహారావు (సీపీఎం), డి.వి.కృష్ణ, ఝాన్సీ (న్యూడెమోక్రసీ), తాండ్రకుమార్ (ఎంపీసీఐ-యూ), జానకి రాములు (ఆర్‌ఎస్‌పీ), మురహరి (ఎస్‌యూసీఐ-సీ), గుర్రం విజయ్‌కుమార్ (సీపీఐ-ఎంఎల్ కమిటీ), రాజేశ్ (లిబరేషన్) పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నాయకులు చర్చించారు.
ఆర్థిక సమస్యల్లో 90% ప్రజలు: చాడ
ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో 90 శాతం ప్రజలు తీవ్రమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. పాల ప్యాకెట్ మొదలుకుని చిల్లర వస్తువుల కొనుగోలు వరకు పేదలు పడుతున్న బాధలు వర్ణనాతీతమన్నారు. ఇప్పటివరకు నోట్ల చెలామణిని బట్టి 80 శాతం రూ.500 నోటును వినియోగిస్తున్నారని, భూములు అమ్మినవారు, పెళ్లిళ్ల కోసం డబ్బు పెట్టుకున్నవారు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలంతా క్యూలో నిలబడి డబ్బులు తీసుకుంటుంటే అంబానీ, అదానీ క్యూలో నిలబడ్డారా అని సీపీఎం నేత జి.నాగయ్య ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు ఒక పెద్ద కుంభకోణమని న్యూడెమోక్రసీ నేత డి.వి.కృష్ణ అన్నారు.