సరిగ్గా ఏడాది కిందట ఉరుములేని పిడుగులా పెద్ద నోట్ల రద్దు దేశంమీద పడింది. ఏడాది తరువాత కూడా ప్రజలను పెద్ద నోట్ల రద్దు ప్రభావం వదిలిపెట్టడం లేదు. డిమానిటైజేషన్ ప్రభావం పడని రంగం లేదు.. అందులో ఉద్యోగాలు కూడా భాగమయ్యాయి.
సాక్షి, న్యూఢిల్లీ : పెద్దనోట్ల రద్దు జరిగి నేటికి 12 నెలల పూర్తయ్యాయి. ఏడాది గడిచిన తరువాత కూడా ప్రభుత్వం ముందు వసూలు కానీ రుణాలు, నిరుద్యోగం ప్రభుత్వాన్ని సవాళ్లు విసురుతున్నాయి. దేశంలో పెరుగుతున్న శ్రామిక శక్తికి విలోమానుపాతంగా ఉపాధి మార్గాలు తగ్గుముఖం పడుతున్నాయని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
- సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) అంచనాల ప్రకారం 2017 జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో ఉద్యోగ, ఉపాధి మార్గాలు మందగించాయి.
- లేబర్ బ్యూరో ఆఫ్ ఎంప్లాయిమెంట్ సర్వే ప్రకారం పెద్ద నోట్ల రద్దు ప్రబావం రోజువారీ కూలీలు, ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపింది. సంస్థల్లో ఉద్యోగస్తుల తగ్గింపు క్రమంగా కొనసాగుతూనే ఉంది.
- 2017 జనవరి-ఏప్రిల్ మధ్య కాలంలో సీఎంఐఈ వర్గాలు దేశవ్యాప్తంగా 5,19,285 మందిపై సర్వే నిర్వహించింది. ఈ సమయంలో మూడింటరెండొంతుల మంది నిరుద్యోగులుగా మరిపోయారు. ఈ సర్వే ప్రకారం జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో మొత్తంగా 1.5 మిలియన్ ఉద్యోగాలు ఊడిపోయాయి.
- ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) స్కీమ్ కింద 2017 జులై మొదటి వారంలో 30. 67 లక్షల మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇందులో కేవలం 2.9 లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి.
- ఇతర సర్వేల ప్రకారం పెద్ద నోట్లరద్దు తరువాత సుమారు 107 సంస్థలు 14,668 మంది ఉద్యోగులను తొలగించాయి. దేశంలో భారీ సంస్థలుగా నిలిచిన ఎల్ అండ్ టీ (1888), హిందుస్తాన్ యూనిలీవర్ (1453), ఐడియా సెల్యులార్ (707), ఏసీసీ (535), టాటా మోటార్స్ (534), టాటా స్టీల్ (450), హిందాల్కో (439), టైటాన్ ఇండస్ట్రీస్ (422) మంది ఉద్యోగాలను తొలగించాయి.
- ఆలోమొబైల్, ఫార్మాస్యుటికల్స్ రంగాల్లోనూ భారీగా ఉద్యోగాల కోత పడింది.
- లేబర్ బ్యూరో క్వార్టర్లీ ఎంప్లాయిమెంట్ సర్వే అంచనా ప్రకారం 2016 అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో 1.52 లక్షల క్యాజువల్ ఉద్యోగాలు, 46 వేల పార్ట్‌టైమ్ ఉద్యోగాల్లో కోత పడింది.
Comments
Please login to add a commentAdd a comment