సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది మేలో నిరుద్యోగ రేటు అత్యధికంగా 23.5 వద్ద నిలిచినా 2.1 కోట్ల మందికి కొత్తగా ఉద్యోగాల్లో చేరారని భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షక కేంద్రం (సీఎంఐఈ) వెల్లడించింది. 2.1 కోట్ల మందికి ఉద్యోగాలు సమకూరడంతో పాటు కార్మిక భాగస్వామ్య రేటు గణనీయంగా మెరుగుపడిందని తెలిపింది. కరోనా కట్టడికి దేశవ్యాప్త లాక్‌డౌన్ 5.0లోకి ప్రవేశించిన క్రమంలో సీఎంఐఈ గణాంకాలు వెల్లడయ్యాయి. లాక్‌డౌన్ సడలింపులతో చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలు తిరిగి తెరుచుకోవడంతో మే నెలలో 1.44 కోట్ల మందికి వీటిలో ఉపాథి లభించిందని సీఎంఐఈ తెలిపింది.
ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో ఉపాథి 7.5 శాతం పెరిగిందని సీఎంఐఈ చీఫ్ మహేష్ వ్యాస్ వెల్లడించారు. మేలో నిరుగ్యోగ రేటు స్ధిరంగా 23.5 శాతమే ఉన్నా కార్మిక భాగస్వామ్య రేటు 35.6 శాతం నుంచి 38.2 శాతానికి, ఉపాధి రేటు 27.2 శాతం నుంచి 29.2 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. ఇక లాక్‌డౌన్ సమయంలో నాణ్యమైన ఉద్యోగాలు కోల్పోవడం ఆందోళనకరమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment