ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగం గడిచిన ఆరునెలల్లో గరిష్టస్థాయికి చేరింది. గతేడాది డిసెంబర్‌లో నిరుద్యోగిత 9.06 శాతానికి చేరుకుంది. జూన్‌లో (10.99 శాతం) లాక్‌డౌన్ సడలింపుల తర్వాత ఇదే అత్యధికమని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా నివేదిక వెల్లడించింది. నవంబర్‌లో 2.74 కోట్ల మంది నిరుద్యోగులుండగా... డిసెంబరులో ఇది అనూహ్యంగా 3.87 కోట్లకు పెరిగిం ది. ఫలితంగా ఒక్కనెలలోనే నిరుద్యోగిత 2.55% పెరి గిపోయింది. నవంబరుతో పోలిస్తే... డిసెంబర్‌లో 60 లక్షల మంది ఉద్యోగార్థులు పెరిగారని, ఇంతటి భారీ సంఖ్యలో కొత్త ఉపాధి అవకాశాలు లేక... నిరుద్యోగిత పెరిగిందని సీఎంఐఈ విశ్లేషించింది. ఫలితంగా నవం బర్‌లో 6.51 శాతమున్న నిరుద్యోగం డిసెంబర్ ముగి సేసరికి 9.06 శాతానికి ఎగబాకింది.
ముఖ్యంగా పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ శాతం పెరిగింది. గత రెండు, మూడు నెలలుగా దేశం లోని దాదాపు అన్ని రాష్ట్రాలు, ఆర్థిక, వాణిజ్య, ఇతర త్రా రంగాలకు సంబంధించిన కార్యకలాపాలు పుంజుకుంటున్నా... నిరుద్యోగ శాతం మాత్రం క్రమంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీనిని బట్టి వివిధ ప్రాధాన్యతారంగాల్లో కార్యకలాపాలు పెరిగినా లేబర్ మార్కెట్ పూర్తిస్థాయిలో కుదుటపడలేదని స్పష్టమౌతోంది. కొద్దినెలలుగా ద్రవ్యోల్బణం 7 శాతం దరిదాపుల్లో ఉండటం, దానికి తోడు నిరుద్యోగం పెరగడం ఆందోళనకరమని సీఎంఐఈ ఎండీ మహేశ్ వ్యాస్ అభిప్రాయపడ్డారు. ఈ పరిణామం దేశ ఆర్థిక వ్యవస్థపై భయాలను మరింత పెంచుతోందన్నారు. ( మధ్యప్రదేశ్, ఏపీలకు కేంద్రం రివార్డు)
పెరిగిన గ్రామీణ నిరుద్యోగం...
దేశవ్యాప్తంగా నిరుద్యోగ శాతం డిసెంబర్‌లో గ్రామీణ ప్రాంతాల్లో 9.15%, పట్టణప్రాంతాల్లో 8.84%గా న మోదైంది. సీఎంఐఈ తాజా నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం 6.51% నుంచి 9.15%కి పెరి గింది. అయితే గత కొన్ని నెలలుగా జాతీయ, గ్రామీణ నిరుద్యోగ సగటు కంటే ఎంతో ఎక్కువ శాతంలో కొన సాగిన పట్టణ నిరుద్యోగిత డిసెంబర్‌లో 8.84 శాతంగా నిలవడం గమనార్హం. ఇతర ›ప్రాంతాలలో పోల్చితే పట్టణ ప్రాంతాల్లో పరిస్థితులు మరింత మెరుగుపడు తున్నట్టు నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా పుంజుకోని లేబర్ మార్కెట్
ఈ తాజా గణాంకాల ప్రకారం దేశంలోని ఆర్థిక వ్యవస్థ ఇంకా మందకొడిగా సాగుతోందని, లేబర్ మార్కెట్‌ను పూర్తిస్థాయిలో తనలో ఇముడ్చుకునే ప్రయత్నాల్లోనే ఇంకా ఉన్నట్టుగా స్పష్టమౌతోందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి గ్రామీణ ఉపాధి హామీ, మౌలిక వసతుల కల్పన సంబంధిత రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు రాబోయే బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం మరిన్ని కేటాయింపులు పెంచాల్సి ఉందని సూచిస్తున్నారు. ఆర్థికరంగం పూర్తిగా పుంజుకోని నేపథ్యంలో మరిన్ని అవకాశాల కల్పనతో పాటు ఉపాధికి దూరమౌతున్న మహిళా వర్కర్లను తిరిగి పనుల్లో నిమగ్నం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కర్ణాటకలోని అజీమ్ ప్రేమ్‌జీ వర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అమిత్ బాసోల్ సూచిస్తున్నారు. ‘జాతీయ ఉపాధి హామీకి కేటాయింపుల పెంపుదల గ్రామీణ భారతానికి మేలుచేస్తుంది. అంతేకాకుండా మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజేస్‌ను (ఎంఎస్‌ఎంఈ) మరింత బలోపేతం చేసి... మళ్లీ ఈ రంగాన్ని పట్టాలు ఎక్కిస్తే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగుపడతాయి’అని అమిత్ పేర్కొన్నారు.
సీఎంఐఈ డిసెంబర్ గణాంకాలు
అత్యధిక నిరుద్యోగమున్న రాష్ట్రాలు (శాతాల్లో)
హరియాణా 32.5
రాజస్తాన్ 28.2
త్రిపుర 18.2
జమ్మూ,కశ్మీర్ 16.6
యూపీ 14.9
అత్యల్ప నిరుద్యోగమున్న రాష్ట్రాలు
తమిళనాడు 0.5
కర్ణాటక 1.4
మహారాష్ట్ర 3.9
ఏపీ 6.7
తెలంగాణ 7
Comments
Please login to add a commentAdd a comment