సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం విధించిన లాక్‌డౌన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మద్యం వినియోగం విపరీతం అయింది. ఎంతంటే, ఒక్క ఆస్ట్రేలియాలోనే ఎప్పటికన్నా 2020 సంవత్సరంలో మద్యం విక్రయాలు రెండు బిలియన్ పౌండ్లు (దాదాపు 20 వేల కోట్ల రూపాయలు) పెరిగాయట. మద్యపానం వల్ల మంచికన్నా చెడే ఎక్కువన్న విషయం తెలిసిందే.
మద్యం మానేస్తే 31 రోజుల్లో మనువుల ఆరోగ్యం ఎంతో మెరగుపడుతుందని పోషక నిపుణులు తెలియజేస్తున్నారు. అందుకనే ఆస్ట్రేలియా వాసులు ప్రతి ఏడాది ‘డ్రై జనవరి’ పేరిట మద్యం తీసుకోకుండా ఉపవాసం పాటిస్తున్నారు. ఆఖరి పెగ్గు తీసుకున్న గంట నుంచి ఆరోగ్యకరమైన మార్పులు కనిపిస్తాయని, కొన్ని రోజులు, వారాలు దూరంగా ఉన్నట్లయితే ఆరోగ్యం మరింత మెరగుపడుతుందని డైటీషియన్లు, ఫిట్‌నెస్ కోచ్‌లు తెలియజేస్తున్నారు.
మద్యానికి దూరంగా ఉన్నట్లయితే కాలేయం బాగా పని చేస్తుందని, శరీర బరువు తగ్గుతుందని, మంచి నిద్ర వస్తుందని, జ్ఞాపక శక్తి పెరగుతుందని వారంతా చెబుతున్నారు. మద్యం మానేస్తే శక్తి, సామర్థ్యాలు పెరగడమే కాకుండా ఆర్థికంగా డబ్బు ఎంతో కలసి వస్తోందని ‘డ్రై జనవరి’ పాటిస్తున్న ఆస్ట్రేలియా వాసులు సూచిస్తున్నారు. ప్రతి ‘డ్రై జనవరి’లో 70 శాతం మంది ఆస్ట్రేలియా వాసులు మద్యానికి దూరంగా ఉంటుండగా, ఈ సారి లాక్‌డౌన్ కారణంగా ఆ సంఖ్య యాభై శాతానికి దిగువకు పడిపోయింది. అందుకే మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి.
మద్యం వల్ల రక్తపోటు పెరిగి గుండె పోటు వచ్చే అవకాశాలు పెరగడంతోపాటు, పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పడిపోతుందని, లైంగిక సుఖాన్ని కలగజేసే ‘టెస్టోస్టెరోన్’ ఎంజైమ్ తగ్గిపోతుందని, మహిళలో పీరియడ్స్ పడిపోతాయని, కడుపుల్లో అల్సర్లు ఏర్పడే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియా వైద్యులు తెలియజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment