Recovery Agent
-
RBI: ఇకపై లోన్ రికవరీ ఏజెంట్ల సమయం ఇదే..
బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ కంపెనీలు అవసరాలకు అనుగునంగా నిబంధనల ప్రకారం లోన్లు ఇస్తూంటాయి. వాటిని వసూలు చేయడానికి రికవరీ ఏజెంట్లు ఉంటారు. అయితే రికవరీ ఏజెంట్లకు సంబంధించి ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. రికవరీ ఏజెంట్లు రుణాల రికవరీ కోసం ఉదయం 8 గంటలలోపు, సాయంత్రం 7 గంటల తర్వాత రుణగ్రహీతలు ఫోన్ చేయకూడదనే నిబంధనలను ఆర్బీఐ ప్రతిపాదించింది. డైరెక్ట్ సేల్స్ ఏజెంట్లు (డీఎస్ఏ), డైరెక్ట్ మార్కెటింగ్ ఏజెంట్లు (డీఎంఏ), రికవరీ ఏజెంట్ల కోసం నియంత్రిత సంస్థలు ఈ నియామవళిని పాటించే విధంగా చూడాలని ఆర్బీఐ భావిస్తుంది. ఆర్బీఐ ప్రతిపాదించబోతున్న నిబంధనల ప్రకారం..రికవరీ ఏజెంట్లు కస్టమర్లను అభ్యర్థించడం, కాల్ చేసే గంటలు, కస్టమర్ సమాచారం గోప్యత, సంస్థలు ఇస్తున్న ఆఫర్లోని ఉత్పత్తుల నిబంధనలు, షరతులను స్పష్టంగా తెలియజేయాలి. బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, పేమెంట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియన్ సెంటర్లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, పట్టణ, రాష్ట్ర, కేంద్ర సహకార బ్యాంకులకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. రికవరీ ఏజెంట్లు తమ రుణ సేకరణ ప్రయత్నాల్లో భాగంగా ఏ వ్యక్తిపై మానసికంగా, శారీరకంగా ఎలాంటి బెదిరింపులకు పాల్పడకూడదని ఆర్బీఐ డ్రాఫ్ట్ నిబంధనల్లో పేర్కొంది. రుణగ్రహీత కుటుంబ సభ్యులు, రిఫరీలు, స్నేహితులను అవమానించడం లేదా వారి ఇంట్లోకి చొరబడడం, మొబైల్ లేదా సోషల్ మీడియా ద్వారా అనుచిత సందేశాలు పంపడం, అనామక కాల్లు చేయడాన్ని నిషేధించేలా చర్యలు తీసుకుంటున్నారు. -
’థర్డ్ పార్టీ’ జప్తులు నిలిపివేశాం
న్యూఢిల్లీ: వాహన రుణాల రికవరీలకు సంబంధించి థర్డ్–పార్టీ ఏజంట్ల ద్వారా జప్తులు చేయడాన్ని నిలిపివేసినట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఎంఎంఎఫ్‌ఎస్‌ఎల్) వెల్లడించింది. ఇటీవలి విషాద ఘటన నేపథ్యంలో థర్డ్ పార్టీ ఏజంట్లను ఎలా వినియోగించుకోవచ్చనే అంశాన్ని అధ్యయనం చేయనున్నట్లు సంస్థ వైస్ చైర్మన్ రమేష్ అయ్యర్ ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాక్టర్ రుణ రికవరీ కోసం వచ్చిన ఎంఎంఎఫ్‌ఎస్‌ఎల్ థర్డ్ పార్టీ ఏజంటు .. ఆ వాహనాన్ని మీద నుంచి పోనివ్వడంతో గత వారం 27 ఏళ్ల గర్భిణీ మృతి చెందిన ఘటన గత వారం జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో చోటు చేసుకుంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రుణాల రికవరీల కోసం ఎంఎంఎఫ్‌ఎస్‌ఎల్.. థర్డ్ పార్టీ ఏజంట్లను ఉపయోగించకుండా నిషేధం విధించింది. రికవరీ, జప్తుల కోసం సొంత ఉద్యోగులను మాత్రమే ఉపయోగించుకోవాలని ఆదేశించింది. చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా! -
అమానుషం..ఫైనాన్స్ కంపెనీ దాష్టికం..గర్భిణిని ట్రాక్టర్‌తో తొక్కించి...
లోన్ రికవరి కోసం ప్రజలను నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేసే ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు గురించి నిత్యం వింటూనే ఉన్నాం. అచ్చం అలానే ఒక ఫైనాన్స్ కంపెనీ లోన్ రికవరీ కోసం ఒక మహిళ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించింది. వివరాల్లోకెళ్తే...మహిద్ర ఫైనాన్స్ కంపెనీ అధికారులు లోన్ రికవరి కోసం దివ్యాంగుడైన ఒక రైతు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఇంట్లో రైతు, అతని కుమార్తె మాత్రమే ఉన్నారు. ఫైనాన్స్ అధికారులకు రైతుకి మధ్య ఫైనాన్స్ విషయమే చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. అంతే సదరు ఫైనాన్స్ అధికారులు ఏకంగా కోపంతో ట్రాక్టర్‌తో సదరు రైతు కూతురుని తొక్కించి.. హత్య చేశారు. బాధితురాలు మూడు నెలల గర్భిణి. ఈ ఘటన జార్ఖండ్‌లో హజారీబాగ్‌లో చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్, మేనేజర్‌తో సహా నలుగురిపై హత్య కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ అధికారులు తమకు సమాచారం ఇవ్వకుండా ఇంటికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ట్రాక్టర్ ఫైనాన్స్ రికవరీ కోసం బాధితుడి నివాసానికి వెళ్లే ముందు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఈ మేరకు మహీంద్రా గ్రూప్ మేజేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనీష్ షా మాట్లాడుతూ...కంపెనీ అన్ని కోణాల్లో ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోంది. ఏజెన్సీలు లోన్‌రికవరీ విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారో తెలుసుకుంటాం. కేసు దర్యాప్తు విషయమై పోలీసులకు అన్ని రకాలుగా సహకరిస్తాం అని హామీ ఇచ్చారు. (చదవండి: ప్రేమకు నిరాకరించిందన్న కక్ష్యతో నవ వధువు దారుణ హత్య) -
వేధించకండి! రుణ రికవరీ ఏజెంట్లపై ఆర్బీఐ ఉక్కుపాదం!
ముంబై: రుణ వసూళ్ల ఏజెంట్లు అనైతిక విధానాలకు పాల్పడకుండా ఆర్బీఐ కఠిన ఆదేశాలు జారీ చేసింది. రుణాలు చెల్లించాలంటూ రుణ గ్రహీతలను బెదిరించడాన్ని నిషేధించింది. అలాగే, రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య రుణం కోసం కాల్ చేయడం కూడా కుదరని స్పష్టం చేసింది. తన నియంత్రణలోని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు (ఆర్ఈలు), ఏఆర్సీలకు సంబంధించి అదనపు మార్గదర్శకాలను ఆర్బీఐ శుక్రవారం విడుదల చేసింది. (Maruti Suzuki Swift S-CNG వచ్చేసింది, ఫీచర్లు చూసి వావ్ అనాల్సిందే!) రుణాలను వసూలు చేసే ఏజెంట్లు భౌతికంగా లేదా మాటల రూపంలో వేధింపులకు పాల్పడకుండా ఆర్ఈలు చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ కోరింది. ఏ రూపంలోనూ అనుచిత సందేశాలు పంపకూడదని, గుర్తు తెలియని కాల్స్ రూపంలో వేధించకూడదని స్పష్టం చేసింది. రికవరీ ఏజెంట్లు ఇటీవలి కాలంలో ఆమోదనీయం కాని చర్యలకు పాల్పడుతున్నట్టు తెలియడంతో ఆర్బీఐ ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. చదవండి: వీఎల్సీ మీడియా ప్లేయర్‌పై నిషేధం, వెబ్సైట్, డౌన్లోడ్ లింక్ బ్లాక్ -
నందిగామ హరిత వర్షిణి కేసులో కీలక విషయాలు వెల్లడించిన డీసీపీ
-
నందిగామ హరిత వర్షిణి ఆత్మహత్య కేసులో ఏడుగురు అరెస్ట్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: నందిగామ హరిత వర్షిణి ఆత్మహత్య కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు మేనేజర్లు, నలుగురు రికవరీ ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలను డీసీపీ మేరీ ప్రశాంతి మీడియాకు వివరించారు. విజయవాడ కేంద్రంగా కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసి కస్టమర్లపై వేధింపులకు దిగుతున్నారన్నారు. చదవండి: ‘చీకోటి’ ల్యాప్‌టాప్‌లో ఏముంది?.. ఈడీ ముందుకు ప్రవీణ్ హరిత కుటుంబ సభ్యులను అవమానించామని నిందితులు ఒప్పుకున్నారు. బేగంపేట్ కేంద్రంగా ఎస్ఎల్వీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యకలాపాలు సాగిస్తోందన్నారు. ఆర్బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం ఎవరైనా కస్టమర్లను వేధిస్తే చర్యలు తప్పవని డీసీపీ మేరీ ప్రశాంతి హెచ్చరించారు. విద్యార్థి హరితను దూషించి మాట్లాడటం వలనే ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. -
పెచ్చుమీరుతున్న రికవరీ ఏజెంట్ల వేధింపులు
నెల్లూరు (క్రైమ్) : లోన్ యాప్స్‌కు చెందిన రికవరీ ఏజెంట్ల వేధింపులు మితిమీరుతున్నాయి. ఇప్పటివరకు సామాన్య ప్రజలే లక్ష్యంగా సాగుతున్న ఈ వ్యవహారం చివరకు ప్రజాప్రతినిధులను వదలడంలేదు. ‘‘మీ బంధువులు/స్నేహితులు రుణం తీసుకున్నారు.. దానికి మీరే చెల్లింపులు చేయాలి’’ అంటూ ఫోన్లు చేస్తున్నారు. వారెవరో తమకు తెలియదని చెబుతున్నప్పటికీ మాటలతో ఎదురుదాడికి దిగుతున్నారు. సరిగ్గా ఈలాంటి అనుభవమే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్రస్తుత మంత్రి, మాజీమంత్రికి ఎదురైంది. ఈ రెండు ఘటనలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖులకు సైతం రికవరీ ఏజెంట్లు ఫోనుచేసి బెదిరిస్తున్న వైనంపై జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమై క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నారు. వివరాలివీ.. పదేపదే ఫోన్లుచేసి.. చెన్నైలోని కోల్మాన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ వివిధ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థలకు లోన్ రికవరీ ఏజెన్సీగా పనిచేస్తోంది. నెల్లూరు రామలింగాపురంలోని ఓ ఫైనాన్స్ సంస్థ పాతపాటి అశోక్‌కుమార్‌కు రూ 8.5 లక్షలు రుణమిచ్చింది. అతను తిరిగి చెల్లించకపోవడంతో రికవరీ ఏజెన్సీకి సదరు సంస్థ అతని ఫోను నంబర్‌ను ఇచ్చింది. ఏజెన్సీ మేనేజర్లు గురుప్రసాద్‌రెడ్డి, మహేంద్రన్, పెంచలరావు, టీం లీడర్ మాధురివాసులు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ప్రముఖుల ఫోన్ నెంబర్లను సేకరించారు. ఈనెల 25న మంత్రి కాకాణి గోవర్థనరెడ్డికి ఫోనుచేశారు. ఆయన ఫోను తన పీఏ శంకరయ్య వద్ద ఉండడంతో బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు. టీం లీడర్ మాధురివాసు ప్రియాంకగా పేరుమార్చి అసభ్యకరంగా మాట్లాడి అతని నుంచి రూ.25వేల నగదు తీసుకుంది. దీంతో పీఏ ముత్తుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదుచేసి నలుగురు నిందితులను అరెస్టుచేశారు. మాజీమంత్రికి సైతం.. మరోవైపు.. మాజీమంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌కు సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. పాతపాటి అశోక్‌కుమార్ రుణం తీసుకున్నాడని.. ఆ రుణం చెల్లించాలంటూ అనిల్‌కుమార్‌పై ఒత్తిడి తెచ్చారు. దీనికి సంబంధించిన కాల్ రికార్డు ఆడియో సోషల్ మీడియాలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు క్షేత్రస్థాయిలో విచారిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు మాట్లాడుతూ.. జిల్లాలో మంత్రి, మాజీమంత్రికి ఫోన్లుచేసి బెదిరించిన ఘటనలో నలుగురు నిందితులను అరెస్టుచేసి వారి నుంచి ల్యాప్‌టాప్, సెల్ఫోన్లను సీజ్ చేశామన్నారు. ఎవరైతే రుణం తీసుకున్నారో వారికి ఫోన్లు చేయకుండా ఇతరులకు ఫోనుచేసి బెదిరించడం చట్టరీత్యా నేరమన్నారు. ఆన్లైన్ లోన్ యాప్స్‌లో రుణాలు తీసుకోవద్దని ఆయన హితవు పలికారు. ఎవరికైనా ఈ తరహా ఫోన్లు వస్తే వెంటనే స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం అందించే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ చెప్పారు. ఇదీ చదవండి: AP: రెచ్చిపోతున్న రికవరీ ఏజెంట్లు.. మంత్రి కాకాణి పీఏ శంకర్‌కు వార్నింగ్ -
మంత్రి కాకాణి పీఏకు బెదిరింపులు.. పిల్లల్ని చంపేస్తామంటూ వార్నింగ్
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో రికవరీ ఏజెంట్లు రెచ్చిపోతున్నారు. రికవరీ విషయంలో ఏకంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాణి.. పీఏ శంకర్‌ను ఏజెంట్లు బెదిరింపులకు గురిచేశారు. లోన్ కట్టకపోతే పిల్లలను చంపేస్తామంటూ వార్నింగ్ ఇవ్వడం కలకలం సృష్టించింది. ఈ క్రమంలో రికవరీ ఏజెంట్ల ఆగడాలను తట్టుకోలేక శంకర్.. ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్లు, మేనేజర్‌ను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితమే ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రికవరీ ఏజెంట్ల వేధింపులు భరించలేక జాస్తి హరిత వర్షిణి (17) తీవ్ర మనస్తాపానికి గురైంది. అనంతరం, సూసైడ్ లెటర్ రాసి వంట గదిలో ఉరి వేసుకుని మృతిచెందింది. బ్యాంకు క్రెడిట్ కార్డుపై తీసుకున్న రుణం చెల్లించాలంటూ రికవరీ ఏజెంట్ల ఆగడాలు మితిమీరడంతో ఈ దారుణం జరిగింది. వర్షిణి.. తండ్రి తీసుకున్న అప్పు కట్టాలనుకోవడమే కాక నోటికొచ్చినట్లు తిట్టడంతో ఆమె తట్టుకోలేకపోయింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగా ఉండడంతో ఆ విద్యార్థిని తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడింది. ఇది కూడా చదవండి: పోలవరంపై చంద్రబాబు కొంగజపం -
రికవరీ ఏజెంట్ల దూషణలతో.. ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం
నందిగామ: బ్యాంకు క్రెడిట్ కార్డుపై తీసుకున్న రుణం చెల్లించాలంటూ రికవరీ ఏజెంట్ల ఆగడాలు ఓ చదువుల తల్లిని బలితీసుకున్నాయి. తండ్రి తీసుకున్న అప్పు కట్టేయాలనడమే కాక నోటికొచ్చినట్లు నానా మాటలు ఆనడంతో ఆమె తట్టుకోలేకపోయింది. మరోవైపు.. కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగా ఉండడంతో ఆ విద్యార్థిని తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో గురువారం చోటుచేసుకుంది. మృతురాలి తల్లి అరుణ తెలిపిన సమాచారం ప్రకారం.. పట్టణంలోని పాత కరెంట్ ఆఫీస్ రోడ్డులో ఉంటున్న జాస్తి ప్రభాకరరావు ఢిల్లీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆయన కొద్దినెలల క్రితం ఓ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా రూ 3.50 లక్షల అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తం సకాలంలో చెల్లించకపోవడంతో వడ్డీ పెరిగిపోయింది. దీంతో ఈ నెల 26న సంబంధిత బ్యాంకు సిబ్బంది ఇంటికొచ్చి తీసుకున్న రుణం వెంటనే చెల్లించాలంటూ అసభ్య పదజాలంతో దూషించారు. ఆ మాటలు విన్న ప్రభాకరరావు పెద్ద కుమార్తె జాస్తి హరిత వర్షిణి (17) తీవ్ర మనస్తాపానికి గురైంది. అప్పటినుంచి అదే ఆలోచనతో ఉన్న ఆమె గురువారం ఉదయం సూసైడ్ లెటర్ రాసి వంట గదిలో ఉరి వేసుకుని మృతిచెందింది. అమ్మా.. నన్ను క్షమించు నిజానికి.. హరిత వర్షిణి చిన్నతనం నుంచి చదువులో బాగా శ్రద్ధ చూపేది. పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేసుకుని ఏపీ ఈఏపీసెట్ (ఎంసెట్)లో 15 వేల ర్యాంకు సాధించింది. మరింత మంచి ర్యాంకు కోసం ఈనెల 30న జరగనున్న తెలంగాణ ఎంసెట్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో.. అప్పు చెల్లించాలంటూ బ్యాంకు సిబ్బంది ఇంటికొచ్చి నానా మాటలు అనడం.. అదే సమయంలో కుటుంబ ఆర్థిక పరిస్థితులు వర్ణిణిని తీవ్రంగా కుంగదీశాయి. కుటుంబానికి తాను భారం కాకూడదనుకుని సూసైడ్ నోట్ రాసి తనువు చాలించింది. అందులో.. ‘‘అమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బతకడం కూడా కష్టమవుతుంది. నా కాలేజి ఫీజు, చెల్లి స్కూల్ ఫీజుకు కూడా డబ్బుల్లేవు. మావల్ల నీ ఆరోగ్యం పాడుచేసుకోకు. చెల్లిని బాగా చదివించి మంచి ఉద్యోగం తెచ్చుకోమను. నేను నీకు భారం కాకూడదని ఇలాచేశా. నన్ను క్షమించు అమ్మ. నీకు నేనేమీ చేయలేకపోతున్నా. నా గురించి నువ్వు ఏడవకు. చెల్లి జాగ్రత్త. ఎవరన్నా అడిగితే ఎంసెట్ ర్యాంకు రాలేదని చనిపోయిందని చెప్పండి.. డాడీకి నిజం చెప్పొద్దు’’.. అంటూ రాసిన లేఖ చూపరులను కంటతడి పెట్టిస్తోంది. ఘటనపై అన్ని కోణాలలో దర్యాప్తు వర్షిణి మృతిపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్హెచ్ఓ కనకారావు తెలిపారు. -
నా చావుకి వారే కారణం.. విడిచిపెట్టకండి
సాక్షి,రాజేంద్రనగర్(హైదరాబాద్): బ్యాంకు క్రెడిట్ కార్డు, యాప్ లోన్స్ రికవరీ ఏజెంట్ల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ తెలిపిన మేరకు.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన దత్తాత్రేయ(32) కుటుంబం అత్తాపూర్ పాండురంగానగర్ ప్రాంతంలో నివసిస్తుంది. దత్తాత్రేయ నగరంలోని ఓ నగల దుకాణంలో సేల్స్‌మన్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి భార్య, ఇద్దరు సంతానం. ఇటీవల దత్తాత్రేయ సెల్ఫోన్లో ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటు పడ్డాడు. రెండు యాప్‌ల ద్వారా ఆన్లైన్ బెట్టింగ్‌లకు పాల్పడ్డాడు. ఇలా బానిసై జూన్ వరకు రూ. ఏడు లక్షల వరకు అప్పులు చేశాడు. ఆ తరువాత మూడు క్రెడిట్ కార్డులు, రెండు లోన్ యాప్స్ ద్వారా డబ్బు తీసుకొని బెట్టింగ్ ఆడాడు. రుణం చెల్లించకపోవడంతో బ్యాంకు ఏజెంట్లతో పాటు లోన్ యాప్ నిర్వాహకులు డబ్బు కట్టాలని ఫోన్ చేస్తున్నారు. వీరి వేధింపులు తాళలేక మానసిక వేదనకు గురయ్యాడు. సెల్‌ఫోన్‌ను ఆఫ్ చేయడంతో బంధువులతో పాటు కుటుంబ సభ్యులకు రికవరీ ఏజెంట్లు ఫోన్లు చేస్తుండడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. గురువారం సాయంత్రం భార్య పనికి వెళ్లగా ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన భార్య భర్త ఉరికి వేలాడుతూ కనిపించడంతో అత్తాపూర్ ఔట్ పోస్టు పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వచ్చి మృతదేహాన్ని మార్చరీకి తరలించారు. మృతుడు తన సూసైడ్ నోట్లో తన మృతికి ఆన్లైన్ బెట్టింగ్తో పాటు లోన్లు, క్రెడిట్ కార్డులు కారణమని తనను వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని రాశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: Hyderabad: అమాయక మహిళలను మోసం చేస్తూ వ్యభిచార నిర్వహణ -
రుణ వసూళ్లు పడిపోతున్నాయ్!
ముంబై: దేశంలో సెకండ్ వేవ్ నేపథ్యంలో రుణ వసూళ్లు గణనీయంగా పడిపోతున్నాయి. ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్‌టెక్) అసోసియేషన్ ఫర్ కన్జూమర్ ఎంపవర్మెంట్ (ఎఫ్‌ఏసీఈ) 100 కంపెనీలపై నిర్వహించిన సర్వే ఈ అంశాన్ని వెల్లడించింది. సర్వేలో వెల్లడైన అంశాలను పరిశీలిస్తే.. రుణ వసూళ్ల ఏజెంట్లు తమ విధుల నిర్వహణలో వైఫల్యం చెందుతున్నారు. రుణ గ్రహీతలు నిజంగానే తీవ్ర ఒత్తిడి, వైద్య అత్యవసర పరిస్థితుల్లో కూరుకునిపోవడమే దీనికి కారణం. 20 % వరకు రుణ వసూళ్ల విషయంలో బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ రుణదాతల పరిస్థితి మెరుగ్గాలేదు. మొత్తం మంజూరుచేసిన రుణాల్లో దాదాపు 10 నుంచి 20 శాతం వరకూ వసూళ్లు కష్టమవుతున్నాయి. రుణం పునఃచెల్లింపుల్లో గడువు ముగిసిపోయి ఒకటి నుంచి మూడు నెలలు అవుతున్నప్పటికీ ఆయా రుణాలు వసూలు కావడం లేదు. అయితే 2020తో పోల్చితే ప్రస్తుత పరిస్థితి కొంత మెరుగ్గా ఉండడం కొంత ఊరట. 2021 జూలై ముగిసే నాటికి పరిస్థితి కొంత మెరుగు పడుతుందన్న అంచనాలు ఉన్నాయి. 2020 నాటికి కఠిన లాక్డౌన్ పరిస్థితులు ఇప్పుడు లేకపోవడం, కేసులు తగ్గి క్రమంగా అన్ లాకింగ్ ప్రక్రియ ప్రారంభం కావడం దీనికి కారణం. చదవండి: పూచీకత్తు లేకుండానే రూ.5 లక్షల పర్సనల్ లోన్ -
హోండా యాక్టివా ఫైనాన్స్‌లో కొన్నారా..
మహబూబ్‌నగర్ క్రైం: హోండా కంపెనీ వాహనాలకు ఫైనాన్స్ ఇచ్చే కార్యాలయంలో రికవరీ ఏజెంట్‌గా పని చేసిన అనుభవం సంపాదించాడు. దీంతో కేవలం హోండా కంపెనీకి చెందిన యాక్టివా వాహనాలనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డాడు. రోడ్డు వెంట, ఫంక్షన్ హాళ్లమహబూబ్నగర్ పోలీసులకు చిక్కాడు. ఈ మేరకు వివరాలను ఎస్పీ బి.అనురాధ మంగళవారం విలేకరులకు వెల్లడించారు. రికవరీ ఏజెంట్‌గా అనుభవంతోనే చార్మినర్ ప్రాంతంలోని మీర్ అలంమండికి చెందిన షబ్బీర్ అలీ మణికొండ ప్రాంతంలో హోండా కంపెనీకి సంబంధించిన ద్విచక్ర వాహనాలకు రుణాలు ఇచ్చే కార్యాలయంలో రికవరీ ఏజెంట్‌గా పని చేశాడు. ఆ సమయంలో రుణం తిరిగి చెల్లించని వారి నుంచి హోండా యాక్టివాలను ఎలా తీసుకురావాలనే అనుభవం సాధించాడు. ఈ అనుభవంతో హైదరాబాద్‌కు చెందిన ఫైజల్‌తో పరిచయం పెంచుకుని ఉద్యోగం మానివేసిన ఆయన యాక్టివా వాహనాలనే చోరీ చేయడం మొదలుపెట్టాడు. ఇలా హైదరాబాద్‌లో 15, మహబూబ్‌నగర్‌లో రెండు వాహనాలను దొంగి లించి మహబూబ్‌నగర్‌లోని సద్దలగుండుకు చెందిన నదీంఇంట్లో ఉంచాడు. నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న మహబూబ్‌నగర్ ఎస్పీ అనురాధ వాహనాలు ఎక్కడివని నదీం ప్రశ్నిస్తే ఫైనాన్స్ డబ్బు చెల్లించకపోవడంతో లాక్కొచ్చామని నమ్మించారు. కేవలం మూడు నెలల కాలంలో ఈ వాహనాలు చోరీ చేశారు. అన్ని వాహనాలు కూడా కొత్తవి, ఇంకా రిజిస్ట్రేషన్ చేయించనవే కావడం గమనార్హం. ఈ వాహనాల విలువ రూ.10.20లక్షలు ఉంటుంది. వాహనాలను రూ.25వేల చొప్పున అమ్మేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఇంతలో సోమ వారం సాయంత్రం మహబూబ్‌నగర్ నుంచి హోండా యాక్టివాపై జడ్చర్ల వైపు షబ్బీర్ అలీ వెళ్తుండగా పోలీసులు తనిఖీ చేశారు. అయితే, ఆయన వద్ద పత్రాలు లేకపోవడంతో విచారించగా దొంగతనం బయటపడింది. కాగా, ఈ కేసులో రెండో నిందితుడు ఫైజల్ పరారీలో ఉన్నాడని ఎస్పీ అనురాధ వెల్లడించారు. -
రికవరీ ఏజెంటే సూత్రధారి
ఫైనాన్సర్ ఇంట్లో దోపిడీ యత్నం కేసు... నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు పంజగుట్ట: ఫైనాన్స్ వ్యాపారి ఇంట్లో దోపిడీ యత్నం కేసును పోలీసులు ఛేదించారు. అతని వద్ద పని చేస్తున్న రికవరీ ఏజెంటే ప్రధాన సూత్రధారి అని తేల్చారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. సోమవారం పంజగుట్ట ఏసీపీ కార్యాలయంలో పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వర రావు, అదనపు డీసీపీ నాగరాజు, ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి తెలిపిన వివరాల ప్రకారం... సోమాజిగూడలోని మార్వెల్ రెసిడెన్షీ ఫ్లాట్ నెం.302లో నివసించే సజ్జన్‌రాజ్ జైన్ పంజగుట్ట మహేశ్వరీ టవర్స్‌లో ననేష్ ఫైనాన్స్ పేరుతో వ్యాపారం చేస్తున్నాడు. ఇతని వద్ద రికవరీ ఏజెంట్‌గా బేగంపేట ప్రకాష్‌నగర్ నివాసి మహ్మద్ మాజీద్ (28) పని చేస్తున్నాడు. నిత్యం కోట్లలో లావాదేవీలు చేసే సజ్జన్‌రాజ్ జైన్ ఇంట్లో దోపిడీ చేసి.. ఆ డబ్బుతో దుబాయ్ వెళ్లి స్థిరపడాలని మాజీద్‌కు దురాశ పుట్టింది. యూసూఫ్‌గూడ, బోరబండ ప్రాంతాల్లో నివసించే తన స్నేహితులు ఫిరోజ్‌ఖాన్ (29), మహ్మద్ సలావుద్దీన్ అలియాస్ సల్లూ (29), లతీఫ్ (36), జహీర్ అహ్మద్ (29)లకు విషయాన్ని చెప్పి ముఠా ఏర్పాటు చేశాడు. సజ్జన్‌రాజ్ తన ఆఫీసులో ఉన్న సమయంలో భార్య అనితాదేవి ఒక్కతే ఇంట్లో ఉంటుందని తెలిసిన వీరు ఆ సమయంలో దోపిడీ చేయాలని పథకం వేశారు. కారు అద్దెకు తీసుకొని... ఇందులో భాగంగా మాదాపూర్‌లోని ఓ ట్రావెల్స్‌లో ఇన్నోవా కారును అద్దెకు తీసుకొని దానిలో ఈనెల మొదటివారంలో సజ్జన్‌రాజ్ ఇంటికి వెళ్లి పరిసరాలను పరిశీలించారు. ఈనెల 6న దోపిడీ చేసేందుకు వెళ్లారు. ప్రధాన నిందితుడు మాజీద్ తన యజమాని కదలికలపై ఎప్పటికప్పుడు ఫోన్లో ముఠా సభ్యులకు సమాచారం ఇస్తుండగా... ఫిరోజ్ తన బైక్‌పై దోపిడీ చేసే ఇంటి వద్దకు వెళ్లి పరిసరాలను గమనిస్తున్నాడు. మహ్మద్ సలావుద్దీన్, లతీఫ్‌లు సజ్జన్ రాజ్ ఇంటికి వెళ్లి కాలింగ్ భెల్ కొట్టారు. ఆయన భార్య అనితాదేవి లోపలి నుంచే ఎవరు అని ప్రశ్నించగా.. సార్.. కలెక్షన్ డబ్బు ఇంట్లో ఇవ్వమని పంపారని చెప్పారు. ఆమె తలుపుతీయగానే ఇంట్లోకి చొరబడ్డారు. ఆమె భర్తకు ఫోన్ చేసేందుకు యత్నించగా వెంటనే వారు తమ వెంటతెచ్చుకున్న క్లోరోఫామ్ చల్లిన కర్చీఫ్ ఆమె ముఖంపై అదిమిపట్టారు. స్పృహకోల్పోగానే చేతులు, కాళ్లు కట్టేసి కుర్చీలో కూర్చోబెట్టారు. బెడ్రూలోకి వెళ్లి కబోర్డ్స్, బ్యాగులు, బీరువా తెరిచి డబ్బులు, నగదు కోసం వెతకసాగారు. మధ్యాహ్నం 1.15కి సజ్జన్‌రాజ్ భోజనానికి ఇంటికి వచ్చి కాలింగ్ భెల్ కొట్టాడు. అతను వచ్చిన విషయాన్ని తలుపు సందులోంచి గమనించిన సలావుద్దీన్ 2వ అంతస్తు బాల్కనీ నుంచిపైప్ పట్టుకొని కిందకు దిగగా... లతీఫ్ ఒక్కసారిగా కిందకు దూకేశాడు. దీంతో లతీఫ్ రెండు కాళ్లూ, చెయ్యి విరిగాయి. అప్పటికే కారుతో సిద్ధంగా ఉన్న జహీర్ అహ్మద్‌తో కలిసి సలావుద్దీన్..., బైక్‌పై ఫిరోజ్ పారిపోయారు. పోలీసులు గాయపడ్డ లతీఫ్‌ను ఆసుపత్రికి తరలించారు. కాగా, అప్పటి నుంచీ పరారీలో ఉన్న నిందితులు ఆదివారం సాయంత్రం యూసుఫ్‌గూడలోని కృష్ణకాంత్ పార్క్ వద్ద ఉండగా.. పంజగుట్ట డీఐ వెంకటేశ్వర్‌రెడ్డి తన సిబ్బందితో వెళ్లి అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఇన్నోవా కారు, బైక్, కత్తి, క్లోరోఫామ్ బాటిల్, నాలుగు సెల్ఫోన్లు, గ్లౌజ్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఫైనాన్స్ వ్యాపారి సమయానికి ఇంటికి వెళ్లకపోతే దోపిడీ జరిగి ఉండేదని పోలీసులు తెలిపారు.