సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో రికవరీ ఏజెంట్లు రెచ్చిపోతున్నారు. రికవరీ విషయంలో ఏకంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాణి.. పీఏ శంకర్‌ను ఏజెంట్లు బెదిరింపులకు గురిచేశారు. లోన్ కట్టకపోతే పిల్లలను చంపేస్తామంటూ వార్నింగ్ ఇవ్వడం కలకలం సృష్టించింది. ఈ క్రమంలో రికవరీ ఏజెంట్ల ఆగడాలను తట్టుకోలేక శంకర్.. ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్లు, మేనేజర్‌ను అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితమే ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రికవరీ ఏజెంట్ల వేధింపులు భరించలేక జాస్తి హరిత వర్షిణి (17) తీవ్ర మనస్తాపానికి గురైంది. అనంతరం, సూసైడ్ లెటర్ రాసి వంట గదిలో ఉరి వేసుకుని మృతిచెందింది. బ్యాంకు క్రెడిట్ కార్డుపై తీసుకున్న రుణం చెల్లించాలంటూ రికవరీ ఏజెంట్ల ఆగడాలు మితిమీరడంతో ఈ దారుణం జరిగింది. వర్షిణి.. తండ్రి తీసుకున్న అప్పు కట్టాలనుకోవడమే కాక నోటికొచ్చినట్లు తిట్టడంతో ఆమె తట్టుకోలేకపోయింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగా ఉండడంతో ఆ విద్యార్థిని తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడింది.
ఇది కూడా చదవండి: పోలవరంపై చంద్రబాబు కొంగజపం
Comments
Please login to add a commentAdd a comment