మహబూబ్‌నగర్ క్రైం: హోండా కంపెనీ వాహనాలకు ఫైనాన్స్ ఇచ్చే కార్యాలయంలో రికవరీ ఏజెంట్‌గా పని చేసిన అనుభవం సంపాదించాడు. దీంతో కేవలం హోండా కంపెనీకి చెందిన యాక్టివా వాహనాలనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డాడు. రోడ్డు వెంట, ఫంక్షన్ హాళ్లమహబూబ్‌నగర్ పోలీసులకు చిక్కాడు. ఈ మేరకు వివరాలను ఎస్పీ బి.అనురాధ మంగళవారం విలేకరులకు వెల్లడించారు.
రికవరీ ఏజెంట్‌గా అనుభవంతోనే
చార్మినర్ ప్రాంతంలోని మీర్ అలంమండికి చెందిన షబ్బీర్ అలీ మణికొండ ప్రాంతంలో హోండా కంపెనీకి సంబంధించిన ద్విచక్ర వాహనాలకు రుణాలు ఇచ్చే కార్యాలయంలో రికవరీ ఏజెంట్‌గా పని చేశాడు. ఆ సమయంలో రుణం తిరిగి చెల్లించని వారి నుంచి హోండా యాక్టివాలను ఎలా తీసుకురావాలనే అనుభవం సాధించాడు. ఈ అనుభవంతో హైదరాబాద్‌కు చెందిన ఫైజల్‌తో పరిచయం పెంచుకుని ఉద్యోగం మానివేసిన ఆయన యాక్టివా వాహనాలనే చోరీ చేయడం మొదలుపెట్టాడు. ఇలా హైదరాబాద్‌లో 15, మహబూబ్‌నగర్‌లో రెండు వాహనాలను దొంగి లించి మహబూబ్‌నగర్‌లోని సద్దలగుండుకు చెందిన నదీంఇంట్లో ఉంచాడు.
నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న మహబూబ్‌నగర్ ఎస్పీ అనురాధ
వాహనాలు ఎక్కడివని నదీం ప్రశ్నిస్తే ఫైనాన్స్ డబ్బు చెల్లించకపోవడంతో లాక్కొచ్చామని నమ్మించారు. కేవలం మూడు నెలల కాలంలో ఈ వాహనాలు చోరీ చేశారు. అన్ని వాహనాలు కూడా కొత్తవి, ఇంకా రిజిస్ట్రేషన్ చేయించనవే కావడం గమనార్హం. ఈ వాహనాల విలువ రూ.10.20లక్షలు ఉంటుంది. వాహనాలను రూ.25వేల చొప్పున అమ్మేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఇంతలో సోమ వారం సాయంత్రం మహబూబ్‌నగర్ నుంచి హోండా యాక్టివాపై జడ్చర్ల వైపు షబ్బీర్ అలీ వెళ్తుండగా పోలీసులు తనిఖీ చేశారు. అయితే, ఆయన వద్ద పత్రాలు లేకపోవడంతో విచారించగా దొంగతనం బయటపడింది. కాగా, ఈ కేసులో రెండో నిందితుడు ఫైజల్ పరారీలో ఉన్నాడని ఎస్పీ అనురాధ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment