activa scooty
-
ఒక యాక్టివా.. 72 చలానాలు
నల్లకుంట: సుమారు 72 పెండింగ్ చలానాలు ఉన్న ఓ యాక్టివా ద్విచక్ర వాహనం నల్లకుంట ట్రాఫిక్ పోలీసులకు చిక్కింది. ఎస్ఐ రమేశ్ వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి సిగ్నల్స్ వద్ద నల్లకుంట ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చలానాలపై స్పెషల్ డ్రైవ్ చేట్టారు. అదే సమయంలో అంబర్‌పేటకు చెందిన సురేశ్ అనే వ్యక్తి యాక్టివా (టీఎస్11 ఈజే 7202) ద్విచక్ర వాహనంపై అటుగా వచ్చాడు. అనుమానంతో ఆ వాహనాన్ని నిలిపి తనిఖీ చేయగా 72 పెండింగ్ చలానాలు (రూ. 9,750) ఉన్నాయి. దీంతో వాహనాన్ని సీజ్ చేసిన ట్రాఫిక్ పోలీసులు స్టేషన్‌కు తరలించారు. -
హోండా కొత్త యాక్టివా 5జీ.. మార్కెట్లోకి
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్ సైకిల్స్ అండ్ హోండా స్కూటర్స్ ఇండియా కొత్త స్కూటర్‌ను లాంచ్ చేసింది. యాక్టివా వారసత్వాన్ని కొనసాగిస్తూ, హోండా యాక్టివా ను సరికొత్తగా విడుదల చేసింది. ఆటో ఎక్స్పో-2018 లో ప్రారంభించిన యాక్టివా 5జీని కొత్తగా అప్‌గ్రేడ్ చేసి మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ప్రామాణిక మోడల్ ధర రూ. 52,460 (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ) గా నిర్ణయించింది. డీలక్స్ వెర్షన్ ధర రూ. 54,325(ఎక్స్-షోరూమ్,ఢిల్లీ) గా ఉంది. స్కూటర్ల కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయనీ, డెలివరీలు వెంటనే ప్రారంభించాలని నిర్ణయించినట్టు హోండా ఒక ప్రకటనలో తెలిపింది. హోండా యాక్టివా 5జీ కొత్త అవతార్‌లో మార్పుల విషయానికి వస్తే.. కొత్త ఎల్ఈడా హెడ్ ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ డేలైట్స్ను పొందుపర్చింది. డీలక్స్ వెర్షన్లో కొత్త డిజిటల్ అనలాగ్మీటర్, 3 డీ ఎంబ్లమ్‌ను జోడించింది. 110 సీసీ నాలుగు-స్ట్రోక్ ఇంజిన్, 8బీహెచ్పీ పవర్, 9ఎన్ఎం టార్క్, గంటకు గరిష్టంగా 83 కి.మీ వేగం. సీవీటీ గేర్‌బాక్స్, రియర్ మోనోషాక్, కాంబీ బ్రేక్ సిస్టం,10-అంగుళాల అల్లాయ్ వీల్స్ విత్ 90/100 ట్యూబ్ లెస్ టైర్లు ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. డాజిల్ ఎల్లో, పర్ల్ స్పార్టన్ రెడ్ రంగుల్లో ఈ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. -
హోండా యాక్టివా ఫైనాన్స్‌లో కొన్నారా..
మహబూబ్‌నగర్ క్రైం: హోండా కంపెనీ వాహనాలకు ఫైనాన్స్ ఇచ్చే కార్యాలయంలో రికవరీ ఏజెంట్‌గా పని చేసిన అనుభవం సంపాదించాడు. దీంతో కేవలం హోండా కంపెనీకి చెందిన యాక్టివా వాహనాలనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డాడు. రోడ్డు వెంట, ఫంక్షన్ హాళ్లమహబూబ్నగర్ పోలీసులకు చిక్కాడు. ఈ మేరకు వివరాలను ఎస్పీ బి.అనురాధ మంగళవారం విలేకరులకు వెల్లడించారు. రికవరీ ఏజెంట్‌గా అనుభవంతోనే చార్మినర్ ప్రాంతంలోని మీర్ అలంమండికి చెందిన షబ్బీర్ అలీ మణికొండ ప్రాంతంలో హోండా కంపెనీకి సంబంధించిన ద్విచక్ర వాహనాలకు రుణాలు ఇచ్చే కార్యాలయంలో రికవరీ ఏజెంట్‌గా పని చేశాడు. ఆ సమయంలో రుణం తిరిగి చెల్లించని వారి నుంచి హోండా యాక్టివాలను ఎలా తీసుకురావాలనే అనుభవం సాధించాడు. ఈ అనుభవంతో హైదరాబాద్‌కు చెందిన ఫైజల్‌తో పరిచయం పెంచుకుని ఉద్యోగం మానివేసిన ఆయన యాక్టివా వాహనాలనే చోరీ చేయడం మొదలుపెట్టాడు. ఇలా హైదరాబాద్‌లో 15, మహబూబ్‌నగర్‌లో రెండు వాహనాలను దొంగి లించి మహబూబ్‌నగర్‌లోని సద్దలగుండుకు చెందిన నదీంఇంట్లో ఉంచాడు. నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న మహబూబ్‌నగర్ ఎస్పీ అనురాధ వాహనాలు ఎక్కడివని నదీం ప్రశ్నిస్తే ఫైనాన్స్ డబ్బు చెల్లించకపోవడంతో లాక్కొచ్చామని నమ్మించారు. కేవలం మూడు నెలల కాలంలో ఈ వాహనాలు చోరీ చేశారు. అన్ని వాహనాలు కూడా కొత్తవి, ఇంకా రిజిస్ట్రేషన్ చేయించనవే కావడం గమనార్హం. ఈ వాహనాల విలువ రూ.10.20లక్షలు ఉంటుంది. వాహనాలను రూ.25వేల చొప్పున అమ్మేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఇంతలో సోమ వారం సాయంత్రం మహబూబ్‌నగర్ నుంచి హోండా యాక్టివాపై జడ్చర్ల వైపు షబ్బీర్ అలీ వెళ్తుండగా పోలీసులు తనిఖీ చేశారు. అయితే, ఆయన వద్ద పత్రాలు లేకపోవడంతో విచారించగా దొంగతనం బయటపడింది. కాగా, ఈ కేసులో రెండో నిందితుడు ఫైజల్ పరారీలో ఉన్నాడని ఎస్పీ అనురాధ వెల్లడించారు. -
రోడ్డుప్రమాదంలో ఇద్దరు మహిళల దుర్మరణం
విజయవాడ: ద్విచక్ర వాహనంపై నుంచి జారిపడి ఇద్దరు మహిళలు మృతిచెందిన విషాద సంఘటన ఆదివారం ఉదయం కృష్ణా జిల్లాలో జరిగింది. చల్లపల్లి మండలం నడకుదురు వద్ద యాక్టివాపై వెళుతున్న శివలీల, అంకమ్మ అనే ఇద్దరు మహిళలు ప్రమాదవశాత్తూ జారిపడి మృతిచెందారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. విజయవాడ నుంచి హోండా యాక్టివాపై సైకం శ్రీలక్ష్మి, పీతా అంకమ్మ, శివలీల విజయవాడ నుండి నాగాయలంక వెళుతుండగా వెలివోలు వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ను తప్పించబోయి ద్విచక్ర వాహనం పడిపోయింది. ఈ సంఘనలో అంకమ్మ, అక్కడికక్కడే మరణించగా, శివలీలను108 వాహనంలో తీసుకెళుతుండగా మృతి చెందింది. వీరు నాగాయలంకకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.