రోడ్డుప్రమాదంలో ఇద్దరు మహిళల దుర్మరణం
విజయవాడ: ద్విచక్ర వాహనంపై నుంచి జారిపడి ఇద్దరు మహిళలు మృతిచెందిన విషాద సంఘటన ఆదివారం ఉదయం కృష్ణా జిల్లాలో జరిగింది. చల్లపల్లి మండలం నడకుదురు వద్ద యాక్టివాపై వెళుతున్న శివలీల, అంకమ్మ అనే ఇద్దరు మహిళలు ప్రమాదవశాత్తూ జారిపడి మృతిచెందారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
విజయవాడ నుంచి హోండా యాక్టివాపై సైకం శ్రీలక్ష్మి, పీతా అంకమ్మ, శివలీల విజయవాడ నుండి నాగాయలంక వెళుతుండగా వెలివోలు వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ను తప్పించబోయి ద్విచక్ర వాహనం పడిపోయింది. ఈ సంఘనలో అంకమ్మ, అక్కడికక్కడే మరణించగా, శివలీలను108 వాహనంలో తీసుకెళుతుండగా మృతి చెందింది. వీరు నాగాయలంకకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.