సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్ సైకిల్స్ అండ్ హోండా స్కూటర్స్ ఇండియా కొత్త స్కూటర్‌ను లాంచ్ చేసింది. యాక్టివా వారసత్వాన్ని కొనసాగిస్తూ, హోండా యాక్టివా ను సరికొత్తగా విడుదల చేసింది. ఆటో ఎక్స్‌పో-2018 లో ప్రారంభించిన యాక్టివా 5జీని కొత్తగా అప్‌గ్రేడ్ చేసి మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ప్రామాణిక మోడల్ ధర రూ. 52,460 (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ) గా నిర్ణయించింది. డీలక్స్ వెర్షన్ ధర రూ. 54,325(ఎక్స్-షోరూమ్,ఢిల్లీ) గా ఉంది. స్కూటర్ల కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయనీ, డెలివరీలు వెంటనే ప్రారంభించాలని నిర్ణయించినట్టు హోండా ఒక ప్రకటనలో తెలిపింది.
హోండా యాక్టివా 5జీ కొత్త అవతార్‌లో మార్పుల విషయానికి వస్తే.. కొత్త ఎల్‌ఈడా హెడ్ ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ డేలైట్స్‌ను పొందుపర్చింది. డీలక్స్ వెర్షన్లో కొత్త డిజిటల్ అనలాగ్‌మీటర్, 3 డీ ఎంబ్లమ్‌ను జోడించింది. 110 సీసీ నాలుగు-స్ట్రోక్ ఇంజిన్, 8బీహెచ్‌పీ పవర్, 9ఎన్‌ఎం టార్క్, గంటకు గరిష్టంగా 83 కి.మీ వేగం. సీవీటీ గేర్‌బాక్స్, రియర్ మోనోషాక్, కాంబీ బ్రేక్ సిస్టం,10-అంగుళాల అల్లాయ్ వీల్స్ విత్ 90/100 ట్యూబ్ లెస్ టైర్లు ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. డాజిల్ ఎల్లో, పర్ల్ స్పార్టన్ రెడ్ రంగుల్లో ఈ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment