సరికొత్త రంగుల్లో యాక్టివా-ఐ | Honda launches 2016 Activa with three new colours | Sakshi
Sakshi News home page

సరికొత్త రంగుల్లో యాక్టివా-ఐ

Published Mon, May 30 2016 4:44 PM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM

సరికొత్త రంగుల్లో  యాక్టివా-ఐ

సరికొత్త రంగుల్లో యాక్టివా-ఐ

హైదరాబాద్ : హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ తన ప్రముఖ స్కూటర్ యాక్టివా-ఐ కి కొత్త రంగులు అద్దింది. మూడు కొత్త రంగుల్లో ఈ స్కూటర్ ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. యూత్ ను ఎక్కువగా ఆక్టటుకోవడం కోసం, తాజాదనం కోసం యాక్టివా-ఐ ని రంగురంగుల్లో మార్కెట్లోకి తీసుకొస్తున్నామని కంపెనీ తెలిపింది. 2016 కు ఈ యాక్టివా-ఐ ఏడవ మోడల్. ఫ్యామిలీ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకోవడమే లక్ష్యంగా యాక్టివా-ఐ మార్కెట్లో నూతనావిష్కరణలతో కంపెనీ ప్రవేశపెడుతోంది.

పెర్ల్ ట్రాన్స్ ఎల్లో, కాండీ జాజీ బ్లూ కొత్త కలర్స్ తో పాటు పెర్ల్ అమేజింగ్ వైట్ అండ్ బ్లాక్ లో కూడా ఈ యాక్టివా-ఐ అందుబాటులోకి వచ్చింది. డీలక్స్ రేంజిలో ఇంపీరియల్ రెడ్ మెటాలిక్ రంగులో ఆక్టివా ఐ లభిస్తుంది. దీనితో పాటు పియర్ల్ అమేజింగ్ వైట్ మరియు ఆర్చిడ్ పర్పుల్ మెటాలిక్ రంగుల్లో కూడా ఈ యాక్టివా-ఐ లభిస్తుందని కంపెనీ తెలిపింది.

రెగ్యులర్ గా తమ ఉత్పత్తులకు తాజాదనాన్ని చేకూరుస్తూ.. వినియోగదారులకు ఆశ్చర్యం కలిగించడమే తమ లక్ష్యమని హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యాద్ విందర్ సింగ్ గులెరియా తెలిపారు. ఈ తాజాదనంతో టూ-వీలర్ పరిశ్రమలో యాక్టివా-ఐ దూసుకెళ్తోందని తాము విశ్వసిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement